వాక్యసందేశముPost Date:2014-03-14//No:42ప్రాయశ్చిత్తార్ధబలి ATONEMENT క్రీస్తుకు సాదృశ్యముగా అర్పింపబడిన కొన్ని బలులు, పాత నిబంధనలో: ఆజ్ఞనతిక్రమించి దిగంబరులుగా నున్న ఆదాము హవ్వల దిగంబరత్వమును కప్పుటకు దేవుడైన యెహోవా చర్మపు చొక్కాయిలను చేయించుటకు ప్రప్రధమముగా పశువులు వధించబడ్డాయి. (ఆది 3:21).

అబ్రాహామును, దేవుడైన యెహోవా, తాను ప్రేమించు ఏకైక కుమారుడు ఇస్సాకును దహనబలిగా నర్పించుమని చెప్పగా శిరసావహించిన అబ్రాహాము ఇస్సాకును బంధించి వధించడానికి ఉద్యుక్తుడు కాగా, అబ్రాహామును ఆపి, పొదలోనున్న పొట్టేలును చూపించగా, అబ్రాహాము తన కుమారునికి బదులుగా ఆ పొట్టేలును దహన బలిగా నర్పించాడు. (ఆది 22:1-13). ఇది ప్రత్యామ్నాయ బలి.

ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి విడుదల పొందిన రాత్రి అనగా సంవత్సరమునకు మొదటి నెల థమినాడు (నిసానుమాసము (Sacred Calender) - అబీబు మాసము (Civil Calender) - మన కేలెండరు ప్రకారము మార్చి - ఏప్రిల్‌ మాసములలో) వారు తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొఱ్ఱెపిల్లనైనను, ఒక మేకపిల్లనైనను నిర్ధోషమైన ఏడాది మగపిల్లను తీసికొని, సాయంకాలమందు దాని చంపి దాని రక్తములో కొంచెముతీసి, ఇండ్ల ద్వారబంధపు రెండు నిలువు కమ్ములమీదను, పైకమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాని తినవలెను. (నిర్గ 12:1-8) అది పస్కాబలి. పస్కా అనగా  (Passover) 'దాటిపోవుట' అని అర్ధము. అనగా ఆ రక్తమును చూచి మరణ దూత వారిని దాటి పోయాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు వారితో నశించిపోకుండా ఆ రాత్రేవారు త్వరపడుచు కానాను వైపునకు ప్రయాణము కొనసాగించారు. ఆ నిర్ధోషమైన గొఱ్ఱెపిల్ల రక్తము ద్వారా వారికి రక్షణ, ఆ మాంసము వారి ప్రయాణము కొరకు శక్తిని ఇచ్చినవి. ఇదే మనము ఆచరించు పస్కా. మంచి శుక్రవారము ఇది విమోచనా బలి.

అహరోనును అతని సంతతిని యాజకులుగా ప్రతిష్టించుటకు ఒక కోడె దూడను, కళంకములేని రెండు పొట్టేళ్ళను, పొంగని భక్ష్యములను తీసికొని రావలెను. వాటి తలలమీద వారి చేతులనుంచవలెను. గుడారపు ద్వారమునొద్ద వాటిని వధించాలి. వాటి రక్తమును వారి మీదను బలిపీఠము చుట్టును ప్రోక్షించాలి. ఆ పశుమాంసమును పాళెము వెలుపట అగ్నితో దహించాలి. ఇవి వారి నిమిత్తమై చేయవలసిన పాప పరిహారార్ధమైన బలులు. (నిర్గమ 29:1-25) మరియు శుద్ధీకరణ కొరకైన బలి.

