వాక్యసందేశముPost Date:2014-04-04//No:46

క్రీస్తు సిలువ వేయబడినందున

  ప్రభువైన యేసుక్రీస్తు మరణించినందున కలిగిన ఏడు ప్రత్యేకమైన మేళ్ళను గూర్చి ధ్యానిద్దాం.

1. శత్రువులు మిత్రులుగా మారిరి : అంతకు ముందు హేరోదును పిలాతును ఒకనినొకడు శత్రువులై ఉండి, ఆ దినముననే యొకనికొకడు మిత్రులైరి (లూకా 23:12) రోమా కైసరు కొరకు ఒక్కొక్క ప్రాంతములో ఏలుబడి చేసిన గవర్నర్లే వీరు. ఇందులో భాగంగా హేరోదు గలిలయలోను పిలాతు యూదయలోను ఏలుచుండిరి. వారు ఏలుచుండిన ప్రాంతములో నివసించే ప్రజలమీద మాత్రమే వారికి అధికారం ఉండేది.

హేరోదుకు తెలియకుండా గలిలయవారిని వధించినందున వారిరువురు శత్రువులైరి. ఈ శత్రుత్వం ఇలా ఉండగా యేసుయొక్క కేసు రంగంలోనికి వచ్చినది.

యేసువచ్చి వారి మధ్యలో నిలిచినందుకు శత్రువులిరువురు మిత్రులైరి (లూకా 23:12, అపో.కా.4:28) ఈలాగే అనేకులను సమాధానపరచుటకు యేసుకు సాధ్యమాయెను. అందులో అతి ప్రాముఖ్యమైనది దేవునితో శత్రుత్వం కలిగి ఉన్న మానవుని దేవునితో సమాధానపరచెను. (ఎఫెసీ 2:14-18, రోమా 5:10).

2. నేరస్తుడు జైలు నుండి విడుదల పొందాడు:

'అయితే వారు - వీనిని వద్దు, బరబ్బాను విడుదల చేయమని మరల కేకలు వేసిరి. ఈ బరబ్బా బంధిపోటు దొంగ' (యోహా 18:40) నిరపరాదియైన యేసును ఎలాగైనా విడిచిపెట్టాలని పిలాతు ఆశించెను. దానికై ఆయన ఓ పరిష్కార మార్గమును కనుగొనెను, యూదులు ఐగుప్తునుండి విమోచించబడిన దానికి జ్ఞాపకార్థముగా పస్కాపండుగను ఆచరించిరి, ఆ పండుగ సమయంలో నేరస్థుడొకనికి బహిరంగ క్షమాపణనిచ్చి స్వతంత్రులుగా విడిచిపెట్టవచ్చు. యూదులు నేరస్థుడని చెప్పుచున్న యేసును బహిరంగముగా క్షమించి స్వతంత్రముగా విడిచిపెట్టాలని పిలాతు ప్రయత్నించాడు. అయితే అతని ప్రయత్నం బెడిసికొట్టి ప్రజల ఆక్రోశమే ఫలించింది. యేసు సిలువవేయబడెను. కరడుగట్టిన బంధిపోటు దొంగయైన బరబ్బాను క్షమించి స్వతంత్రునిగా విడిచిపెట్టిరి, జైలునుండి విడుదల పొందిన బరబ్బాతో మీరు స్వతంత్రులగుటకు కారణం ఎవరని అడిగినట్లయితే తడుముకోకుండా యేసుక్రీస్తు అని జవాబిస్తాడు. 'చెరలోనున్న వారికి విడుదలను' ఇచ్చుటకు వచ్చిన క్రీస్తు బరబ్బాను విమోచించెను (లూకా 4:18). మరణ భయముతో జీవించిన బరబ్బాను మాత్రమేగాక మానవజాతి యావత్తును విడిపించెను. అదే హెబ్రీ పత్రికలో మనము చదువుచున్నాము 'జీవితకాలమంతయు మరణభయము చేత దాస్యమునకు లోబడినవారిని యేసు విడిపించెను' (హెబ్రీ 2:14).

