వాక్యసందేశముPost Date:2014-04-04//No:45

క్రీస్తు సిలువ వేయబడినందున

  ప్రభువైన యేసుక్రీస్తు మరణించినందున కలిగిన ఏడు ప్రత్యేకమైన మేళ్ళను గూర్చి ధ్యానిద్దాం.

1. శత్రువులు మిత్రులుగా మారిరి : అంతకు ముందు హేరోదును పిలాతును ఒకనినొకడు శత్రువులై ఉండి, ఆ దినముననే యొకనికొకడు మిత్రులైరి (లూకా 23:12) రోమా కైసరు కొరకు ఒక్కొక్క ప్రాంతములో ఏలుబడి చేసిన గవర్నర్లే వీరు. ఇందులో భాగంగా హేరోదు గలిలయలోను పిలాతు యూదయలోను ఏలుచుండిరి. వారు ఏలుచుండిన ప్రాంతములో నివసించే ప్రజలమీద మాత్రమే వారికి అధికారం ఉండేది.

హేరోదుకు తెలియకుండా గలిలయవారిని వధించినందున వారిరువురు శత్రువులైరి. ఈ శత్రుత్వం ఇలా ఉండగా యేసుయొక్క కేసు రంగంలోనికి వచ్చినది.

యేసువచ్చి వారి మధ్యలో నిలిచినందుకు శత్రువులిరువురు మిత్రులైరి (లూకా 23:12, అపో.కా.4:28) ఈలాగే అనేకులను సమాధానపరచుటకు యేసుకు సాధ్యమాయెను. అందులో అతి ప్రాముఖ్యమైనది దేవునితో శత్రుత్వం కలిగి ఉన్న మానవుని దేవునితో సమాధానపరచెను. (ఎఫెసీ 2:14-18, రోమా 5:10).

2. నేరస్తుడు జైలు నుండి విడుదల పొందాడు:

'అయితే వారు - వీనిని వద్దు, బరబ్బాను విడుదల చేయమని మరల కేకలు వేసిరి. ఈ బరబ్బా బంధిపోటు దొంగ' (యోహా 18:40) నిరపరాదియైన యేసును ఎలాగైనా విడిచిపెట్టాలని పిలాతు ఆశించెను. దానికై ఆయన ఓ పరిష్కార మార్గమును కనుగొనెను, యూదులు ఐగుప్తునుండి విమోచించబడిన దానికి జ్ఞాపకార్థముగా పస్కాపండుగను ఆచరించిరి, ఆ పండుగ సమయంలో నేరస్థుడొకనికి బహిరంగ క్షమాపణనిచ్చి స్వతంత్రులుగా విడిచిపెట్టవచ్చు. యూదులు నేరస్థుడని చెప్పుచున్న యేసును బహిరంగముగా క్షమించి స్వతంత్రముగా విడిచిపెట్టాలని పిలాతు ప్రయత్నించాడు. అయితే అతని ప్రయత్నం బెడిసికొట్టి ప్రజల ఆక్రోశమే ఫలించింది. యేసు సిలువవేయబడెను. కరడుగట్టిన బంధిపోటు దొంగయైన బరబ్బాను క్షమించి స్వతంత్రునిగా విడిచిపెట్టిరి, జైలునుండి విడుదల పొందిన బరబ్బాతో మీరు స్వతంత్రులగుటకు కారణం ఎవరని అడిగినట్లయితే తడుముకోకుండా యేసుక్రీస్తు అని జవాబిస్తాడు. 'చెరలోనున్న వారికి విడుదలను' ఇచ్చుటకు వచ్చిన క్రీస్తు బరబ్బాను విమోచించెను (లూకా 4:18). మరణ భయముతో జీవించిన బరబ్బాను మాత్రమేగాక మానవజాతి యావత్తును విడిపించెను. అదే హెబ్రీ పత్రికలో మనము చదువుచున్నాము 'జీవితకాలమంతయు మరణభయము చేత దాస్యమునకు లోబడినవారిని యేసు విడిపించెను' (హెబ్రీ 2:14).

3. పాపి పరదైసులోనికి ప్రవేశించాడు:

గొల్గొత కొండపై ఇద్దరు దొంగల మధ్య యేసును సిలువ వేసిరి. మొదట ఆ ఇద్దరు దొంగలు యేసును దూషించిరి. కాసేపటికి వారిలో ఒకడు మారుమనస్సు పొందెను, 'నజరేతువాడైన యేసు యూదులరాజు' అని పైవిలాసము క్రీస్తుకు పైగా వ్రాయబడినది అతడు చదివాడు దేవుని రాజ్యమును గూర్చియు మరణానంతర జీవితమును గూర్చియు అతనికి స్పష్టంగా అర్ధమైనది. యేసును దూషిస్తూ ఉండిన వ్యక్తితో క్రీస్తు విశిష్టతను గూర్చి తెల్పుతూ గద్దించి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినపుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమని విజ్ఞాపన చేసెను. భయంకరమైన పాపియైనను పశ్చాత్తాపముతో క్రీస్తును అంగీకరించినవానిని 'నేడు నీవు నాతోకూడా పరదైసులో ఉందువని' నిశ్చయముగా చెప్పెను.