ధర్మశాస్త్ర ప్రకారము ఆజ్ఞలన్నింటిలో దేని విషయమైనను ఎవరైన పాపియైన యెడల, తాను చేసిన పాపముకై నిర్ధోషమైన కోడెదూడను పాప పరిహారార్ధ బలిగా నర్పించాలి. సమాజము పాపము చేసినా, అధికారి పాపము చేసినా, దేశస్థులలో ఎవడు పాపము చేసినా ఈ బలిని చేయవలసి వుంది. (లేవి 4:1-35) ఇంకా సమాధాన బలులు (లేవీ 3:6), ప్రాయశ్చిత్తార్ధ బలుల (లేవీ 5:10) ను గూర్చి చెప్పబడియున్నవి. ఈ బలులన్నిటిలో ఏ లోపముగాని, అనగా కుంటి తనముగాని, గ్రుడ్డితనము గాని ఉండకూడదు. పవిత్ర పకక్షులను.... తీసుకొనివచ్చి పారు నీటిపైన మంటి పాత్రలో ఆ పకక్షులలో ఒకదాని చంపి, సజీవమైన రెండవ పక్షిని ఆ వస్తువులను, చంపిన రక్తములో ముంచి, పవిత్రత పొందగోరు వాని మీద ఏడు మారులు ప్రోక్షించి సజీవమైన పక్ష్షిని ఎగిరిపోవునట్లు వదలివేయాలి. వానిని పవిత్రుడుగా నిర్ణయించాలి. (లేవీ 14:1-20).

ప్రధానయాజకుడు సంవత్సరమునకు ఒక్కసారే తన కొరకును, ప్రజల అజ్ఞాత కృతముల కొరకును అర్పించిన రక్తమును చేత పట్టుకొని అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించును. (హెబ్రీ 9:7) సర్వ మానవ పాప పరిహారార్ధం రక్తము చిందించుట తప్పనిసరి. కాగా అది నిర్ధోషమైన పశువు కావాలి.

పైన చెప్పబడిన దహన బలులు, పాప పరిహారార్ధ బలులు, ప్రాయశ్చిత్తార్ధ బలులు, సమాధాన బలులు, క్రీస్తుకు నాలుగువేల సంవత్సరముల పూర్వము ఆయా సందర్భాలలో అర్పించుటకై దేవుడు ఆజ్ఞాపించిన బలులు. ఇవి 'క్రీస్తు, రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి.... మేకల యొక్కయు, కోడెల యొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించవలసిన కార్యమునకు ముంగుర్తులు (హెబ్రీ 9:11-12). దేవుని ఏర్పాట్లు.

ధర్మశాస్త్రములో అర్పించబడిన బలులకు ప్రతిగా యేసుక్రీస్తు వారు లోకపాపములను మోసికొని పోవు దేవుని గొఱ్ఱెపిల్లగా బలియై ఆ తరువాత బలులన్నిటికి స్వస్థి చెప్పినాడు. ఆయన పొందిన సిలువ శ్రమలు, దుష్టులైన యూదులు ఆయనను తృణీకరించినందుకును, రోమా ప్రభుత్వము క్రూరమైనందుకును, అని మనము తలంచుచున్నాము. కాని ఆయన శ్రమలు లేఖనాను సారముగానే జరిగినవి. అని చెప్పుటకు ఎన్నో ప్రవచనాధారాలు ఉన్నాయి. వాటిలో కొన్నిటిని మాత్రమే విశ్లేషించుకుందాము.

1. అన్యులకు అప్పగింపబడును (Delivered to gentiles) : 'భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని (Messiah) విరోధముగా నిలువబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు'. (కీర్తన 2:1-3). ఈ కీర్తన ఎవరు ప్రవచించారో తెలియదు గాని ఇది మెస్సీయను గూర్చి ప్రవచించినదని గ్రహించగలము. (గమనిక : 'ఒకడు ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని గ్రహించాలి. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛను బట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి'. (2 పేతురు 1:20,21). మెస్సీయ అంటే 'అభిషిక్తుడు'.

 నెరవేర్పు : 'ఆయనను బంధించి, తీసికొనిపోయి అధిపతియైన పిలాతునకు అప్పగించిరి.' (మత్తయి 27:2) 'ఏవి జరుగవలెనని నీ హస్తమును, నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటినన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును కూడుకొనిరి'. (అపో.కా.4:27)

2. అపహసించిరి (They Mocked) : 'చీల్చుచును గర్జించుచు నుండు సింహమువలె వారు నోళ్ళు తెరచుచున్నారు'. (కీర్తన 22:13). 'అతడు తృణీకరింపబడినవాడును ఆయెను, మనుష్యుల వలన విసర్జింపబడినవాడును, వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధి ననుభవించినవాడుగాను మనుష్యులు చూడ నొల్లనివాడుగానూ ఉండెను'. (యెషయా 53:3).

