వాక్యసందేశముPost Date:2014-05-02//No:52

బదరీ వృక్షము

  బైబిల్‌ గ్రంధములో ఏలీయా అను భక్తుని యొక్క జీవితము ఎంతో ప్రాముఖ్యమైనది. తిష్బీయుడైన ఏలీయా రోషం కలిగిన ప్రవక్తగా, దేవుని స్వరాన్ని విని దానిని ధైర్యముగా ప్రకటించిన ధైర్యశీలుడుగా మనందరికి పరిచయమే. పరిశుద్ధ గ్రంధంలోని పొందుపరచబడిన ఏలీయా జీవితానుభవాలు ప్రతి విశ్వాసిని ఉత్తేజంతో నింపుతాయి. విశ్వాసి జీవితానికి ఈయన ఆధ్యాత్మిక అనుభవాలు ఎంతో చక్కని మార్గదర్శకత్వమునిస్తాయి.

(1 రాజులు 19:1-8) : ఏలీయా చేసినదంతయు, అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరిని చంపించిన సంగతియును అహాబు యెజెబెలునకు తెలియజెప్పగా యెజెబెలు ఒక దూత చేత ఏలీయాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వీరిలో ఒకని ప్రాణమువలె చేయనియెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలిసికొని, లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి, యూదా సంబంధమైన బెయేర్షాబాకు చేరి, అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దినప్రయాణము అరణ్యములోనికి పోయి యొక బదరీవృక్షము క్రింద కూర్చుండి, మరణాపేక్ష గలవాడై - యెహోవా !

నా పితరుల కంటే నేను ఎక్కువవాడను కాను, ఇంతమట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్ధన చేసెను.

అహాబు, యెజెబెలు యొక్క దుష్ట పరిపాలనను ఎదిరించి బుద్ధి చెప్పుటకు దేవుడు ఏలీయా ప్రవక్తను ఎన్నుకొనెను. ఏలీయా అనగా 'యెహోవాయే దేవుడు' అను అర్ధము. ఏలీయా తన పేరును బట్టి దేవుని మహిమపరచెను. బయలుదేవత యొక్క ప్రవక్తలను కీషోను వాగు దగ్గర ఏలీయా హతము చేసెను. నీ ప్రాణము తీయుదునని యెజెబెలు రాణి వర్తమానము పంపగానే ఏలీయా బహుచింతాక్రాంతుడై పరుగెత్తుకొని పోయి బదరీవృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్షతో ప్రభువును ప్రార్ధించెను.

18వ అధ్యాయంలో ఏలీయా అసాధారణమైన ధైర్యాన్ని ప్రదర్శించాడు. ఇక్కడైతే ఏలీయా మానసికంగా పూర్తిగా కృంగిపోయిన స్థితిలో ఉన్నాడు. జీవితంలో కొన్ని పరస్థితుల్లో ఎవరికైనా భయం కలుగవచ్చు. ఏలీయా రోషం కలిగిన ప్రవక్త అయినప్పటికీ అందరి మనుష్యులాంటి మనస్తత్వం కలవాడే (యాకోబు 5:17).

యూదా చరిత్రకారుడగు జ్ఞానియగు జోసెఫస్‌ ఆమె కుటుంబ జీవితమును ఈ క్రింది విధంగా సూచించాడు.

తూరు నందున్న ఒక గుడి పూజారి అయిన ఆమె తండ్రి ఆ రాజ్య రాజును చంపి ఆ రాజ్యమును 32 సం||రాలు పాలించెను. మానవ హక్కుల అలక్ష్యములు, బలులతో కూడిన విగ్రహారాధన అనునవి ఆయన పాలనలో ఎక్కువగా ఉన్నవి.

ఈ భాగములో నుండి కొన్ని ఆధ్యాత్మిక విషయాలను ధ్యానం చేసుకుందాము.

1. ఏలీయా తన ప్రాణమును కాపాడుకొనుటకు అరణ్యములోనికి పోయెను

యెజెబెలు యొక్క కోపోద్రేకాన్ని తప్పించుకోవడానికి ఏలీయా అరణ్యములోనికి పారిపోయాడు. అరణ్యము అనే మాటను గమనిస్తే ఇజ్రాయేలు దేశములో అరణ్యాలు మిగతా దేశాల్లో ఉన్నటువంటి అరణ్యం వంటివి కావు. పూర్తిగా రాళ్ళతో నిండి ఉంటుంది. అక్కడక్కడ మాత్రమే చెట్లు కనిపిస్తాయి. ఇక నీటి సంగతి చెప్పనక్కర్లేదు. చాలా భయంకరమైన ప్రాంతం. మనిషి బ్రతకడానికి అనువుగాని చోటు.

