వాక్యసందేశముPost Date:2014-06-06//No:60

ప్రార్ధన  ప్రార్ధన అంటే యేసుతో మాట్లాడడం.

ప్రార్ధన అంటే సంపూర్ణ విధేయతతో ప్రభువును, రక్షకుడునైన యేసుక్రీస్తు మధ్యవర్తిత్వం ద్వారా నీతియుక్తమైన అవసరతల కోసం మన విన్నపాలు దేవునికి సమర్పించడం. ప్రార్ధన అంటే యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ శక్తితో తండ్రికి ఆపాదించిన ఆరాధన' - డాక్టర్‌ హెచ్‌.డబ్ల్యు.ఫ్రాష్ట్‌, 'ప్రార్ధన అంటే మానవుని ఆత్మ దేవునితో మాట్లాడడం'.

ప్రార్ధన నాలుగు విషయాలతో కూడి ఉండాలి - క్రియలు - క్రియలు అనేమాట గుర్తుంచుకోండి.

ఆరాధించడం (పూజించడం) - ఇది దేవునికి ఆత్మ చేసే స్తుతి, ఆరాధన, కీర్తన 95:6.

పాపపు ఒప్పుకోలు - తెలిసిన ప్రతి పాపాన్ని గురించి పశ్చాత్తాపపడడం. కీర్తన 32:5.

కృతజ్ఞతలు చెల్లించడం - ఫిలిప్పీ 4:6, అన్ని విషయాల్లో, ఏ విషయానికైనా స్తుతులు చెల్లించడం.

విజ్ఞాపన చేయడం - విజ్ఞాపనలు, ప్రార్ధనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు, 1తిమోతి 2:1.

మన ప్రార్ధనలు దేవునికి చేరాలి, అపొ.కా.12:5. యేసుక్రీస్తు నామంలో చేయాలి, యోహాను 14:13. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రార్ధన చేయాలి, ఎఫెసీ 6:18.

1. ప్రార్ధన ఎక్కడ చేయాలి Where to Pray

1. ప్రతీచోట. 1తిమోతి 2:8, 'కావున ప్రతి స్థలమందును పురుషులు ... ప్రార్ధన చేయవలెను.'

2. రహస్య స్థలంలో. మత్తయి 6:6, 'నీవు ప్రార్ధన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్ధన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును.'

3. దేవాలయంలో (చర్చి). లూకా 18:10, 'ప్రార్ధన చేయుటకై ఇద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి.'

కీర్తన 26:12, గొప్ప సమాజం ఎదుట ప్రార్ధన చేయడం. 1రాజులు 8:22-53 లో సొలొమోను. రహస్య ప్రార్ధన రహస్య స్థలంలో చేయాలి. కుటుంబ ప్రార్ధన చిన్న గుంపు మధ్యలో చేయాలి. బహిరంగ ప్రార్ధన సమాజం ఎదుట చేయాలి.

2. ప్రార్ధన ఎప్పుడు చేయాలి When to Pray

1. నిత్యమూ. లూకా 18:1, 'మనుష్యులు ప్రార్ధన చేయుచుండవలెను.' 1థెస్స 5:17, 'యెడతెగక ప్రార్ధన చేయవలెను.'

2. ఉదయకాలం. కీర్తన 5:3, 'యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడెను, ఉదయమున నా ప్రార్ధన నీ సన్నిధికి సిద్ధము చేసికొనికొందును.'

3. మధ్యాహ్నం, సాయంత్రం. కీర్తన 55:17, 'సాయంత్రమున, ఉదయమున, మధ్యాహ్నమున ధ్యానించుచు మొఱ్ఱపెట్టుచున్నాను.'

4. ప్రతిరోజూ. కీర్తన 86:3, 'ప్రభువా దినమెల్ల నీకు మొఱ్ఱపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము.'

5. రాత్రి, పగలు. కీర్తన 88:1, 'యెహోవా, నా రక్షణకర్తవగు దేవా, రాత్రివేళ నీ సన్నిధిని మొఱ్ఱపెట్టుచున్నాను.' దానియేలు రోజుకు మూడుసార్లు ప్రార్ధన చేశాడు, దాని 6:10.