3. పాపి పరదైసులోనికి ప్రవేశించాడు:

గొల్గొత కొండపై ఇద్దరు దొంగల మధ్య యేసును సిలువ వేసిరి. మొదట ఆ ఇద్దరు దొంగలు యేసును దూషించిరి. కాసేపటికి వారిలో ఒకడు మారుమనస్సు పొందెను, 'నజరేతువాడైన యేసు యూదులరాజు' అని పైవిలాసము క్రీస్తుకు పైగా వ్రాయబడినది అతడు చదివాడు దేవుని రాజ్యమును గూర్చియు మరణానంతర జీవితమును గూర్చియు అతనికి స్పష్టంగా అర్ధమైనది. యేసును దూషిస్తూ ఉండిన వ్యక్తితో క్రీస్తు విశిష్టతను గూర్చి తెల్పుతూ గద్దించి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినపుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమని విజ్ఞాపన చేసెను. భయంకరమైన పాపియైనను పశ్చాత్తాపముతో క్రీస్తును అంగీకరించినవానిని 'నేడు నీవు నాతోకూడా పరదైసులో ఉందువని' నిశ్చయముగా చెప్పెను.

4. సైనికులకు వస్త్రాలు దొరికినవి:

(యోహాను 19:23,24) బి.సి 1000లో దావీదు ప్రవచనాత్మతో పాడినది క్రీస్తునందు నెరవేరెను (కీర్తన 22:18) సహజంగా ఒక యూదుడు సిద్ధపడినప్పుడు ఐదు ప్రత్యేకతలు కన్పించును. శిరస్సుపై వస్త్రము (తలకప్పు), అంగీ, లోపలి వస్త్రము, నడుమునకు దట్టి, చెప్పులు ధరించుదురు. ఓ భక్తుడు చెప్పినదేమనగా నాలుగు భాగములు వేసిరి అనగా, ఒక అంగీని నాలుగుగా చింపిరి అనికాదు. అంగీ తప్ప నాలుగు ఒక్కొక్కటి చొప్పున ఒక్కొక్కరు తీసుకొనిరని అర్ధము అంగీ పైబట్ట ఒక వేళ రెండు భాగాలుగా కలిపి కుట్టినదై ఉండవచ్చు. అయితే క్రీస్తుయొక్క అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది గనుక ఆయన ప్రధానయాజకుడని దీనివలన మనకు అర్థమగుచున్నది (లేవీ.21:10).

5. యెరూషలేములో ఒక సమాధుల దొడ్డి ఏర్పడెను:

యేసు సిలువపై వ్రేలాడుచుండిన సమయంలో గొప్ప భూకంపము కలుగగా బండలు బ్రద్దలాయెను, యూదా యొక్క శవము అప్పుడు క్రిందపడియుండవచ్చును, అతడు తలక్రిందుగాపడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నియు బయటకువచ్చెను (అ.కా.1:18). అదే ఆ పాపియొక్క దారుణమైన అంతము, ప్రధానయాజకులు ఆ వెండినాణెములు తీసుకొని ఇవి రక్తక్రయధనము గనుక వీటిని కానుకపెట్టెలో వేయక పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరివాని పొలము కొనిరి (సమాధులదొడ్డి), రక్తపు పొలమని దానికి పేరు (మత్త.27:3-10, అ.కా.1:17-19).

చనిపోతే ఎక్కడికి (పరదైసులో) వెళ్తానని పశ్చాత్తాపపడిన పాపికి జవాబుఇచ్చిన క్రీస్తు, చస్తే ఎక్కడ పాతిపెట్టాలనే సమస్యకు పరిష్కారమిచ్చెను.

6.సైనికులకు ద్రవ్యము దొరికెను:

(మత్తయి 28:12-15) యేసుక్రీస్తు పునరుత్థానమునకు వ్యతిరేకముగా యూదులు పెద్దరాయి సమాధికి ముద్ర సైనికుల కాపల ఇలా తమకు చేతనైనంతగా ప్రయత్నించిరి. ఈ వ్యతిరేకతలన్నిటిని బ్రద్దలు చేసుకుంటూ యేసు పునరుత్థానుడాయెను (మత్తయి 27:65, రోమా 1:7).

వారి ప్రణాళికలు బెడిసికొట్టగా అపజయభీతి కల్గిన యూదులు మరో ప్రయత్నముగా అబద్దకధను ప్రచారము చేసిరి. యేసు సమాధి యెదుట కావలుండిన సైనికులచేతనే ఊరంతా ప్రచారము చేయించిరి. మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తుకొనిపోయిరి. ఇదే సైనికులు ప్రచారము చేసిన అబద్దకథ. ఈ దొంగ నాటకాన్ని ప్రదర్శించటానికి లంచముగా ప్రధానయాజకులు వారికి చాలాద్రవ్యం ఇచ్చిరి.

7. నాకు మీకు పాపక్షమాపణ దొరికెను:

  (1యోహా.1:7, ఎఫె.1:7) మనమింకను పాపులమైయుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను (రోమా 5:8). లోకపాపమును మోసుకొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్లయే క్రీస్తు (యోహా.1:29,36, లేవి 16:21,22). యెహోవా మనయందరి దోషమును అతనిమీద మోపెను క్రీస్తు తన శరీరమందు మన పాపముల
క్రీస్తు
కైసరుకు పిలాతు లేఖ

  యేసుక్రీస్తు సిలువ మరణమును గూర్చి పొంతుపిలాతు రోమా చక్రవర్తియైన కైసరుకు వ్రాసిన లేఖ నొకదానిని లాటిన్‌ భాషలో రోమ్‌ నగరమందలి వాటికన్‌ గ్రంథాలయమందు థామస్‌కోల్మన్‌ అను చార్లెస్టన్‌ నగర న్యాయాధికారి కనుగొన్నారు. ఆ లేఖ యిట్లున్నది.

రోమా చక్రవర్తియగు తిబెరియ కైసరుకు! ఘనము గల అయ్యా! వందనములు.

ఇటీవల నా రాష్ట్రము (యూదయ)లో జరిగిన కొన్ని సంఘటనలు సామ్రాజ్యపు పునాదులనే కదిలించివేయునను భయంతో మీకీ ఉత్తరము వ్రాయుచున్నాను.

నా రాష్ట్రంలో నేను విన్న విశేషాలు చాలా యున్నవి. కాని వాటిలో చాలా విపరీతమైనది ఒకటున్నది. అతడొక పడుచువాడు. గలిలయ ప్రాంతం నుండి వచ్చినట్లు తెలుస్తున్నది. అతడు తనను పంపిన దేవుని బోధగా క్రొత్త సిద్ధాంతములను బోధించుచు సమస్త ప్రజా సమూహపు దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇతడు రోమీయులకు వ్యతిరేకంగా తన ప్రజలను ఉద్రేకపరచుచున్నాడని తొలుతలో భావించాను. కానీ నా ఊహ సరైనది కాదు.

నజరేయుడైన యేసు అనబడే ఇతడు రోమీయులకు యూదులకంటే మంచి స్నేహితుడుగానే యున్నాడు. నేనొక రోజున షికారుకు వెళ్లుచుండగా సిలోయము ప్రాంతమున బ్రహ్మాండమైన ప్రజా సమూహమున్నది. వారి మధ్య ఒక చెట్టుకానుకొని నిలుచున్న పడుచువాడొకడు బోదించుచుండెను. అక్కడ వాతావరణము చాలా ప్రశాంతముగా నున్నది. అతడే నజరేయుడైన యేసని నాకు తెలిసినది. అతనికి, అక్కడ నున్న ప్రజలకును చాలా భేదమున్నది. సువర్ణచ్ఛాయగల అతని తల వెంట్రుకలు, అతని చిన్న గడ్డము వింత సౌందర్యవంతునిగా చేసినవి. అతనికి రమారమి ముప్పదేండ్ల వయస్సుండవచ్చును. అతని తీయని స్వరూపమును నేనెక్కడనూ చూడలేదు.

నేను వెళ్ళి అతని బోధకు ఆటంకము కలిగించకుండా నా కార్యదర్శిని వినవలసిందిగా పంపాను. నా కార్యదర్శి పేరు మేన్లి యస్‌. యితడు మనకు మిక్కిలి నమ్మకమైనవాడు. యూదుల స్థితిగతులను బాగుగా ఎరిగినవాడు. హెబ్రూ భాషలో చక్కని పరిచయమున్నది. తిరిగి నా భవనమునకు వెళ్ళిన తరువాత మేన్లియస్‌ యేసు బోధను గూర్చి చాలా విపరీత విషయాలు చెప్పాడు. ఏ వేదాంతివల్లా ఆ విషయాలు నేను వినలేదు. తిరుగుబాటు స్వభావం గల యూదుల కైసరుకు పన్ను యిచ్చుట న్యాయమా? అని యేసును ప్రశ్నించగా, యేసు - కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి చెల్లించుడని చెప్పినట్లు వినియున్నాను.

అతనికి స్వేచ్ఛనిచ్చుటకు, బంధించుటకు నాకు సర్వ హక్కులున్నప్పటికిని, రోమీయుల న్యాయానికి నేను విరుద్ధంగా ప్రవర్తించి తలచలేదు. అందుచేత యేసు బోధల మీద గాని, ఆయన కార్యకలాపముల మీద గాని ఎట్టి ఆంక్షలు పెట్టలేదు.

యేసునకీయబడిన ఈ సంపూర్ణ స్వేచ్ఛ యూదుల్లోని ధనవంతులకు మతాధిపతులకు చాలా అసూయ కలిగించింది. సామాన్య ప్రజానీకము మాత్రం చాలా సంతోషించారు. ఎందుచేతనంటే యేసుబోధలు ధనవంతుల దౌష్ట్యాన్ని, మతాధిపతుల కపటి వేషాలను బట్టబయలు చేసి, అమాయక ప్రజా సమూహానికి వెలుగుబాటలు చూపించినవి. ఈ శాస్త్రులను, పరిసయ్యులను, వేషధారులని, సున్నము కొట్టిన సమాధులని, వ్యభిచారతరమని, ఆయన సంబోధిస్తున్నాడు. ఒక సందర్భములో ధనవంతుడైన పరిసయ్యుని కానుక కంటె దరిద్రురాలైన విధవరాలి 'కాసు' దేవుని దృష్టిలో గొప్ప కానుకయని ఆయన చెప్పినట్లు విన్నాను. యేసు మీద నాకు ఫిర్యాదులు రోజూ వస్తూ యున్నవి. ఆయనను చంపుటకు యూదులు ప్రయత్నించుచున్నట్లు తెలిసినది. ఈ విషయమై నేను చాలా ఆందోళన పడ్డాను.

నా భవనము దగ్గర ఒక ఉదయము నన్ను కలుసుకోవలసినదిగా యేసుకు నేను కబురు చేసాను; ఆయన వచ్చాడు. నా నరములలో ప్రవహిస్తున్న రక్తం రోమీయుల రక్తం. అది ఎన్నాడూ భయమెరుగదను సంగతి మీకు తెలుసు. కాని నా నడవలో యేసు నిలుచుండుట నేను చూచినప్పుడు నా కాళ్ళను ఎవరో ఇనుప చేతులతో నొక్కి పట్టినట్లు స్థంభించిపోయాను. నజరేయుడైన యేసు మౌనంగా నిలిచియున్నాడు. కాని రోమా గవర్నరైన నా శరీరంలో ప్రతి అణువు గజగజ వణికిపోయినది. ఆయన రెండడుగులు ముందుకు వేసి 'నేనిక్కడ ఉన్నాను' అన్నాడు. ఈ వింత వ్యక్తిని చూచి ఏమి మాట్లాడాలో నాకు బోధపడలేదు. రోమా సామాజ్య్రంలోని దేవతా విగ్రహములుగాని, వీరుల విగ్రహాలు గాని, ఈ దివ్య స్వరూపానికి సాటిరావు. ఆయనతో మాట్లాడుటకు నా నాలుక వణికింది. చివరకు యిలా ఆరంభించాను. 'యేసూ, నజరేయుడైన యేసూ గత మూడు సంవత్సరాలలో నీకు నేను యూదులలో యెవ్వరికి లేనంత స్వేచ్ఛ యిచ్చాను. నీ కార్యకలాపాలకు యెట్టి ఆటంకము కలిగించలేదు. నీ మాటలు యోగీశ్వరుల మాటలు, నీవు సోక్రటీసు, ప్లేటో మొదలగు ప్రసిద్ధ తత్త్వవేత్తల గ్రంథాలు చదివావోలేదో నాకు తెలియదు. కాని నాకు తెలిసినదేమంటే నీ బోధలు ఈ తత్త్వవేత్తల బోధలను మించి పోయినవి. ఈ విషయమై నేను చక్రవర్తికి తెలియజేసాను. రాజప్రతినిధిగా నేను నిన్ను చూడగలందులకు చాలా సంతోషిస్తున్నాను. నేను నీకొక విషయము బ్రతిమాలి చెప్పుచున్నాను. నేను నీకు ఆజ్ఞనివ్వటం లేదు. దయచేసి యిక మీదట నీ శత్రువుల మనస్సులను ఉద్రేకపర్చే బోధనలను చేయవలదని కోరుచున్నాను. నీవు ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తే నీ మీద చట్టాన్ని ప్రయోగించవలసిందిగా వారు ఒత్తిడి చేస్తారు.

