వాక్యసందేశముPost Date:2014-06-20//No:62

యేసుక్రీస్తు భారతదేశం వచ్చారా?ప్రస్తుత ప్రపంచంలో కోట్లాదిమంది యొక్క నిరీక్షణకు ఆలంబన, విశ్వాసానికి మూలం మరియు ఆధ్యాత్మిక బలం ప్రభువైన యేసుక్రీస్తు. జగద్రక్షకుని జనన, మరణ, పునరుత్థానములు మానవుని ప్రశ్నలకు, సమస్యలకు అద్భుత సమాధానాలు. క్రీస్తు ప్రభువును గుండెల్లోకి ఆహ్వానించిన వారు అనుభవిస్తున్న ఆనందాన్ని వర్ణించడానికి భాష చాలదు. ఆ దయామయుని ప్రసన్న వదనం ఒక్కసారి వీక్షిస్తే చాలు... జీవితం ధన్యం. వీనులకు విందులు చేసే యేసయ్య బోధల ద్వారా అనేక జీవితాలు పావనమయ్యాయి. మహోన్నతుని దివ్య నామ స్మరణ గొప్ప ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తుంది. కలువరి సిలువలో చిందించబడిన రుధిరము సర్వ పాపాలకు పరిహారము. తేజోమానమైన ఆయన స్పర్శ ప్రతీ రుగ్మతను దూరం చేస్తుంది. రుచి చూసిన వారు మాత్రమే మహిమాన్వితమైన ఆయన ఔన్నత్యం గూర్చి గళమెత్తి చెప్పగలరు.

అయితే కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలన్నట్టు ఈనాడు చాలామంది యేసుక్రీస్తు దైవత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రపంచంలో ఏ ఒక్కరి మీద జరుగనంత భయంకరమైన దాడి ఆయన మీద జరుగుచున్నది. ఆయన మహోన్నత జీవితాన్ని ప్రశ్నించేవారు కొందరైతే, ఆయన ఉనికినే ప్రశ్నించేవారు మరికొందరు. ఈనాటి మన భారతీయులు కూడా యేసుప్రభుకి అంత గొప్పదనం కలుగడానికి కారణం మేమే అని చెప్పుకుంటున్నారు. యేసుక్రీస్తు భారతదేశం వచ్చి అనేక విషయాలు ఇక్కడే నేర్చుకుని ఇశ్రాయేలు దేశంలో వాటిని ప్రకటించాడని అనేకమంది వాదిస్తున్నారు.

ఇంటర్‌నెట్‌లలో గానీ, న్యూస్‌ పేపర్‌లలో గానీ ఎక్కడ చూసినా యేసుక్రీస్తు జీవనం 12-30 సం||రాల వయస్సు వరకు బైబిల్‌లో ఎక్కడ లేదు గనుక ఆ సమయంలో ఆయన భారతదేశం వచ్చారనే వార్త వినబడుతుంది. చాలామంది హైందవ పెద్దలు కూడా ఇదొక ప్రాముఖ్యమైన అంశంగా వారి యొక్క వెబ్‌సైట్‌లలో పొందుపరచడం ఒకింత విచారాన్ని కలిగిస్తుంది. కొంతమంది క్రైస్తవ వ్యతిరేకులు యేసుక్రీస్తు కాశ్మీర్‌ వచ్చాడని పాంప్లెట్స్‌ ప్రింట్‌ చేస్తూ పల్లెల్లో, గ్రామాలలో కూడా పంచిపెడుతూ క్రైస్తవ సంఘాన్ని పాడుచేయాలని ప్రయత్నిస్తున్నారు. రక్షకుడైన యేసుక్రీస్తు భారతదేశ ఆగమనం గూర్చి జరుగుచున్న అసత్య ప్రచారంలో వారు చేస్తున్న ఆరోపణలను గమనిద్దాం!

అసత్య ప్రచారం 1 : యేసుక్రీస్తు 12-30 సం||ల వయస్సు మధ్య భారతదేశంలోనే ఉన్నాడు (MISSING YEARS OF JESUS CHRIST). బైబిల్‌లో యేసుక్రీస్తు 12 సం||ల వయస్సుకు ముందు జీవితం మరియు 30 సం||ల తరువాత నుండి సేవా జీవితం వ్రాయబడియుంది. మధ్యలో 18 సం||ల జీవితం భారతదేశంలోనే గడిచింది. బైబిల్‌ రచయితలు ఈ విషయాన్ని దాచిపెట్టారు.

అసత్య ప్రచారం 2 : 'యేసుక్రీస్తు భారతదేశాన్ని దర్శించి కొంతమంది హైందవ మత పెద్దలను కలుసుకొని హిందుత్వం యొక్క గొప్పతనాన్ని అర్ధం చేసుకున్నారు'. ఉత్తర మరియు దక్షిణ భారతదేశంలోని ప్రధాన పుణ్యక్షేత్రాలను దర్శించి, ఆశ్రమాలలో జీవించి హైందవ మత పెద్దల దగ్గర జ్ఞానయోగం సంపాదించారు.

