వాక్యసందేశముPost Date:2014-04-18//No:49

పునరుత్థానుని నమ్మనివారు

  పునరుత్థానము క్రైస్తవ చరిత్రకు మకుటము. పునరుత్థానము లేకపోతే ఈ చరిత్ర ఎంత దౌర్భాగ్యంగా ఉండేదో ఆలోచించండి. ఇతరులకు లేనిది మనకున్నది పునరుత్థానము. ఇతర గ్రంధాలలో లేనిది మన గ్రంధములో ఉన్నది పునరుత్థానము. పునర్‌ అంటే తిరిగి, ఉత్థానము అంటే లేచుట. పునరుత్థానము అంటే తిరిగి లేచుట. ఈస్టరు అని ఆంగ్లంలో పునరుత్థానము అని ఆంధ్రలో పిలుస్తాం. పునరుత్థానం ద్వారా మరణం మరణించింది. మరణపు ముల్లు విరువబడింది. మరణానికి మరణం కలిగింది. కనుకనే మనందరికి ఆనందం కలిగింది. పునరుత్థానం నాడు యేసు మృతిని జయించి తిరిగి లేచాడు. అంటే లేఖనములను నెరవేర్చుటకు తిరిగి లేచి మనుష్యులకు పదనొకండు పర్యాయములు ప్రత్యక్షం అయ్యాడు యేసుక్రీస్తు. దీనికి యేసు స్వామి శిష్యులే సాకక్షులు. యేసుక్రీస్తు వారికి ఆయా స్థలాల్లో ప్రత్యక్షమయ్యాడు. ఆయనను చూచి కొన్నిసార్లు ఆనందించారు. కొందరు ఆనందిస్తే, మరికొందరేమో అనుమానించారు. కొందరు సందేహించడం విడ్డూరంగా, విచిత్రంగా ఉండవచ్చు. కాని ఇది వాస్తవము. ఎక్కడెక్కడ వారు సందేహించారో! ఎక్కడ వారు మౌనంగా ఉన్నారో !! ఈ సందేశం ద్వారా తెలుసుకుందాం!

1. మ్రొక్కారు గాని సందేహించారు... (మత్తయి 28:17)

'వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి'. గమనించండి, యేసు పదనొకండు మంది శిష్యులు యేసు నిర్ణయించిన గలిలయ రాష్ట్రములో ఒక కొండ దగ్గరకు 1. వారు వెళ్లారు, 2. వారు ఆయనను చూచారు, 3. ఆయనకు మ్రొక్కారు (అంటే ఆరాధించారు) ఇవన్నీ శ్రేష్టమైన కార్యాలే కాని కొందరు సందేహించారు. శిష్యులను రెండు వర్గములుగా మనం విభజిస్తే 1. మ్రొక్కినవారు మొదటి వర్గం, 2. మ్రొక్కక సందేహించినారు రెండవ వర్గం. దేవుని పిల్లలు అని పేరు పెట్టబడిన కొందరు ఆదివారం దేవాలయానికి వెళతారు ఆయనను చూస్తారు, మ్రొక్కుతారు. సోమవారం నుండి సందేహించేవారిలో ఉంటారు. ఇక్కడ సందేహించినవారు అన్యులు కాదు. సొంత శిష్యులే! ఆయనతో ఉన్నవారే! ఆయనతో తిన్నవారే!! వీరు సందేహించింది దేన్నో స్పష్టంగా లేదు. యేసు సజీవంగా లేచిన తరువాత ఆయన స్వరూపం అచ్చంగా అంతకుపూర్వంలా లేడని తక్షణమే ఆయనను గుర్తుపట్టలేక పోయారు. (లూకా 24:16). యేసు శిష్యుల్లా మనం సందేహించే క్రైస్తవులముగా ఉండక ఆరాధించువారముగా విశ్వసించువారముగా జీవిద్దాం!

2. చూచారు గాని ఏమియు చెప్పలేదు... మార్కు 16:8

'వారు బయటికి వచ్చి విస్మయము నొంది వణకుచూ సమాధి యొద్దనుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవనితో ఏమియు చెప్పలేదు.

మొదటివారి వలె (1). వీరునూ యేసు అనుయాయులే (2). సమాధి మీద ఉన్న రాయి పొర్లింపబడి యుండుట వీరు చూశారు. (3) ఖాళీ సమాధిని చూచారు. (4) సమాధి లోపల ఉన్న దేవుని దూతలను చూశారు. (5) నేను తిరిగి లేచానని పేతురుతో కూడా చెప్పండి. అనే ఆదేశాన్ని దూతల ద్వారా విన్నారు... పై విషయాలన్నింటిని విని కూడా ఎవ్వరితోనూ ఏమి చెప్పక మౌనం వహించారు. కారణం!.. భయం.. ఆందోళన.. ఈ భయమే వారిని పారిపోయేలా చేసింది. భయం ఎంత చెడ్డదో గమనించారా? 1. భయం వారి నోరు మూసింది. 2. భయం వారిని పారిపోయేలా చేసింది. 3. భయం వారిని వణికించింది. ఆ కారణాన పునరుత్థానుడైన యేసు వారికి పలుసార్లు ప్రత్యక్షమవుతూ, వారితో మాటలాడుతూ... వారికి సమాధానం చెపుతూ వచ్చాడు. ఇది పునరుత్థానుని ప్రేమ.