నజరేయుడు నెమ్మదిగా జవాబిచ్చాడు - 'భూరాజా! నీ మాటలు సత్య సంబధమైనవి కావు. లోయలోని చెట్లను పెకలించకుండా - ఓ గాలీ! నీవు పర్వత గుహలోనే దాగొనుమని చెప్పగలవా? అలాగు నీవు చెప్పగలిగితే, గాలి - నేను సృష్టికర్తకు లోబడవలయును కదా! అని నీకు జవాబిస్తుంది. గాలి గమనము దేవునికి ఒక్కనికే తెలియును. నీతిమంతుని రక్తము షారోను గులాబీల యెదుటనే చిందింపబడవలసి యున్నదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.' నాకు చాలా ఉద్రేకం కలిగినది. నేను ఇలా అన్నాను - 'నీ రక్తము చిందింపబడుటకు వీల్లేదు. ఈ దేశపు శాస్త్రుల జ్ఞానమునకు మించిన జ్ఞానము నీలోనున్నది. నా దృష్టిలో నీవు అమూల్య ప్రశస్త మానవాకృతి. నా సభా భవనము నీకు పవిత్రాశ్రయమివ్వగలదు. దాని ద్వారములు నీకెప్పుడును తెరువబడియే యుండును'.

యేసు నిర్లక్ష్యంగా తల త్రిప్పాడు. ఆయన నవ్వుతూ ఇలా అన్నాడు. -'ఆ రోజు వచ్చినప్పుడు మనుష్య కుమారునికి భూమి మీద గాని, భూమి క్రింద గాని ఆశ్రయమే దొరకదు.'

నేను నెమ్మదిగా చెప్పాను - 'పడుచువాడా! నా విజ్ఞాపనను నీవు ఆజ్ఞగా మార్చడానికి బలవంతం చేయుచున్నావు. ఈ రాష్ట్రంలోని ప్రజాశాంతిని కాపాడవలసిన బాధ్యత నాకున్నది. దానికి నీ వలన భంగం కలుగకుండా చూడాలి. అందుచేత నీవు మెలకువగా ప్రవర్తించుట మంచిది. నీవేమీ కలత చెందకు. నా ఆజ్ఞలు నీకు తెలుసు. నీకు సంతోషం కలుగును గాక! సెలవు'.

యేసు ఇలా జవాబిచ్చాడు - 'భూ రాజా! నేను ప్రపంచంలో యుద్ధం రేపాలని రాలేదు. కాని శాంతి, సమాదానము, ప్రేమ అలవర్చాలని వచ్చితిని. నా వలన ఎవ్వరికీ ఎట్టి హింస కలుగదు. నాకు ఎవరి వల్లనైనా హింస కలిగితే దానిని నా తండ్రి చిత్తాను కూలముగా విధేయతతో అంగీకరిస్తాను. నీ రాజ్యాధికారమును గాని, అభిమానమును గాని, నేను గణించవలసిన పనిలేదు. శత్రువును దేవుని పాద సన్నిధిలో నీవు బంధించలేవు'.

