వాక్యసందేశముPost Date:2014-05-13//No:55

తల్లి (యెషయా 66:13)  దేవుని నామము 'తండ్రి' అని మనందరికి తెలుసు. కాని ఈ రోజు 'తల్లి' అను నామము వాక్యము నుండి నేర్చుకుంటున్నాము. దేవుని నామము 'తల్లి' ఎంత మంచి ఆదరణనిచ్చే నామము. తల్లిలేని వారికందరికి నా నామము శుభవార్త. దేవుడు తల్లి వలె నిన్ను ప్రేమించి, ఆదరిస్తాడు. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. దేవుని ప్రేమ తల్లి వంటిది. తల్లి ఎప్పుడూ తన బిడ్డలను కాపాడి, పోషించి సంరక్షిస్తుంది. ప్రేమిస్తుంది, గద్దిస్తుంది, ఆదరిస్తుంది. మనమందరము తల్లి యొక్క స్వభావమును అనుభవించి తెలుసుకున్నవారమే. తల్లి నీకు జన్మనిచ్చి నిన్ను ఈ లోకమునకు తీసుకువస్తుంది. శారీరకంగా తల్లి గర్భములో రూపింపబడకమునుపే నిన్ను గూర్చి సమస్తము తెలుసు. తల్లివలే నిన్ను ఆదరించి అంతము వరకు నిన్ను నడిపిస్తాడు. తల్లి ఎప్పుడు పిల్లల క్షేమము కోరుకుంటుంది. వారిని శ్రద్ధతో పోషించి సంరక్షిస్తుంది. తల్లి కడుపు చూస్తుంది. భార్య జేబు వెదుకుతుంది అనే సామెత మనము వింటూనే ఉంటాము. తల్లి పిల్లలను తిన్నావా? అని అడుగుతుంది. ఎంత మంచి ప్రశస్తమైన మాట. ఎవరైనా మనలను ఆ విధముగా పరామర్శిస్తే తినకపోయినా కడుపు నిండిపోయినంత భావన కలుగుతుంది. నా తల్లి బ్రతికి యున్నపుడు ఎప్పుడు నన్ను చూడగానే అన్నము తిన్నావా ? అని అడిగేది. ఆమె చనిపోయిన తరువాత ఏనాడు నీవు తిన్నావా? అని నన్నడిగేవారు ఎవరూ లేరు. ఈ తల్లి (దేవుడు) మనకు శారీరకమైన, ఆత్మీయమైన ఆహారము అనుగ్రహించి మనలను పోషించి ఆదరించి నడుపుతుంది. తల్లి వలే ప్రేమించి ఆదరించే దేవుడు మనకున్నాడు దేవునికి స్తోత్రం! హల్లెలూయ!!

ఒక ప్రేయసి తన ప్రియునితో - నేను నీ ప్రేమను అంగీకరించాలంటే నీ తల్లి తలను నరికి ఒక పళ్ళెములో పెట్టుకొని నా దగ్గరకు తీసుకురమ్ము, లేదంటే నీ ప్రేమను త్యజిస్తాను అని అనగానే ఆ ప్రియుడు తన ప్రియురాలి ప్రేమలో మునిగి గ్రుడ్డివాడైపోయాడు. తల్లి ప్రేమను మరచిపోయాడు. కనుక తల్లి కంటే ప్రియురాలే కావాలని తల్లి తలను తీసుకువచ్చి ప్రియురాలికి నిశ్చయించుకొన్నాడు. తల్లి మంచి నిద్రలో ఉన్నపుడు గొడ్డలితో తల్లి తలను నరికి, ఆ తలను ఒక పళ్ళెములో పెట్టుకొని ప్రియురాలి దగ్గరకు వెళుతున్నాడు. మార్గము మధ్యలో కాలికిరాయి తగిలి తొట్రిల్లి పడిపోయాడు. పళ్ళెము చేతిలో నుండి పడగానే తల్లితల కూడ క్రింద పడిపోయింది. తల్లి కళ్లలో నుండి నీళ్లు కారుతున్నాయి. తల్లి స్వరము వింటున్నాడు. కుమారుడా, నీ కాలికి దెబ్బ తగిలిందా అని అడుగుతుంది. తల్లి ప్రేమ ఇలాగే వుంటుంది. తన తల తెగిపోయిందనే బాధ కంటే కుమారునికి కాలికి దెబ్బ తగిలిందనే బాధే ఎక్కువగా వుంది.

