వాక్యసందేశముPost Date:2014-05-09//No:54

మోషే - ఏడు గొప్ప సాకులు  'కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను ఇశ్రాయేలియులైన నా ప్రజలను నీవు ఐగుప్తులోనుండి తోడుకొని పోవలెను' (నిర్గ 3:10).

పీఠిక : మోషే మంచి యౌవన ప్రాయములో దేవుని స్వరమును వినెను. అడవిలో గొర్రెలను కాయువానిని గొప్ప నాయకుడిగా దేవుడు ఎన్నుకొనుచున్నాడు. అందుకు మోషే దేవుడికి ఏడు గొప్ప సాకులు చెప్పుట గమనింతుము.

1. మొదటి సాకు : 'నేను ఎంతటి వాడను' అందుకు మోషే - నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును, ఇశ్రాయేలియులను ఐగుప్తులో నుండి తోడు కొనిపోవుటకును ఎంతటివాడనని దేవునితో అనెను (నిర్గ 3:11).

దేవుని ప్రత్యుత్తరము - 'నేను నీకు తోడై యున్నాను'. నేను నీకు ఒక సూచన ఇచ్చెదను. మీరు దేవుని సేవించెదరు (నిర్గ 3:12).2. మోషే రెండవ సాకు : 'నేనేమి చెప్పవలెను' ఇశ్రాయేలీయులు - ఆయన పేరేమని అడిగిన యెడల నేనేమి చెప్పవలెను అని దేవుని అడిగెను (నిర్గ 3:13).

 దేవుని ప్రత్యుత్తరము : అందుకు దేవుడు - నేను ఉన్నవాడను అనువాడనై యున్ననని మోషేతో చెప్పెను (నిర్గ 3:14).

3. మోషే మూడవ సాకు : 'వారు నన్ను నమ్మరు' అందుకు మోషే - చిత్తగించుము వారు నన్ను నమ్మరు, నా మాట వినరు (నిర్గ 4:1).

దేవుని ప్రత్యుత్తరము : 'నేను నీకు సూచన లిచ్చుచున్నాను'.

అ. మోషే చేతిలోని కర్రపామగుట (నిర్గ 4:3).

ఆ. తన చెయ్యి రొమ్మును బెట్టుకొనగా కుష్టము గలదాయెను. మరల రొమ్ము నుండి వెలుపలికి తీసుకొనగా మిగిలిన శరీరమువలె నుండుట (నిర్గ 4:6-7).

ఇ. నీళ్లను కర్రతో కొట్టగా నీళ్లు రక్తముగా మారుట (నిర్గ 4:1-9).

ఈ. మోషే నాలుగవ సాకు : 'నేను మాట నేర్పరిని కాదు'.నేను నోటి మాంద్యము గలవాడను. నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పెను (నిర్గ 4:10).

4. దేవుని ప్రత్యత్తరము : 'కాబట్టి నీ వెళ్లుము నేను నీ నోటికి తోడై యుందును', నీవు పలుక వలసినది నీకు బోధించెదనని చెప్పెను (నిర్గ 4:11-12).

5. మోషే ఐదవసాకు : 'నీవు మరియొకని పంపుము' - అందుకతడు అయ్యో ప్రభువా? నీవు పంపదలచిన వానిచేత పంపుము (నిర్గ 4:13)

దేవుని ప్రత్యుత్తరము : ఆయన మోషే మీద కోపపడి నీ అన్నయైన అహరోను లేడా? నీవు అతనితో మాట లాడి అతని నోటికి మాటలు అందియ్యవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడైయుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించెదను (నిర్గ 4:15-16).

6. మోషే ఆరవసాకు : నా మొదటి యత్నము సాగలేదు (నిర్గ 5:25)

దేవుని ప్రత్యుత్తరము : నేనే యెహోవాను నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దారత్వములో నుండి, మిమ్మును విడిపించుదును (నిర్గ 6:6).

7. మోషే ఏడవసాకు : 'నేను మాట మాంద్యము గలవాడను' - అందుకు మోషే - చిత్తగించుము ఇశ్రాయేలియులే నా మాట వినలేదు. నేను మాట మాంద్యము గలవాడను. ఫరో ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను (నిర్గ 6:12).

దేవుని ప్రత్యుత్తరము : 'ఇదుగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును', (నిర్గ 7:1) నీ అన్న అహరోను నీకు నోరుగా ఉండును.

దేవుడు నిన్ను పిలుచునప్పుడు నీవు ఆ గొప్ప అవకాశమును పోగొట్టుకొనక సాకులు చెప్పవద్దు. నీ యందు దేవునికి గల గొప్ప ఉద్దేశము ఏమనగా నీవు సాకులు మానుము దేవుని పిలుపు గుర్తించు, గొప్పసేవను గుర్తించుము నిన్ను నీవు రిక్తునిగా చేసుకొనుటకు సిద్ధపడుము.

పరిశుద్ధ గ్రంధములో కొంతమంది సాకులు చెప్పారు. క్లుప్తంగా కొన్ని విషయాలు చూద్దాం.

1 ఆదాము పండుతిని హవ్వే కారణమని సాకు చెప్పెను. (ఆది 3:12)

2. హవ్వ పండుతిని సైతాను కారణమని సాకు చెప్పెను. (ఆది 3:13)

3. లోతు సొదొమా నుండి బయటికి పొమ్మంటే చచ్చిపోతానేమో అని సాకు చెప్పెను. (ఆది 19:19)

4. మోషే ఇశ్రాయేలీయులను విడిపించుటకు దేవుడు వెళ్లమంటే వారు నామాట వినరు. నేను యోగ్యున్ని కాను, నత్తివాన్ని అని సాకు చెప్పెను. (నిర్గమ 3:11, 4:1,10)

5. అహరోను బంగారు దూడను తయారు చేసి ప్రజలే చేయమన్నారని సాకు చెప్పెను (నిర్గమ 32:22-24)

6. ఇశ్రాయేలీయులు దేవునికి లోబడటం ఇష్టం లేక సమూయేలు ముసలి వాడని సాకు చెప్పి, తమ కొరకు రాజు కావాలని కోరిరి. (1 సమూ 8:5)

7. సౌలు తొందరపడి యాజకుడు అర్పించవలసిన బలి అర్పించి సమూయేలు ఆలస్యమే దీనికి కారణమని సాకు చెప్పెను. (1 సమూ 13:11-12)

8. సౌలు దురాశతో శత్రువుల పశువులను చంపకుండా తన కొరకు దాచుకొని దేవునికి అర్పించడానికి తెచ్చాను అని సాకు చెప్పెను. (1 సమూ 15:21)

9. విందుకు రమ్మంటే ఒకడు నేనొక పొలమును కొనియున్నాను, మరియొకడు నేను ఎడ్లు కొనియున్నాను. వేరొకడు నేనొక స్త్రీని పెళ్ళిచేసుకున్నాను అని సాకు చెప్పి శ్రేష్టమైన ఆహ్వానాన్ని తిరస్కరించిరి. (లూకా 14:18-20)

10. సోమరియైన దాసుడు తనకివ్వబడిన తలాంతును రెట్టింపు చేయడం చేతకాక దేవుడే చెడ్డవాడని సాకు చెప్పెను. (మత్తయి 25:24,25)

11. ఫెలీక్సు రక్షణ పొందే అవకాశం పొందుకున్నప్పటికీ మిగుల భయపడి సాకు చెప్పి రక్షణ కోల్పోయాడు. (అపో||కా||24:25)
మోషే