అసత్య ప్రచారం 3 : హైందవ పెద్దల దగ్గర జ్ఞానము సంపాదించుకుని భారతదేశంలోని తక్కువ కులస్థులకు, నిమ్న జాతులవారికి సువార్త అనగా దేవుని గురించి బోధించుచున్నప్పుడు కొంతమంది అగ్రకులస్థులు యేసుప్రభువును బెదిరించినప్పుడు ఆయన భయపడి పారిపోయి కొంతమంది బౌద్ధ బికక్షువుల దగ్గర బుద్ధుని బోధలు విని శాంతిగా జీవించారు.

అసత్య ప్రచారం 4 : భారతదేశంలోని బీహార్‌ రాష్ట్రంలోని నలంద యూనివర్శిటీలో ఏకధాటిగా 16 సం||లు బుద్ధుని బోధలపై అధ్యయనం చేసి తర్వాత సరాసరి యెరూషలేము వెళ్ళి శాంతి బోధలు చేసాడు. ఇంతటి మహత్కరమైన బోధలు కేవలం బౌద్ధమతం వల్లనే సాధ్యం.

అసత్య ప్రచారం 5 : యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు సిలువలో ఆయన స్పృహ తప్పి పడిపోగా రోమన్‌ సైనికులందరూ ఆయన చనిపోయాడని తలంచారు. వెంటనే ఆయన దేహమును క్రిందకు దింపి కొన్ని సుగంధద్రవ్యాలు పూయగానే ఆయన లేచి మగ్దలేనే మరియను వెంటబెట్టుకుని పోయి ఆమెను వివాహమాడి బిడ్డలను కని తన 120వ యేట చనిపోయారు. యేసుక్రీస్తు సమాధి కాశ్మీర్‌లో ఉన్నది. మరియమ్మ సమాధి ప్రస్తుత పాకిస్తాన్‌లో ఉంది.

పైన ప్రస్తావించబడిన అసత్య ప్రచారాలను నిశితంగా పరిశీలిస్తే యేసుక్రీస్తు 12-30 సం||లు మధ్యకాలంలోనూ మరియు సిలువ వేయబడిన తర్వాత కూడా భారతదేశం వచ్చి అందరివలె సామాన్య మనిషిగా తన 120వ యేట చనిపోయాడని కొందరు నమ్ముతున్నారు. అసలు సిలువలో చనిపోలేదని వాదించడం ద్వారా తమ మతమే గొప్పదని ప్రకటించుకోవాలని అనేకమంది ప్రయత్నిస్తున్నారు.

అసత్య ప్రచారం ఏవిధంగా వీగిపోయిందో తెలుసుకొనే ముందు యేసుక్రీస్తు కాశ్మీర్‌ వచ్చాడు అనే అంశాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన కొంతమంది వ్యక్తుల గురించి తెలుసుకుందాం...

1. లూయిస్‌ జకోలియట్‌ (1869)

2. నికోలస్‌ నోటోవిచ్‌ (1890)

3. మిర్జా గులామ్‌ అహ్మద్‌ (1899)

4. లెవీ డౌలింగ్‌ (1908)

5. ఎరిక్‌ లుడెన్‌డార్ఫ్‌ (1930)

6. హాల్గర్‌ కర్‌స్టన్‌ (1984)

వీటితో పాటుగా ఈ అంశానికి సంబంధించిన కొన్ని పుస్తకాలను కూడా తెలుసుకుందాం...

1. Lost years of jesus - ELIZABETH CLARE

2. Jesus lived in India - HOLGER KERSTEN

3. The Unknown life of jesus Christ - NOTOVITCH

4. Aquarian Gospel of jesus Christ - LEVI H DOWLING

5. The jesus Mystery - JANET BOCK

6.Jesus in India - MIRZA GULAM AHMAD

యేసుక్రీస్తు దైవత్వం మీద బురదజల్లే ఈ పుస్తకాలు కొన్ని వేలల్లో అమ్ముడవుతున్నాయి. క్రైస్తవ వ్యతిరేకులైన వారందరు ఇలాంటి పుస్తకాలు కొని చాలా శ్రద్ధగా చదువుచున్నారు. ఇలాంటి పుస్తకాలు కొన్నివేలు వచ్చినా... నిజమైన విశ్వాసి యొక్క విశ్వాసాన్ని ఒక్క శాతం కూడా తగ్గించలేవు. కారణమేమంటే యేసుప్రభువునందలి విశ్వాసం లోక సంబంధమైన పుస్తకాల మీద ఆధారపడింది కాదు... అది వ్యక్తిగత అనుభవం. ఒక వ్యక్తి యేసుప్రభువు యొక్క శక్తిని, ప్రేమను రుచి చూసిన తర్వాత వెనుకకు మళ్ళే అవకాశమే లేదు. అయితే, నూతనంగా ప్రభువును తెలుసుకొని అప్పుడప్పుడే ఎదుగుచున్న వారికి ఈలాంటి పుస్తకాలు అనుమానాలు,
యేసుక్రీస్తు