4. సైనికులకు వస్త్రాలు దొరికినవి:

(యోహాను 19:23,24) బి.సి 1000లో దావీదు ప్రవచనాత్మతో పాడినది క్రీస్తునందు నెరవేరెను (కీర్తన 22:18) సహజంగా ఒక యూదుడు సిద్ధపడినప్పుడు ఐదు ప్రత్యేకతలు కన్పించును. శిరస్సుపై వస్త్రము (తలకప్పు), అంగీ, లోపలి వస్త్రము, నడుమునకు దట్టి, చెప్పులు ధరించుదురు. ఓ భక్తుడు చెప్పినదేమనగా నాలుగు భాగములు వేసిరి అనగా, ఒక అంగీని నాలుగుగా చింపిరి అనికాదు. అంగీ తప్ప నాలుగు ఒక్కొక్కటి చొప్పున ఒక్కొక్కరు తీసుకొనిరని అర్ధము అంగీ పైబట్ట ఒక వేళ రెండు భాగాలుగా కలిపి కుట్టినదై ఉండవచ్చు. అయితే క్రీస్తుయొక్క అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది గనుక ఆయన ప్రధానయాజకుడని దీనివలన మనకు అర్థమగుచున్నది (లేవీ.21:10).

5. యెరూషలేములో ఒక సమాధుల దొడ్డి ఏర్పడెను:

యేసు సిలువపై వ్రేలాడుచుండిన సమయంలో గొప్ప భూకంపము కలుగగా బండలు బ్రద్దలాయెను, యూదా యొక్క శవము అప్పుడు క్రిందపడియుండవచ్చును, అతడు తలక్రిందుగాపడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నియు బయటకువచ్చెను (అ.కా.1:18). అదే ఆ పాపియొక్క దారుణమైన అంతము, ప్రధానయాజకులు ఆ వెండినాణెములు తీసుకొని ఇవి రక్తక్రయధనము గనుక వీటిని కానుకపెట్టెలో వేయక పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరివాని పొలము కొనిరి (సమాధులదొడ్డి), రక్తపు పొలమని దానికి పేరు (మత్త.27:3-10, అ.కా.1:17-19).

చనిపోతే ఎక్కడికి (పరదైసులో) వెళ్తానని పశ్చాత్తాపపడిన పాపికి జవాబుఇచ్చిన క్రీస్తు, చస్తే ఎక్కడ పాతిపెట్టాలనే సమస్యకు పరిష్కారమిచ్చెను.

6.సైనికులకు ద్రవ్యము దొరికెను:

(మత్తయి 28:12-15) యేసుక్రీస్తు పునరుత్థానమునకు వ్యతిరేకముగా యూదులు పెద్దరాయి సమాధికి ముద్ర సైనికుల కాపల ఇలా తమకు చేతనైనంతగా ప్రయత్నించిరి. ఈ వ్యతిరేకతలన్నిటిని బ్రద్దలు చేసుకుంటూ యేసు పునరుత్థానుడాయెను (మత్తయి 27:65, రోమా 1:7).

వారి ప్రణాళికలు బెడిసికొట్టగా అపజయభీతి కల్గిన యూదులు మరో ప్రయత్నముగా అబద్దకధను ప్రచారము చేసిరి. యేసు సమాధి యెదుట కావలుండిన సైనికులచేతనే ఊరంతా ప్రచారము చేయించిరి. మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తుకొనిపోయిరి. ఇదే సైనికులు ప్రచారము చేసిన అబద్దకథ. ఈ దొంగ నాటకాన్ని ప్రదర్శించటానికి లంచముగా ప్రధానయాజకులు వారికి చాలాద్రవ్యం ఇచ్చిరి.

7. నాకు మీకు పాపక్షమాపణ దొరికెను:

  (1యోహా.1:7, ఎఫె.1:7) మనమింకను పాపులమైయుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను (రోమా 5:8). లోకపాపమును మోసుకొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్లయే క్రీస్తు (యోహా.1:29,36, లేవి 16:21,22). యెహోవా మనయందరి దోషమును అతనిమీద మోపెను క్రీస్తు తన శరీరమందు మన పాపముల
క్రీస్తు