3. విన్నారు కాని నమ్మలేదు... మార్కు 16:11. 'ఆయనతో ఉండినవారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్లి ఆ సంగతి వారికి తెలియజేసెను గాని, ఆయన బ్రతికి యున్నాడనియు ఆమెకు కనబడెననియు వారు విని నమ్మకపోయిరి'.

ఇది మేడగదిలో జరిగిన సంఘటన. యేసుతో ఉండిన వీరు 1. యేసు కోసం దుఃఖపడుతున్నారు 2. యేసు కోసం ఏడుస్తున్నారు. అదే సమయంలో మగ్దలేని మరియ మేడగదికి వెళ్లింది. యేసు తిరిగి లేచాడని సాక్ష్యమిచ్చింది. ఆయన బ్రతికాడు అని సాక్ష్యమిచ్చింది. నేనాయనను చూచానని చెప్పింది. ఇవన్నీ వారు ఎంతో చక్కగా విన్నారు. కాని నమ్మనే నమ్మలేదు. ఎంత విచారకరమైన విషయం. చెవులతో విన్నారు కాని హృదయముతో విశ్వసించలేదు.

ఏ విధమైన సాక్ష్యాలతో పని లేకుండానే వీరు క్రీస్తు సజీవంగా లేచాడని నమ్మవలసింది. నేను తిరిగి లేస్తానని యేసు ముందుగానే వారికి చెప్పాడు (9:31). అయితే ఎన్నోసార్లు విన్నప్పటికిని అదే అపనమ్మకంతో వారు కొనసాగారు. నమ్మినవారికి, నమ్మనివారికి ఎంతో వ్యత్యాసముంది. నమ్మనివారికి రెండు శాపాలు, నమ్మినవారుకు ఆరు ఆశీర్వాదములు.1. నమ్మనివారు : నమ్మనివారు గద్దింపబడ్డారు. (మార్కు 16:4) (2) నమ్మనివారికి శిక్ష విధింపబడుతుందని బైబిల్‌ గ్రంధం సెలవిస్తుంది. (మార్కు 16:16) ఒక పాటవుంది 'నమ్మనివారికి నరకమురా నమ్మినవారికి నెమ్మదిరా! అని ఒక రచయిత వ్రాశారు. (రెవ.జి.సామ్యూల్‌గారు).2. నమ్మినవారు : (1) నమ్మినవారి ద్వారా సూచక క్రియలు జరుగుతాయి. (2) నమ్మినవారు నాశనం కారు. (3) నమ్మినవారు భయపడరు (కీర్తన 56:4) (4) నమ్మినవారు ధన్యులు. (5) నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావని యేసుక్రీస్తు సెలవిచ్చాడు. (6) చివరిగా నమ్ముట నీవలన అయితే నమ్మువారికి సమస్తము సాధ్యం అని యేసు చెప్పాడు. ప్రియ స్నేహితులారా! యేసును నమ్మండి.... ఆయనను యూదా వలె అమ్మకండి, వినండి ! విశ్వసించండి !!

4. చదివారు గాని గ్రహించలేదు........ (లూకా 24:25).

'అందుకాయన - అవివేకులారా! ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులారా!

ఎమ్మాయి మార్గంలో జరిగిన సంఘటన ఇది. పునరుత్థానుడై లేచిన యేసుక్రీస్తు (1) వారికి ప్రత్యక్షమయ్యాడు (2) వారితో నడిచాడు. (3) వారితో మాటలాడాడు కాని వారు ఆయనను గుర్తించలేదు. అంతేకాదు వీరు (1) ప్రవక్తల గ్రంధాలు చదివారు (2) మోషే ధర్మశాస్త్రం చదివారు (3) కీర్తనలు చదివారు కాని ఏం లాభం గ్రహించలేదు. ఆయన శ్రమలు అనుభవించి మృతి చెంది మూడవనాడు లేస్తాడని వారు ప్రాచీన గ్రంధాలలో చదివారు. అవి క్రీస్తులో నెరవేరాయని గ్రహించలేదు.

చాలామంది చాలా చదువుతారు, డిగ్రీలు సంపాదిస్తారు.
పునరుత్థానుని