వాక్యసందేశముPost Date:2014-03-21//No:43

జీవశ్చవాన్ని నాడు, జీవిస్తున్నాను నేడు

 స్వరమిప్పిన సిలువ

ప్రియ 21వ శతాబ్దపు ప్రజలారా మరియు విశ్వాసులారా! నా గురించి తెలియని వారుండరనుకుంటాను. అవిశ్వాసులకు సహితము నేను పరిచయమైనదాననే! రోమా ప్రభుత్వం వారు దుర్మార్గులను, క్రూర నరహంతకులను, దేశద్రోహులను భయంకరముగా శిక్షించేవారు. ఆ సందర్భంలో నన్నొక బలమైన మారణాయుధముగా ఉపయోగించేవారు. ఓ రకంగా నా సహవాసము నా జీవితమంతా దుష్టులతోనే కొనసాగేది. లోకములో దురహంకారులకు, నేరస్తులకు ఆశ్రయమిచ్చేంత దుస్థితిలో ఉన్నానే అనుకుంటూ భారభరితముగా బ్రతుకునీడ్చేదానిని. వారి కరడుగట్టిన అపరిశుభ్ర దేహాలు, రోగగ్రస్తమైన వారి రక్తమాంసములు నాకు తాకుచున్నందుచేత దుర్గంధమును కలిగి నేనును అపరిశుభ్రమైపోయేదాన్ని. నన్నెవరు పునీతురాలను చేస్తారు? నన్నెవరు కనికరిస్తారు? ఇక నా బ్రతుకింతేనా? అనుకుంటూ జీవశ్చవంలా ప్రభుత్వాధికారుల చేతుల్లో ఓ కీలుబొమ్మగా మారిపోయాను...

ఇంతకీ నేనెవరో చెప్పలేదు కదూ.. నన్ను 'సిలువ' అని పిలుస్తారు. ఓ అడ్డ కర్ర మరియు నిలువ కర్రను తీసుకొని వాటిని జతచేసి నన్ను తయారు చేస్తారు. అమానుషం, అవహేళన, అపహాస్యం, అవమానం, అధర్మం, అగ్నిహోత్రం అను వాటికి చిరునామాను నేను. రోమా సైనికుల పైశాచిక చర్యలకు,  కేంద్ర బిందువును నేను. ఈనాడు చాలామంది క్రైస్తవులు నన్నొక భక్తి చిహ్నంగా భావించి వారి ఆభరణముల మీద గుర్తులుగా చేసుకొని, మెడలో తగిలించుకొని, గృహోపకరణ సామాగ్రిలో అలంకార వస్తువుగా చేసుకొని, కొండలమీద, దేవాలయాలమీద అలంకరించుకొంటున్నారు కదండీ...

నిరాశాజీవిగా, దుర్మార్గపు క్రియలకు ఆలంబనగా బ్రతుకుచున్న జీవశ్చవమైన నాకు విడుదల వచ్చే రోజుకోసం ఆశతో ఎదురుచూశానండీ... ప్రతి ఒక్కరూ సిలువ అను నన్ను అమానుష క్రీడగా చిత్రీకరిస్తుంటే నాలో నేనే కుమిలిపోయేదానిని. అయితే ఓ అద్భుతమైన రోజు నా జీవితంలో అడుగుపెట్టింది. విలువలేని నాకు విలువనిచ్చిన దినమదే!

సర్వలోకనాధుడైన క్రీస్తుప్రభువు పాషాణహృదయంతో నింపబడిన మానవులందరిని రక్షించుట కొరకు పాపిగా మార్చబడి సిలువబలియాగమును ఎంచుకున్న ఆ మధురక్షణం నా జీవితంలోని ప్రతీక్షణాన్ని ఉత్తేజింపచేసింది. పరమపవిత్రుడు అయిన యేసు స్పర్శ తగలగానే పాపులతో వారి రక్తంలో నింపబడిన నా దేహం పునీతం గావించబడింది. ఏదో తెలియని మధురానుభూతి నా యెదలో చేరిపోయింది. ఆ మండుటెండలో ఆ పరమతండ్రి మానవాళి రక్షణకోసం పడుతున్న భయంకర బాధలో నేనొక్కదాన్నే ఆయనకు తోడుగా నిలిచే భాగ్యము దొరికినందుకు చాలా సంతోషించాను. గాని ఆ పుణ్యమూర్తి అనుభవిస్తున్న ఆ హృదయఘోషను అతి సమీపముగా చూస్తున్న నేను మాత్రం తట్టుకోలేకపోయాను.

