వాక్యసందేశముPost Date:2014-05-16//No:56
పది ఆశీర్వాదములు
'నీ చిత్తమే సిద్ధించుగాక'. మత్తయి 26:42.
దేవుని చిత్తము పేరుకు మాత్రము లేక బలవంతమును బట్టి చేసేదికాదు. అది సంతోషముతో చెయ్యవలసినది. దేవుని చిత్తము చేసినపుడు దొరుకు నెమ్మది లోకము ఇవ్వలేని సంతోషముగా నున్నది. దేవుని చిత్తము చేసినపుడు ఆయనను సంతోషపెట్టు చున్నాము. అంతేకాదు, నిత్యకాలము దేవుని సముఖములో స్థిరముగా నిలచెదము.
ప్రభువు చిత్తమును చేయుటవలన కలుగు ఆశీర్వాదములను లెక్కించలేము. ఇదిగో, దానిలోనుండి పది ఆశీర్వాదములు.
1. పరలోకములో ప్రవేశించే ధన్యత :
'ప్రభువా, ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును.' మత్త 7:21.
దీని తరువాత వాక్యములను చదివినయెడల ఒక ఆశ్చర్యకరమైన సత్యమును కనుగొందురు.
'ఆ దినమందు అనేకులు నన్ను చూచి - ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేక అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు. అప్పుడు - నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్దనుండి పొందని వారితో చెప్పుదును.' మత్త. 7:22, 23.ఒకటి తెలుసుకొనండి, దేవుని చిత్తప్రకారము లేని సేవ; దేవుని చిత్తానికి విరుద్ధముగా చెప్పబడు ప్రవచనము, దేవుని చిత్తప్రకారము లేని అద్భుతములన్నీ అక్రమ క్రియలుగా ఉండును.
కాబట్టి, దేవుని చిత్తానికి మరింత ప్రాముఖ్యత ఇవ్వండి. ఎలాగైనా అద్భుతములు చెయ్యాలనికాదు; ప్రభువు చిత్తమును బట్టి నడుచుటకు మిమ్ములను సమర్పించుకోండి. అదే ఉన్నతమైనది.
2. శోధనలలో నుండి కాపాడబడుట :
దేవుని చిత్తమును నెరవేర్చువారికి ప్రభువు ప్రత్యేకమైన రక్షణను వాగ్దానము చేసియున్నాడు.
'నేను చెప్పిన మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును.' మత్త. 7:24.
ప్రభువు చెప్పిన ప్రకారము చేయుటయే దేవుని చిత్తము నెరవేర్చుట. అలాగు చేయువాడే బుద్ధిమంతుడు. అతడు క్రీస్తు అను బండపెపునాదిని వేసియున్నాడు.
'వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసరి ఆ యింటిమీద కొట్టెను. కాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు'. మత్త. 7:25. ఆహా! ఎంత చక్కని ఆశీర్వాదము! దేవుని చిత్తప్రకారము చేసిన యెడల, ఆత్మీయ జీవితము కదిలించబడదు, పడిపోదు, దృఢమైన పునాదియగు క్రీస్తుపై గంభీరముగా నిలచెదము! మన పరుగును జయముతో ముగించెదము.
3. నిరంతరము నిలిచి యుండుట :
నశించిపోవు, మారిపోవు, అస్థిరమైన ఈ లోకములో దేవుని చిత్తము చేయువారికి - నిరంతరము నిలచెదవు - అనే వాగ్ధానమును యిస్తున్నాడు.గ్రంధములో యిలాగు వ్రాయబడియున్నది. 'దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును.' 1 యోహాను 2:17.
దేవుని చిత్తమును తన జీవితములో జరిగించిన దావీదు ఆనందముతో, 'చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను (నిలచెదను)' అని చెప్పెను. కీర్తన 23:6
4. దేవుడు మనవులను ఆలకించును :
'ఎవరైనను దైవభక్తుడైయుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల, ఆయన వాని మనవి ఆలకించును.' యోహాను 9:31.ఇవి ఎవరు చెప్పిన మాటలో తెలుసా? పుట్టి గ్రుడ్డియైయుండి ప్రభువుచేత చూపు నొందినవాడు, పరిసయ్యులకు బోధించిన మాటలు యివి. దేవుడు మొర ఆలకించుచున్నాడన్న సత్యమును అతడు తెలుసుకొనెను.
