వాక్యసందేశముPost Date:2014-04-25//No:51

యేసుక్రీస్తు విషయములో పరిశుద్ధాత్మ పరిచర్య1. యేసుక్రీస్తు జన్మము

1. యేసుక్రీస్తు కన్యక గర్భములో జన్మించుటకు కారకుడు పరిశుద్ధాత్మ.గబ్రియేలు (దేవదూత) కన్యకయైన మరియతో పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. లూకా 1:35. ఇదే విషయము మరియను ప్రధానము చేసికొన్న యోసేపుకు కూడ దూత తెలియజేసెను. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. మత్త 1:20.

2. కన్యక జన్మము వలన ఫలితము :

కన్యక జన్మము వలన యేసు జన్మపాపము లేకుండ శరీరము ధరించెను (Incarnation) దేవుడు మానవుడయ్యెను. ఆయన సంపూర్ణమైన దేవుడు, సంపూర్ణమైన మానవుడు (perfect God-perfect man) మానవుడైనను పాపము లేనివాడు (sinless man) గా వుండెను. (అయినను) ఆయన మానవత్వములో ఏ లోపము లేనివాడుగా ఉండెను.

2. యేసుక్రీస్తు జీవితము

1. యేసుక్రీస్తు ఆత్మతో అభిషేకింపబడెను

ప్రభువు ఆత్మ నామీద ఉన్నది. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. లూకా 4:18. ఏమి జరుగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో, వాటినన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసు అపొ 4:27-28. దేవుడు నీతోడి వారికంటే నిన్ను హెచ్చించునట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. హెబ్రీ 1:9. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను, శక్తితోను అభిషేకించెను. దేవుడాయనకు తోడైయుండెను గనుక ఆయన మేలుచేయుచు, అపవాదిచేత పీడింపబడిన వారినందరిని స్వస్థత పరచుచు సంచరించుచుండెను. అపొ 10:38 ఈ ఆత్మాభిషేకము ఆయన బాప్తిస్మము తీసికొన్నప్పుడు జరిగియుండవచ్చును. ఈ వచనములను బట్టి 1. ఆత్మాభిషేకము ద్వారా యేసు మెస్సీయ (విమోచకుడు) గా గుర్తించబడెను. 2. అభిషేకము ద్వారా ఆయన తన పరిచర్యను చేయుటకు శక్తి పొందెను. 3. ఆత్మాభిషేకము ద్వారా మేలు చేయుటకు శక్తి పొందెను.

2. క్రీస్తు ఆత్మతో నింపబడెను.

యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యెర్దాను నదినుండి తిరిగి వచ్చెను. లూకా 4:1. ఇది యేసు బాప్తిస్మము పొందినప్పుడు జరిగినది. దేవుడు తాను పంపినవానికి కొలత లేకుండా ఆత్మననుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. యోహా 3:34. యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెష 11:2. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకొనినవాడు నా ప్రాణమునకు ప్రియుడు అతనియందు నా ఆత్మను ఉంచియున్నాను. 42:1. ఈ వచనములను బట్టి ఆయన తన జీవితమంతా అనగా జన్మించిన సమయమునుండి ఆత్మచేత నింపబడెనని గ్రహించగలము.

3. క్రీస్తు ఆత్మచేత ముద్రింపబడెను.

క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి, మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును, ఇందుకై తండ్రియైన దేవుడు ఆయనకు ముద్రవేసి యున్నాడని చెప్పెను. యోహా 6:27. ఆయన పరలోకము నుండి వచ్చినవాడనియు దైవ కుమారత్వము గలవాడనియు అనుటకు గురుతుగాను రుజువుగానున్నది.

4. క్రీస్తు ఆత్మచేత నడిపింపబడెను.

యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దాను నదినుండి తిరిగి వచ్చి, నలువది దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడెను లూకా 4:1. దేవుడాయనకు తోడైయుండెను గనుక ఆయన మేలుచేయుచు అపొ 10:38. నన్ను పంపినవాడు నాకు తోడైయున్నాడు. ఆయన కిష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. యోహా 8:29.

5. క్రీస్తు ఆత్మయందు ఆనందించెను.

'యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించెను' లూకా 10:21 ఇది ఆయన ఆత్మఫలముతో నిండియుండుటను తెలియచేయుచున్నది.

6. క్రీస్తు ఆత్మచేత బలము పొందెను.

యేసు తన బలముచేతనే అనేక కార్యములను చేసెను. రక్తస్రావ రోగము కలిగిన స్త్రీని బాగుచేసెను. యేసు తనలోనుండి ప్రభావము బయలు వెళ్ళెనని తనలోతాను గ్రహించెను. మార్కు 5:30. పక్షవాతముగల మనుష్యుడు ఇంటికప్పు విప్పి లోపలికి తేబడినప్పుడు ఆయన వానిని స్వస్థపరచి పంపెను. అప్పుడు ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను. లూకా 5:17. అనేకులను ఆయన స్వస్థపరచెను. (mass healing) ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరిని స్వస్థపరచెను. లూకా 6:17-19. గెత్సెమనె తోటలో ఆయన - నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేలమీద పడిరి. యోహా 18:6. ఈలాగు ఎన్నో ఆయన తన శక్తిచేతను బలముచేతను చేసెను.

కొన్నిసార్లు ఆత్మ సహాయముచేత కూడ చేసెను. దేవుని ఆత్మవలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీయొద్దకు వచ్చియున్నది. మత్త 12:28 మరియు యెష 11:1, అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ప్రభువు ఆత్మ నామీద ఉన్నది, గ్రుడ్డి వారికి చూపును, నలిగిన వారిని విడిపించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. లూకా 4:14,18. ఆయన ఆత్మబలము పొందెను. ఈలాగు యేసు ఆత్మబలము చేత కూడ చేసెను.

కాబట్టి కొన్ని తన సొంత బలముచేతను మరికొన్ని ఆత్మ సహాయము ద్వారాను చేసినట్లు స్పష్టముగా యున్నది. దీనిని బట్టి మనము గ్రహించవలసినది : ఆయన ఈ కార్యములు చేయుటకు ఆత్మ సహాయము తనకు అవసరము లేదు. కాని కొన్ని సమయములలో ఆత్మ సహాయము తీసికొన్నాడు.

ఈ సత్యములను బట్టి యేసు జీవితములోను, పరిచర్యలోను ఆత్మకార్యముల విశిష్టత

1. మొదటిగా యేసుయొక్క మానవ (గుణము) స్వభావము (human nature) ను వృద్ధిపరచుటలో ఆత్మకార్యము జరిగించెను. ఎందుకనగా ఆయన మానవునిగా జన్మించక ముందు మార్పులేని దైవ స్వభావము మాత్రము కలిగినవాడుగా ఉండెను. ఆయన మానవత్వము (మానవస్వభావము) వృద్ధిచెంద వలసియున్నది. మానవత్వమనగా ఆదాము పాపము చేసిన తరువాత ఉన్న స్వభావము కాదు. పాపము చేయకముందు కలిగియున్న మానవత్వము. యేసు జ్ఞానమందును, వయస్సునందును దేవుని దయయందును, మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. (వీజీలిగీ) పెరుగుచుండెను. లూకా 2:52 ఆయన విధేయతను నేర్చుకొనెను. హెబ
యేసుక్రీస్తు