సిలువలో యేసు ప్రభువు చూపిన ప్రేమ ఇలాంటిదే. నీకేదైనా గాయమైతే ప్రభువు సహించలేడు. గాయము చేయువాడు గాయము కట్టువాడు దేవుడే. గుండె చెదరిన వారిని బాగుచేసి వారి గాయములు కట్టేవాడు. తల్లి వలే ఆదరించి ప్రేమిస్తాడు. మిమ్మును చంకను ఎత్తికొంటాడు. వయసు పైబడుతుంటే బరువు పెరిగిపోతుంటే మనలను తల్లి ఎత్తికోలేదు. మోకాళ్ళ మీద ఆడించలేదు. శారీరకమైన తల్లికున్న శక్తి పరిమితమైనది. కాని దేవుని శక్తి అపరిమితమైనది. నీవు ఎంత ఎత్తు ఎదిగినా, ఎంత బరువు పెరిగినా నిన్ను ఎత్తికుంటాడు. మోకాళ్ల మీద ఆడిస్తాడు. 'మీరు చంకను ఎత్తికొనబడెదరు మోకాళ్ళమీద ఆడింపబడెదరు'. యెషయా 66:12 నీకేదైనా అనారోగ్యత కలిగినపుడు, నీకు భయము సంభవించినపుడు వెంటనే ఈ తల్లి (దేవుడు) చంకను ఎత్తికుంటుంది. మోకాళ్ళమీద ఆడిస్తుంది. నిన్ను వాక్యమనే పాలతో పోషిస్తుంది. తల్లి వలే నేను మిమ్మును ఆదరిస్తానంటున్నాడు.

తల్లి (దేవుడు) పాడైన వాటినన్నిటిని బాగుచేస్తుంది. అది తల్లి స్వభావము. ఇంట్లో బట్టలు చినిగిపోతే కుడుతుంది. మరక పాత్రలను సరిచేస్తుంది. తల్లి పాడైన వాటిని మరమ్మత్తు (రిపేర్‌) చేసి బాగుచేసి తిరిగి వాడుతుంది. పాడైన నీ బ్రతుకును బాగుచేయడం దేవునికి సాధ్యము.

'యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదెనువలె చేయుచున్నాడు దాని యెడారి భూములు యెహోవా తోటవలె నగునట్లు చేయుచున్నాడు'. యెషయా 51:3

బిడ్డ తల్లి కడుపు నుండి బయటకు రాగానే తల్లి రొమ్ములో పాలను త్రాగుతుంది. నాకు చాలా ఆశ్చర్యమనిపిస్తుంది. అప్పుడే పుట్టిన చంటిబిడ్డకు తల్లి రొమ్ములో పాలు వుంటాయనే జ్ఞానము ఎవరిచ్చారు ? అవి త్రాగాలని, వాటిలో పోషక విలువలు ఉన్నాయనే సంగతి ఏలాగు తెలుసు? తల్లి రొమ్ములో ఉంది పాలే కాని విషముకాదనే విశ్వాసము ఎవరిచ్చారు. ఎంత ఆత్రుతగా పాలు త్రాగి తృప్తి చెందుతుంది. చంటి బిడ్డకు ఎంత విశ్వాసము. విశ్వాసులు కూడా ఇలాగే వుండాలి. దేవునికి స్తోత్రం ! హల్లెలూయ!!!

దేవుని నామము 'తల్లి' అని ధ్యానిస్తున్నాము. చంటిబిడ్డ తల్లిని విశ్వసించినరీతిగా దేవునియందు సంపూర్ణ విశ్వాసము కలిగి యుండాలి. తల్లిగా నీకిచ్చే పోషణను, భద్రతను, కాపుదలను విశ్వాసముతో పొందాలి. అవిశ్వాసము వలన దేవుడనుగ్రహించే ఆశీర్వాదములకు దూరము కాకూడదు. తల్లి ఒడిలో బిడ్డ ఉన్నట్లు విశ్వాసులు వుండాలి. తల్లి ఒడిలోనున్న బిడ్డ ఎంత ధైర్యముగా వుంటుందో గమనించారా? నా తల్లి నాతో వుందినాకింకేమి భయము లేదు అన్నట్లుగా వుంటుంది. అలాగే విశ్వాసులు విశ్వాసముతో దేవుడు తోడుగా ఉన్నాడు, మాకింకేమి భయములేదు అని జీవించాలి. నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకుతాడు.

కోడిపెట్టను ఎప్పుడైనా చూశారా? అది ఎంత చిన్నగా వుంటుంది. దాని తల మరీ చిన్నదిగా వుంటుంది. తలలో మెదడు ఇంకెంత చిన్నగా వుంటుందో, కాని దానికెంత జ్ఞానమంటే శత్రువు బారి నుండి తన పిల్లలను కాపాడుతుంది. గ్రద్దను చూడగానే తన రెక్కల క్రిందకు చేర్చుకొని రెక్కలతో పిల్లలను కప్పుతుంది. కోడి తన పిల్లలను కాపాడినట్లు అనంతజ్ఞానియైన దేవుడు నిన్ను భద్రముగా కాపాడి సురక్షితముగా తన రెక్కల క్
తల్లి