యేసును 'పాపి' అని పరిసయ్యులు తీర్పు చేసినపుడు పుట్టి గ్రుడ్డివాడైయుండి ప్రభువుచేత కండ్లు తెరువబడినవాడై దృఢముగా జవాబిచ్చెను. 'దేవుడు పాపుల మనవి ఆలకింపడని యెరుగుదుము. ఎవడైనను దైవభక్తుడై యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించన యెడల వాని మనవి ఆలకించును'. యోహాను 9:31. దేవుని చిత్తం చేసినపుడు ఆయన మన మొర ఆలకించును.
5. ఆత్మ సంబంధమైన ఆహారమైయున్నది : దేవుని చిత్తము చేయుట మనకు భోజనము, 'ఆత్మ సంబంధమైన టానిక్' అది మన అంతరంగిక మానవుని బలపరచుచున్నది.
యేసు చెప్పెను. 'నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైయున్నది.' యోహాను 4:34.భోజనము చేయుట మన ఆకలిని పోగొట్టును, తృప్తినిచ్చును. ఆ ప్రకారము ప్రభువు చిత్తమును జరిగించామనే భావము మనస్సులో ఆత్మతృప్తిని పుట్టించును. అంతేకాదు, కలవరము చెందక సమాధానముతో ఉందుము.
6. సఫలమవు ఆశీర్వాదము :
ఎవరైతే యదార్ధముగా ప్రభువు చిత్తము చేయనాశించి ప్రయత్నిస్తారో వారందరికి ప్రభువు నిశ్చయముగా తన చిత్తమును కనపరచి దానిని సఫలము చేయును.'ప్రభువు ఉద్దేశము (చిత్తము) అతని వలన సఫలమగును. యెష. 53:10. సఫలమగును. నిశ్చయముగా సఫలమగును.
మనము ప్రభువు చిత్తమునకు సంపూర్ణముగా సమర్పించుకొనినపుడు మన పనులకు ఆటంకము కలిగితే మనము కలవరము చెందనవసరము లేదు. ప్రభువు మన మేలు కోసమే ఆపివేశాడని నిశ్చయముగా తెలుసుకొందుము. దాని కారణములు ఇప్పుడు అర్ధము కాక పోయినను భవిష్యత్తులో అర్ధమగును.
7. దేవుని కుటుంబమందు ఐక్యత :
మనము క్రీస్తుని అంగీకరించునపుడు ఆయన బిడ్డలమౌచున్నాము. ప్రభువా, నాకు బోధించుము అని అడిగినపుడు ఆయన విద్యార్ధులమగుచున్నాము. ప్రభువును వెంబడించుటకు సంపూర్ణముగా సమర్పించు కొన్నపుడు ఆయన శిష్యులమౌచున్నాము. ఆయనను ప్రేమించి ఆయనతో నడచినపుడు ఆయన స్నేహితుల మౌచున్నాము.
అన్నిటికంటె ఎక్కువగా ఆయన చిత్త ప్రకారము చేసినపుడు ఆయన కుటుంబ సభ్యులము, సహోదరులముగా, సహోదరిగా, తల్లిగా అగుచున్నాము.యేసు చెప్పెను 'నా తల్లి యెవరు? నా సహోదరులెవరు? అని చెప్పి తన శిష్యులవైపు చెయ్యిచాపి - ఇదిగో నా తల్లియు, నా సహోదరులును; పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియుననెను. మత్త 12:48,49.
ఆహా! దేవుని చిత్తము చేసి క్రీస్తుకు సహోదరుడుగాను, సహోదరిగాను, తల్లిగాను ఎంచబడుట ఎంత ధన్యత? ఇది ఎంతో గొప్ప ఆశీర్వాదము.
8. దేవుని కుమా