చక్కని శరీర సౌష్టవము కలిగియు అవయవములన్నియు అమర్చబడిననూ మనిషిలో ప్రాణము లేకపోతే ఆ శరీరము ఎందుకు పనికిరాదు. శాస్త్రవేత్తలు మన శరీర అవయవాలన్నిటికి లెక్కగట్టి మానవ శరీర విలువను కొన్ని కోట్ల రూపాయలకు వెలకట్టారు. అయితే ప్రాణమును కోల్పోయినచో ఈ శరీరానికి ఏ మాత్రం విలువలేదు. ప్రాణము లేని మనిషి జీవితానికి అర్ధమే లేదు (ఆది 2:7) ద్వారా దేవుడు మనిషిని మట్టిబొమ్మగా చేసి అతని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను. మనిషికి ప్రాణమిచ్చినది దేవుడే. అంతేకాదు ఆయారీతులుగా మరణము నుండి ప్రాణమును తప్పించువాడును దేవుడే (కీర్తన 33:18).

లూకా (12:20) : అయితే దేవుడు - వెఱ్ఱివాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు, నీవు సిద్ధపరచినవి ఎవనివగునని అతనితో చెప్పెను. ఈ ధనవంతుడు విస్తారమైన ఆస్థిని తన కొరకు సిద్ధము చేసుకొనెను. అనేక సంవత్సరములు గూర్చి ప్రణాళిక వేసుకొనెను గాని ఆ రాత్రి ఏమి జరుగుచున్నదో గమనించలేకపోయెను. మానవుడు ఏ విషయములోనూ అతిశయించ వీలులేదు. ఈ ధనవంతుడు ఎన్నో బిరుదులు కలిగియుండ వచ్చును. సాధారణముగా ధనవంతులను జమీందార్‌, దొరగారు, బహుద్దూర్‌జీ అని పిలిచెదరు. కాని ఇతని ఆఖరి బిరుదుగా వెఱ్ఱివాడా ! అని దేవుడు పిలిచెను. సమస్త ఆశీర్వాదాలకు మూలమైన దేవున్ని స్తుతించకుండా ఆయనను స్మరించకుండా, దేవునికి భయపడకుండా తన స్వబుద్ధిని ఆధారము చేసుకొని జీవించుచున్న వారందరి పరిస్థితి ఈ విధముగానే యుండును.

(యోబు 36:6) : భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు.. అని స్పష్టముగా దేవుని వాక్యములో ఉన్నది. ఏలీయా యెజెబెలుకు భయపడి పారిపోయి తన ప్రాణమును కాపాడు కొనవలెననే ప్రయత్నంలో ఉండెను. అయితే బలవంతుడైన దేవుడు తనకు తోడుగా ఉండెననే విషయము మరిచిపోయెను.

(కొలస్స 3:3) మీ జీవము క్రీస్తుతో కూడా దేవునియందు దాచబడియున్నది. నీవు దేవునియందు భయభక్తులు కలిగి జీవిస్తే నీ ప్రాణమును ఆయన కాపాడును. భయపడవద్దు, అనారోగ్యాలకు, అప్పుబాధలకు బెదరిపోవద్దు. రక్షించే దేవుడు నీకు తోడుగా ఉండి నీ పట్ల గొప్పకార్యము చేయును.

2. ఏలీయా బదరీ వృక్షము క్రింద కూర్చుండెను

ఏలీయా ఒంటరిగా బదరీ వృక్షము క్రింద కూర్చుండెను. బదరీ వృక్షమును ఇంగ్లీషులో(Broom Tree)అందురు. ఇది ఎప్పుడు వాడిపోయి, ఎండిన చెట్టువలె ఉంటుంది. అలసటతో దీని నీడనాశ్రయించి వచ్చినవారికి ఈ వృక్షము సరైన నీడనివ్వదు. 'బదరీ' అనగా 'నిరాశ' లేక మరణము అని అర్ధము. ప్రియ సోదరా ! సోదరీ ! నీవు బదరీ అనుభవము కలిగియున్నావా?

ఈ దినములలో చాలామంది నిరాశతో నింపబడుతూ ఆత్మహత్యలతో తమ జీవితాన్ని అంతమొందించుకొనుచున్నారు. పరీక్షలలో విజయం సాధించలేదని, ఉద్యోగం రాలేదని, అప్పుల బాధ తాళలేక, కుటుంబాల్లో ఆస్తి తగాదాలతో, అర్ధం పర్ధం ల
బదరీ