3. ప్రార్ధనలో ఉండవలసిన విషయాలు Subjects to Pray

 1. మత్తయి 6:9-13, (ప్రభువు నేర్పిన ప్రార్ధన) - ప్రభువు రెండవ రాకడ, దేవుని చిత్తం నెరవేర్చబడడం, అనుదిన ఆహారం, పాప క్షమాపణ, నడిపింపు, శోధనలపై, పాపంపై విజయం.

2. యాకోబు 5:13-16, రోగుల కోసం

3. 1తిమోతి 2:1-14, మనుషులందరి కోసం, రాజులు, అధికారుల కోసం

4. యెషయా 38:1-5, దీర్ఘాయువు కోసం

5. దాని 6:18-23, వ్యక్తిగత భద్రత, ఇతరుల భద్రత కోసం

6. 1రాజులు 3:5-9, జ్ఞానం, వివేచన కోసం

7. మత్తయి 6:25-34, వస్త్రాలు, ఇల్లు, ఆహారం కోసం

8. రోమా 1:10, క్షేమకరమైన ప్రయాణం కోసం

9. కొలస్సీ 1:28, ప్రతి క్రైస్తవ విశ్వాసీ క్రీస్తులో సంపూర్ణులు కావడం కోసం

10. మత్తయి 5:38-48, నిన్ను ద్వేషించేవారి కోసం, హింసించేవారి కోసం, మీ విరోధుల కోసం

11. 1తిమోతి 5:17, సంఘంలో నీ పైవారి కొరకు

4. ప్రార్ధన ఎలా చేయాలి How to Pray

1. మనం పరిశుద్ధాత్మచే నడిపింపబడాలి. రోమా 8:26,27,

'.....మనము యుక్తముగా ఏలాగు ప్రార్ధన చేయవలెనో మనకు తెలియదు గానీ ఉచ్ఛరింపశక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనములు చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్తప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు.'

2. దేవుని ఉనికిలో నమ్మకంతో ప్రార్ధన చేయాలి. హెబ్రీ 11:6, 'విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులైయుండుట అసాధ్యము; దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయుచున్నాడనియు నమ్మవలెను గదా.'

3. విశ్వాసంతో చేసే ప్రార్ధనకు ఆయన జవాబు దయచేస్తాడని నమ్మాలి. హెబ్రీ 11:6, '....తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడు.'

4. ప్రార్ధనలో పట్టుదల ఉండాలి. లూకా 18:1-8, పట్టుదలతో ప్రార్ధన చేసిన స్త్రీ ఫలితం పొందుతుంది. లూకా 11:1-3, పట్టుదలతో తలుపు తట్టినవాడు ఆహారము (రొట్టె) ను పొందాడు.'

5. తగ్గింపు హృదయంతో ప్రార్ధించాలి. 2దిన 7:14, 'నా పేరు పెట్టబడిన నా జనులు, తమ్మును తాము తగ్గించుకొని ప్రార్ధన చేసి నన్ను వెదకి ...'

6. మన పాపాల విషయమై పశ్చాత్తాపపడేందుకు సిద్ధపడాలి. 2దిన 7:14, '..... వారు తమ చెడు మార్గములను విడిచిన యెడల ....'

5. ప్రార్ధన విషయంలో అనుసరించాల్సిన షరతులుConditions of Prayer

1. దేవుని చిత్తంలో ప్రార్ధించాలి. రోమా 8:27, (4వ భాగంలో ఉదహరించబడింది) మత్తయి 26:39, యేసు ఇలా ప్రార్ధించాడు, '... అయినను నా యిష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము.'

2. ప్రభువు మన అపరాధాలను క్షమించి, మన ప్రార్ధనలకు జవాబు ఇచ్చే ముందు ఇతరుల అపరాధాలను మనం క్షమించాలి. మార్కు 11:25, 'మీరు నిలువబడి ప్రార్ధన చేయునప్పుడెల్లను మీ విరోధులను క్షమించుడి.'

3. విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్ధించాలి. మార్కు 11:24, 'ప్రార్ధన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి.' యాకోబు 1:6,7, 'అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలిచేత రేపబడి యెగిరిపడు సముద్ర తరంగములను పోలియుండును.'

4. ఆయన ఆజ్ఞలు పాటించాలి. 1యోహాను 3:22, 'మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరకును.'

5. క్రీస్తునందు నిలిచియుండాలి. యోహాను 15:7, 'నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండిన యెడల మీకేది యిష్టమో
ప్రార్ధన