క్రూరాతిక్రూరంగా ప్రవర్తిస్తూ వికృతచర్యలు కొనసాగిస్తూ ప్రజలందరిని భయకంపితులను చేస్తూ, వారికి కీడుచేసే ఓ జంతువును కూడా మనుష్యులు హింసించరేమో... తమ సృష్టికి, తమ ఉనికికి, తమ ప్రాణానికి మూలాధారమైన ప్రభువునిలా హీనంగా గాయపరుస్తూ, మృగాలకన్నా క్రూరంగా ప్రవర్తిస్తుంటే ఎందుకయ్యా దేవా! నీకింత కష్టం! సర్వసృష్టిని ఒక్కమాటతో కలుగజేసిన నీ నోరు ఒక్క మాట పలికితే ఎప్పుడు తమ ఉగ్రత కురిపించి తమ సృష్టికర్తను హింసిస్తున్న ప్రతి హింసకు రెట్టింపు బాధకు గురిచెయ్యాలని ఎదురుచూస్తున్న ప్రకృతంతా ఒక్కసారిగా వీరందరిమీద విజృంభించి వీరిని క్షణంలో మాయం చేయగలదు గదా దేవా అంటూ చెప్పాలనిపించింది. రాణువవారు కొడుతున్న ఆ కొరడాదెబ్బలు అడపాదడపా నాకు తగులుతుంటే ప్రాణంలేని నాకే ప్రాణం పోయినట్టుండేది. రాళ్ళ దెబ్బలకు శరీరం చిత్తు చిత్తవుతుంటే చిరునవ్వు ఆభరణంగా ధరించిన కరుణామయుని చూస్తుంటే నా గుండె నీరయ్యిపోయింది. అపహాస్యాలు, ఉమ్ములు, పిడుగుద్దులు ఆయనను తాకుతుంటే నా కళ్ళు చెరువయ్యాయి. కర్కశమైన సూదంటూ రాళ్ళు, ముళ్ళు, మండుటెండ, నిరాధరణ, దప్పిక, నిస్సహాయత ఆయనను మరింత భాదపెడుతుంటే అయ్యో! నాకు రెక్కలుండినా బాగుండునే ఈ దయామయుని తీసుకుని ఎగిరిపోయేదానిని అని ఆరాటపడ్డాను. ఎట్టకేలకు నన్ను మోసుకుంటూ ఆ కల్వరి శిఖరము చేరిన ఈ త్యాగ శీలునితో నన్ను బంధిస్తుంటే నా దేహం ముక్కముక్కలైంది. ఎవ్వరికి నేనింత దుర్గతి పట్టించలేదే! అరే మేకులతోనా నన్ను నా ప్రభువుని ఏకం చేస్తున్నారు. అయ్యో! అని నేను చేసిన ఆక్రందనలు, అరణ్య రోధనయ్యాయి. భూమికి, ఆకాశానికి మధ్యలో నేను నా ప్రభువును చూపుతూ నిలువబడ్డాను. ఆ సమయంలో ప్రతి క్షణం నాలో అగ్నికీలలు మండుతూనే ఉన్నాయి. ఉద్రేకంతో ఊగిపోతూనే ఉన్నాను. నీతి మంతుడైన నా యేసయ్యకు కలిగిన ఈ పరిస్థితిని తలంచుకొంటూ మానవాళిని శపించనారంభించాను.

  అయితే కొద్ది క్షణాల్లోనే గ్రుడ్డివాళ్ళ కన్నులు తెరచిన ప్రభువును నా కళ్ళను కూడా తెరిచాడు. ఆ మహోన్నతుని అపార శక్తిని చవిచూశాను. ఈ బలియాగం ఇందుకని గ్రహించి ఆశ్చర్యపోయాను రాబోయే ఘోర ఉగ్రత నుండి మానవులందరిని తప్పించడానికేనా ఈ త్యాగమంతా అని తెలుసుకుని ఆశ్చర్యపడ్డాను. మానవులైన మీ అందరి మీద అపరిమితమైన జాలితో నింపబడ్డాను. నా మీద ఆనుకొని పలికిన నా ప్రభువు యొక్క 7 మాటలు నాలో పెనుమార్పును తీసుకువచ్చాయి. నికృష్టమైన నా జీవితం అర్థవంతంగా మారింది. అంధకారంలో మ్రగ్గుచున్న నా బ్రతుకు తేజోవంతమైంది. ఆ మహానీయుని కల్వరి యాత్రలో కడవరకు కొనసాగే ధన్యత లభించింది. శిలువనైన నేను పుష్పించనారంభించాను. వర్ణణాతీతమైన పరిశుద్దుని ప్రేమ ఎంత మధురమైనదో గ్రహించాను. అమ్మో! ప్రభువు నన్ను మోసి యుండకపోతే నాకు విలువ లేదు. మీకు విమోచన లేదు.

  ఏది ఏమైనా ప్రియ ప్రజలారా 'శిలువ'నైన నాకు ఎంతో విలువనిచ్చి యేసును గురించి మాట్లాడే ప్రతి సందర్భంలోనూ ప్రతి నోరూ నా గురించి పలుకుతుంటే నేనెంత పరవశించుచున్నానో తెలుసా! బిల్లీ గ్రాహం అను గొప్ప దైవసేవకుడు 'సిలువ లేని సందేశం విలువ లేని సందేశం' అని నా గురించి
జీవశ్చవాన్ని