క్రీస్తుకు పూర్వము 750 సం||ల క్రితమే ఆయన జనన మరణ పునరుత్థానములను గూర్చి ప్రవచించినవాడు యెషయా ప్రవక్త. ఆయన అన్యాయపు తీర్పునొందినాడని ఆనాడే ప్రవచించియున్నాడు.నెరవేర్పు : 'పిలాతు-క్రీస్తనబడిన యేసును ఏమిచేతునని వారినడుగగా - సిలువ వేయమని అందరును చెప్పిరి. ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసెనని అడుగగా-వారు సిలువవేయుమని మరి ఎక్కువగా కేకలు వేసిరి'. (మత్తయి 27:23) 'వారికేకలే గెలిచెను' (లూకా 23:23). ఆయన పక్షముగా వాదించువారు లేరు.

3. వికారము చేసిరి (Disfigured Him) : 'నా వస్త్రములు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు'. (కీర్తన 22:18) 'నిన్ను చూచి యే మనిషి రూపము కంటె అతని ముఖమును, నరరూపముకంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఏలాగు విస్మరించిరో...' (యెషయా 52:14).

'నాకంటే తక్కువ వయస్సు గలవారు నన్ను ఎగతాళి చేయుదురు' (యోబు 30:1)

నెరవేర్పు : 'వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎఱ్ఱని అంగీని తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలమీదపెట్టి... ఆయన యెదుట మోకాళ్ళూని-యూదులరాజా, నీకు శుభమని ఆయనను అపహసించిరి'. (మత్తయి 27:28,29). ఆయన మనకు రక్షణ వస్త్రమును ధరింపజేయుటకు ఆయన వస్త్రహీనుడుగా చేయబడ్డాడు. ప్రియుడా, నీ నిమిత్తము అవమానము పాలైన ప్రభువుకు కృతజ్ఞుడవై యుండవా?

4. ఉమ్మివేసిరి (They Spatupon) : 'కొట్టువారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరికివేయు వారికి నా చెంపలను అప్పగించితిని. ఉమ్మివేయువారికి అవమాన పరచువారికిని నా ముఖము దాచుకొనలేదు. నా ముఖము చెకుముకి రాతివలె చేసికొంటిని'. (యెషయా 50:6,7)

నెరవేర్పు : 'అప్పుడు వారు ఆయన ముఖముమీద ఉమ్మివేసి, ఆయనను గుద్దిరి, కొందరు ఆయనను అర చేతులతో కొట్టి క్రీస్తు నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపుమని చెప్పిరి'. (మత్తయి 26:67,68). రోమా ప్రభుత్వపు ప్రేతోర్యమను అధికార మందిరములో 600 మంది సైనికులుంటారు. వారు వరుసగా ఒక్కొక్కరు వచ్చి ముఖము మీద ఉమ్మివేస్తూ పోతూవుంటే తలనుండి రక్తము-ఆ ఉమ్మి-ఆ రూపము ఎట్లుంటుంది? నిన్ను తనన్ను సురూపునిగా చేయుటకు ఆయన కురూపియయ్యాడు. ప్రియుడా, అంతగా అవమానము పొందుటకు ఆయన చేసిన నేరమేమిటి? మన యతిక్రమములే! మన సమాధానార్ధమైన శిక్ష ఆయన అనుభవించాడు.

5. కొరడాలతో కొట్టిరి (They Scourged): 'దున్నువారు నా వీపుమీద దున్నిరి. వారు చాళ్ళను పొడుగుగా చేసిరి,' (కీర్తన 129:3). 'మన యతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను.....' (యెషయా 53:5), ఆయన పొందవలసిన హింసను, ప్రవక్త ముందే ప్రవచించాడు.

నెరవేర్పు : 'బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను' (మార్కు 15:15). ప్రభువును దాదాపు 465 కొరడా దెబ్బలు కొట్టినట్లుగా కొన్ని ప్రతులలో వివరించారు. అంటే శరీరములో గాయము కలిసిపోయి రక్తపు ముద్దగా మారిపోయాడని ఊహించవచ్చు. పాపము చేసింది మనము, హింసింపబడింది ఆయన. దీనితో తండ్రితో మనకున్న వివాదమును తీర్చి సమాధానము అనుగ్రహించాడు.

