వాక్యసందేశముPost Date:2014-06-13//No:61

తండ్రితండ్రిగా దేవుడు ఒక పెద్ద బాధ్యత మన మీద ఉంచాడు. తండ్రిగా ఉండడం గొప్ప ఆశీర్వాదము. ఎందుకంటే తండ్రిని చూచినపుడెల్ల మనకు ఇంకొక తండ్రి జ్ఞాపకానికి రావాలి. ఆయనే పరలోకపు తండ్రి. ఆయనకు మాదిరిగా మనం భూమి మీద ఉన్నాము. ఇక్కడ నాన్నను చూచినపుడు నాకు ఇంకొక నాన్న పరలోకంలో ఉన్నాడని మనం అనేకసార్లు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. బైబిల్‌ చరిత్రలో ముగ్గురే తండ్రిలేనటువంటి వారు ఉన్నారు. మీరు తండ్రి ప్రమేయం లేకుండా జన్మించినవారు.

1. ఆదాముకు నాన్నలేడు. ఎందుకంటే ఆదామును దేవుడు సృష్టించాడు.

2. హవ్వకు కూడా నాన్నలేడు. దేవుని స్వరూపంలో దేవుడు వారిని సృజించాడు. బహుశ వారు నాన్న అనే మాట దేవుని అన్నారేమో.

3. మెల్కీసెదెకు అనే యాజకుడు. ఇతడు కూడా తండ్రిలేనివాడు. అమ్మానాన్నలు లేనటువంటివాడు. ఈ ముగ్గురే బైబిల్‌ చరిత్రలో (హెబ్రీ 7:3) మనకు కనబడుతున్నారు. తక్కిన వారందరికి నాన్న అనే పదము దాదాపు పరిచయమే.

ప్రియమైన దేవుని బిడ్డలారా! బైబిల్‌ గ్రంధములో చూస్తే మనకు నిజమైన తండ్రి ఉన్నాడు. ఆ నిజమైన తండ్రి దేవుడు. బైబిల్‌ గ్రంధములో యోబు అనే భక్తుడు ఉన్నాడు.

1. యోబు ఆదర్శవంతమైన తండ్రి : అరుణోదయమున లేచి తన పిల్లలకొరకు మొరపెట్టే స్వభావం కలిగినటువంటివాడు. వారివారి విందు దినములు పూర్తికాగా యోబు తన కుమారులు పాపముచేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్ర పరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహనబలి నర్పించుచు వచ్చెను (యోబు 1:5). ఒక్కొక్కరిని పిలిపించి వారి గూర్చి ప్రార్ధన చేస్తున్నాడు. కనుక యోబు ఒక ఆదర్శవంతమైన తండ్రిగా ఉన్నాడు.

2. యోబు ఆదర్శవంతమైన భర్త : అతని భార్య వచ్చి దేవుని దూషించి చావుమని చెప్పి సలహా ఇచ్చినపుడు యోబుగారు ఏమాత్రము కూడా అధైర్యపడలేదు. మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నీవు మాట్లాడుతున్నావు అని మాత్రమే అన్నాడు. గనుక ఆదర్శవంతమైన భర్తగా కూడా ఉన్నాడు.

3. యోబు ఆదర్శవంతమైన వ్యాపారవేత్త : అతనికి ఏడుగురు కుమారులును, ముగ్గురు కుమార్తెలును కలిగిరి, అతనికి 7 వేల గొఱ్ఱెలను, ఒంటెలును, 500 జతల యెడ్లను, 500 ఆడ గాడిదలను కలిగి బహుమంది పనివారును, అతనికి ఆస్తిగా నుండెను. గనుక తూర్పుదిక్కు జనులందరిలో అతడు గొప్పవాడుగా ఉన్నాడని వ్రాయబడింది (యోబు 1:2,3).

4. యోబు ఆదర్శవంతమైన స్నేహితుడు : యోబు స్నేహితులు యోబును అవమానపరచినపుడు, దేవుడు యోబు స్నేహితులతో చెప్పాడు. మీరు మీ స్నేహితుడైన యోబు దగ్గరికి వెళ్ళండి. అతడు మీ కొరకు ప్రార్ధన చేస్తాడు. అప్పుడు నేను మిమ్మల్ని క్షమిస్తాను. అంటే యోబు భక్తుడు తన మిత్రుల కొరకు ప్రార్ధన చేసాడు. ప్రార్ధన చేసినపుడు తన స్నేహితులు క్షమ పొందినట్లుగా మనం బైబిల్‌ గ్రంధములో చూస్తున్నాం. యోబు ఒక మంచి స్నేహితుడిగా కూడా ఉన్నాడు.

5. యోబు ఆదర్శవంతమైన భక్తుడు : తండ్రి ఉన్నవానికి తండ్రి విలువ తెలియదు. తండ్రిలేని వానికి తండ్రి విలువ తెలుస్తుంది. మనందేవుని పిల్లలము. పరలోకంలో మనకొక తండ్రి ఉన్నాడు. గనుక మనం అనాధలం కాము. ప్రతి పునరుత్థాన దినమందు మనం పవిత్ర దేవాలయమునకు వెళ్ళి ప్రభువు నేర్పిన ప్రార్ధన చెబుతున్నపుడంతా పరలోకమందున్న మా తండ్రీ ! అని ప్రార్ధిస్తాం. ఆరాధన అనంతరం దేవాలయము నుండి వచ్చి మీ నాన్న ఏం చేస్తుంటాడు అని ఎవరైనా అడిగితే నాకు నాన్న లేడండి చనిపోయాడు నేను అనాధను అని చెబుతాం. ఇలా చెప్పేవాళ్ళు పరలోకంలో మనకు శాశ్వతమైన ఒక ఆధ్యాత్మిక తండ్రి వున్నాడని మరచిపోతుంటారు. ఆయన ప్రేమను విస్తరిస్తుంటారు. గనుక మనం అనాధులం కాము. యేసుప్రభువు జీవితంలో భూమి మీద ఆయనకు తండ్రిలేడు. చిన్నతనంలోనే తన తండ్రిని కోల్పోయాడు. కాని పరలోకంలో తండ్రి ఉన్నాడు. భూమిమీద ఆయనకు తల్లి ఉంది. కాని పరలోకంలో ఆయనకు తల్లిలేదు. కనుక ఈ లోకంలో తల్లిదండ్రులు లేని వారి యొక్క బాధ ఏమిటో యేసుప్రభువుకు బాగా తెలుసు. ఆ కారణాన యేసుప్రభువు తన శిష్యులను ఉద్దేశించి మనం అనాధులం కాకూడదని 'పరలోకమందున్న తండ్రి' అనే ఆదర్శ ప్రార్ధన నేర్పించాడు.

పాతనిబంధనలో దేవున్ని తండ్రి అని పిలిచిన ఛాయలు మనకెక్కడా కానరావు. హెబ్రీయులు దేవున్ని తండ్రిగా కాక తండ్రి అని పిలవడానికి వెరచి 'అబ్బీ' అని సంభోదించేవారు. అబ్బీ అంటే యజమానుడు అని భావం. కాని దేవుడు మనకు యజమానిగా కాక తండ్రిగా ఉండాలని, దేవుని మనం అబ్బా అని పిలవాలని యేసుప్రభువు కోరుకున్నాడు. అబ్బా అంటే తండ్రి అని అర్ధం. కనుక దేవుడు మనకు యజమానుడిగా కాక తండ్రిగా ప్రత్యక్షపరుచుకున్నాడు.ఈ సుగుణములన్ని వున్నవాడే నిజమైన తండ్రి దేవునిలో పై లక్షణములన్నీ ఉన్నట్టుగా దేవుని వాక్యం ప్రభోదిస్తుంది.

1. తండ్రి జాలిపడతాడు : 103వ దావీదు కీర్తన 13వ వచనంలో తండ్రి తన కుమారుల యెడల జాలిపడునట్లు యెహోవా తన యెడల భయభక్తులు గలవారి యందు జాలిపడును అని దావీదు భక్తుడు గానం చేసాడు. ఈ వచనంలో దేవుడు తన జాలిని తండ్రి జాలితో పోల్చుకున్నాడు. దేవుడు దయామయుడు, సానుభూతిపరుడు, తన పిల్లల సంక్షేమాన్ని అన్నిటికంటే ముఖ్యంగా వాంఛిస్తాడు. దానికోసమే పనికొనసాగిస్తాడు. దేవుడు మన రక్షణ విషయమై జాలిపడ్డాడు. మనమాయన పిల్లలుగా ఉండాలని ఆశను వ్యక్తం చేశాడు. మనము ఆయనను అంగీకరిస్తే ఆయనకు పిల్లలం కాగలుగుతాం. మనకు సొంత గృహం కావాలని, వస్తు వాహనాలు కావాలని మన సంక్షేమమే ఆయన ధ్యేయంగా భావిస్తూ ఎల్లవేళలా మన యెడల జాలి కలిగియున్నాడు. బైబిలు మిషను స్థాపించిన ముంగమూరి దేవదాసయ్యగారు ఆంధ్రక్రైస్తవ కీర్తన పుస్తకంలో 112వ పాటను 'కొడుకులపై తండ్రి జాలిపడు విధముగా భక్తిపరుల యెడల జాలిపడును దేవుండు' అని కీర్తన రచించాడు దేవునికి స్తోత్రములు, మన యెడల జాలికలిగినటువంటి దేవుడు మనకున్నాడు.

2. తండ్రి శిక్షిస్తాడు : సామెతల గ్రంధము 13వ అధ్యాయము మొద
తండ్రి