ఆయనీవిధంగా చెప్పి మెరుపువలె మాయమైపోయాడు. గలిలయ రాష్ట్ర పాలకుడైన హేరోదు మీద అక్కడ ప్రజలు యేసును బంధించవలసిందిగా ఒత్తిడి తీసుకుని వచ్చారు. అతనికి అట్టి అధికారం ఉన్నప్పటికిని అతడు సాహసించలేకపోయాడు. హేరోదు రాజు దర్పము గలవాడైనప్పటికిని యీ విషయములో అతడు భయపడ్డాడనే నమ్మాలి. ఒక రోజున హేరోదు నా దగ్గరకు వచ్చి చాలా రాజకీయ సంభాషణలు అయిన తరువాత లేచి వెళ్ళబోతూ యేసును గూర్చి అభిప్రాయమడిగినాడు. అతనొక మహాతత్త్వ వేత్త, వేదాంతి అని చెప్పి రోమన్‌ రాజ్యాంగ రీత్యా అతని స్వేచ్ఛ నరికట్టవలసిన పనిలేదని నేను చెప్పాను. హేరోదు అసూయతో నవ్వి, వ్యంగ్యముగా నాకు నమస్కరించి వెళ్ళిపోయాడు.

యూదుల మహా పర్వదినమైన పస్కా పండుగ సమీపించినది. ప్రజా సమూహము ప్రవాహంగా నగరమున ప్రవేశిస్తున్నారు. ఎక్కడ విన్నా నజరేయుడైన యేసును వ్యతిరేకంగా ప్రజలకు లంచమిచ్చుటకు యూదు దేవాలయ కోశాధికారికి అధికారమియ్యబడినట్లు తెలుస్తున్నది. అపాయం చాలా తీవ్రతరంగా యున్నది. ఒక రోమన్‌ సైనికుడు అవమానింపబడినాడు. సిరియా నుండి వంద మంది సైనికులను పంపవలసిందిగా అక్కడి అధికారిని కోరాను. అతడంగీకరించలేదు. తిరుగుబాటును ఏ మాత్రమూ అణచలేనంత బలహీన స్థితిలో నేనున్నాను. దానికి తల వంచవలసిన స్థితి సంభవించుచున్నది.

పండుగలో యేసును బంధించి, హింసించి 'సిలువ వేయుము - సిలువ వేయుము' అని బిగ్గరగా కేకలు వేస్తూ నా దగ్గరకు తీసుకొని వచ్చారు. సహజంగా హేరోదీయులకు, సద్దూకయ్యులకు ఏ విధమైన పొత్తు యుండదు. కాని యేసుకు వ్యతిరేకంగా ఈ రెండు పక్షాలు ఏకమైనవి. యేసు ఈ ఉభయ వర్గాలను తీవ్రంగా ఖండించాడు. నేను చక్రవర్తి విగ్రహముతో వారి దేవాలయములోకి ప్రవేశించినప్పటి నుంచి యూదులు నా మీద పగబట్టి యున్నారు. యేసు విషయంలో నేను వారిని వ్యతిరేకిస్తే నాకు అపాయం తప్పదు. వారి దేవాలయపు ధనాగారం మీద రోమనులకు కూడా కొంత అధికారం ఉండాలని నేను కోరాను. నా ప్రతిపాదన త్రోసివేయబడినది. దీనిని గురించి కూడా నా మీద కష్టంగా వుంది. పరిసయ్యులనే ఒక తెగ ఇక్కడ ఉన్నది. వీరు విపరీతమైన జనము. ప్రభుత్వమంటే వీరికి బొత్తిగా లక్ష్యముండదు. యేసు ఎక్కడ నోరు విప్పినా వీరిని విమర్శించకుండా విడిచి పెట్టలేదు. వీరు కూడా యేసును చంపే విషయంలో ప్రధాన పాత్రధారులే.

ఈ మూడు వర్గాలను త్రోసివేయుట ఎవ్వరికినీ వీలుపడే విషయం కాదు. యేసును వారి ప్రధాన యాజకుడైన కయప ఎదుటకు యీడ్చి హింసించి, మరణమునకు పాత్రుడనే తీర్మానించిరి. ఈ తీర్మానమును అమలు జరుపవలసినదిగా ఖైదీ అయిన యేసును నా దగ్గరకు పంపిరి. కాని ఆయన హేరోదు అధికారము క్రింద ఉన్న ప్రదేశపువాడని నేను అతనిని హేరోదు నొద్దకు పంపితిని. అయితే హేరోదు దైవభక్తిని, రాజభక్తిని నటించి యేసును మరల నా యొద్దకు పంపించెను. ప్రజా సమూహము నా భవన పునాదులు అదిరిపోయినట్లుగా కేకలు వేయుచు ప్రవాహంగా వచ్చారు. క్షణక్షణానికి జన ప్రవాహం అధికమైనది. పర్వత ప్రాంతాల నుండి జనం విరగబడి వచ్చారు. యూదయ దేశమంతా యెరూషలేములో నిండిపోయింది. గలిలయలో నుండి తీసికొని వచ్చిన ఒక పిల్లను నేను భార్యగా చేసుకొన్నాను. ఆమె వచ్చి నా కాళ్ళ మీద పడి గత రాత్రి తనకేదో కలవచ్చిందని, యేసు పరిశుద్ధుడని అతని జోలికి పోవద్దని నన్ను బ్రతిమాలింది.

భూనభోంతరాళాలు దద్ధరిల్లేటట్లు కేకలేస్తూ ప్రజలు ఆ నజరేయుని నా దగ్గరకు మరల తీసుకొని వచ్చారు. నేను న్యాయ స్థానమునకు వెళ్ళి - 'మీకేమి కావాలి?' అని తీవ్రంగానే అడిగాను. 'ఈ నజరేయుని చంపాలి' అని వారు జవాబు యిచ్చారు. 'ఎందుకు?' 'దేవదూషణ చేసినందుకు, ఈ పరిశుద్ధ స్థలమును నాశనం చేయ ప్రయత్నించినందుకు; వీడు దేవుని కుమారుడనని, మెస్సియానని, యూదుల రాజునని చెప్పుకుంటునందుకు', 'ఈ కారణములకు ఏ మనుష్యునకును రోమనుల న్యాయము మరణ దండన విధించదు'. 'వాని సిలువ వేయుము - వాని సిలువ వేయు' అన్నదే నేను అడిగిన ప్రశ్నలకు వారి జవాబు. ఉద్రేకపూరితులైన ఆ ప్రజలు భవనమును పునాదులతో సైతము పెకలించి వేయుటకు ప్రయత్నించారు. ప్రజలు తమను తామ మరచిపోయి కేకలే వేసారు. వారందరిలోను మౌనముగా నొక్కరే ఉన్నారు. అతడే నజరేయుడైన యేసు!

దుర్మార్గులైన యీ శత్రువుల బారి నుండి యేసును రక్షించుటకు నాకు ఒకే ఒక మార్గము కనబడింది. అతనిని కొట్టుటకు ఆజ్ఞ యిచ్చితిని. నేను నా చేతులు కడుగుకొంటిని. ఆయన నిర్దోషియని చెప్పితిని. ఆయనను కొట్టినప్పుడే సంతృప్తి పడివెళ్ళిపోవుదురనుకొన్నాను. చివరకు నేను చేసిన రెండు పనులకైనా భయపడుదురనుకొన్నాను. నా ప్రయత్నములలో యేదియు ఫలించలేదు. ఆయన ప్రాణమే వారికి కావలెను.

నేననేక తిరుగుబాటులు చూసాను కాని యింత భయంకరమైన తిరుగుబాటును నేనెన్నడూ చూడలేదు. ప్రేతోర్యమను సభాభవనం నుండి సీయోను కొండ వరకు నడుచుటకు వీలుకానంత జన సమూహము క్రమ్మివేసినది. న