6. సిలువవేసి చంపిరి (Put to death by Crucification) : '.... వారు నా చేతులను, నా పాదములను పొడిచి యున్నారు', (కీర్తన 22:16). 'నీ చేతులకు గాయములేమని వారడుగగా - ఇవి నన్ను ప్రేమించినవారి యింట నేనుండగా నాకు కలిగిన గాయములు....' (జెకర్యా 13:6), అవును, తన ప్రజలే ఈ హింసకు గురి చేసారు.

నెరవేర్పు : 'రెండు దినములైన పిమ్మట పస్కా పండుగవచ్చును. అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియును', (మత్తయి 26:2) Lord has predicted His own death. 'వారు యేసునొద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొందియుండుట చూచి... ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తమును, నీళ్ళును కారెను'. (యోహాను 19:33-36), కీర్తన 34:20. 'వాని ఎముకలు విరిగిపోలేదు'.

7. సమాధిచేసిరి (They Buried Him)  : 'అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను'. (యెషయా 53:9)., 'యోనా మూడు రాత్రింబగళ్ళు తిమింగలము కుడుపులో ఏలాగుండెనో అలాగే మనుష్య కుమారుడు భూగర్భములో ఉండును.' (మత్తయి 12:40), ఇది ప్రభువు తానే చెప్పిన ప్రవచనం.

నెరవేర్పు : 'అరిమతయి యోసేపు - నారబట్టకొని, ఆయనను దించి, ఆ బట్టతోచుట్టి, బండలో తొలిపించిన సమాధియందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను'. (మార్కు 15:46).ప్రియులారా! కనికరము కలిగిన దేవుడు మానవ పాపపరిహారము నిమిత్తము అర్పించబడుచున్న కోడెల రక్తమందైనను, గొఱ్ఱెపిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను ఇష్టపడని కారణాన, వాటికి బదులుగా తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును సాత్వికమైన గొఱ్ఱెపిల్లవలె వధింపబడుటకు ఈ లోకమునకు పంపెను. పూర్వ కాలమునుండి అర్పింపబడుచున్న బలులన్నియు ఆయనకు చాయా రూపములే అని ఎరగాలి.

ఆయన - 1. లోకపాపములు మోసికొని పోవు దేవుని గొఱ్ఱెపిల్ల. (యోహాను 1:29,36) 2. నిష్కలంకమగు గొఱ్ఱెపిల్ల. (1 పేతురు 1:19). 3. ఉగ్రుడైన గొఱ్ఱెపిల్ల (ప్రక 6:17) 4. రక్తము కార్చిన గొఱ్ఱెపిల్ల (ప్రక 12:11) 5. ఏడు ముద్రలు విప్పిన గొఱ్ఱెపిల్ల (ప్రక 6:1) 6. వధింపబడిన గొఱ్ఱెపిల్ల (ప్రక 13:8) 7. రాజులకు రాజైన గొఱ్ఱెపిల్ల (ప్రక 19:14) 8. పెండ్లి కుమారుడైన గొఱ్ఱెపిల్ల. (ప్రక 19:7-9) 9. దేవాలయమును, దీపమునైన గొఱ్ఱెపిల్ల (ప్రక 21:22,23) 10. సింహాసనాసీనుడైన గొఱ్ఱెపిల్ల (ప్రక 7:17). ఈ గొఱ్ఱెపిల్ల కార్చిన అమూల్య రక్తము అనేకుల కొరకు చిందింపబడి యున్న నిబంధన రక్తము, మన ప్రతి పాపమునుండి పవిత్రులనుగా చేయుశక్తి గలది. ఆ రక్తముతో నేడే నీ హృదయాన్ని శుద్ధిచేసుకో.

'లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపొందెను. సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను'. (1 కొరింధి 15:3,40). క్రీస్తువారు మరణించకుంటే మనకు జీవము లేదు. రక్షణ లేదు. ఆయన పునరుత్ధానుడు కాకుంటే మనకు నిరీక్షణలేదు. ఆయన కృపకు, బలిత్యాగమునకు వేలాది స్తోత్రములు. '...జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల క