వాక్యసందేశముPost Date:2014-03-07//No:41

శ్రమలు తెచ్చే సిరులు

  విధేయత ద్వారా యేసు మూడు లోకాలలో హెచ్చింపబడ్డాడు. యేసుకన్నా గొప్పవాడు మరొకరు లేరు. ఎందుకంటే యేసే శ్రమను సంపూర్ణంగా భరించినవాడు. మనం కూడా క్రీస్తు వలె శ్రమల ద్వారా విధేయత నేర్చుకోవాలి.

భూమి మీద మనకు లభ్యమయ్యే శ్రేష్టమైన ప్రతిదీ శ్రమల్లో నుండి వచ్చినవే. భూమి మీద ఉన్నవి మాత్రమే కాదు, పరలోకంలో ఉన్న పెద్దలైన పరిశుద్ధులు సహితం శ్రమలు సహించడం ద్వారానే సింహసనాసీనులు కాగలిగారని మనం మర్చిపోరాదు.

శ్రమల ద్వారా అభివృద్ధి  నిర్గమ కాండము మొదటి అధ్యాయం 12వ వచనంలో ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను శ్రమపెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి అని బైబిల్‌ గ్రంధం ప్రబోధిస్తోంది.

క్రీ.శ.54 నుండి 68 వరకు రోమా రాజ్యమేలిన నీరో చక్రవర్తి క్రైస్తవులను బహుగా హింసించాడు. జంతువుల చర్మములో క్రైస్తవులను చుట్టి వాటిపై నూనె పోసి నిప్పంటించి, రాత్రివేళల్లో దీపాలుగా ప్రకాశించుటకు వారిని వినియోగించుకొనేవాడు. ఇక్కడొక విషయం మనం గమనించాలి. నీరో చక్రవర్తి శ్రమల కాలంలో ఉన్న క్రైస్తవుల సంఖ్యకంటే శ్రమల తర్వాత క్రైస్తవుల సంఖ్య రెట్టింపు అయినట్లు చరిత్ర చెబుతోంది. ఐగుప్తులో కూడా ఇలాంటిదే జరిగింది. ఇశ్రాయేలీయుల అభివృద్ధి ఐగుప్తురాజునే ఆశ్చర్యపరిచింది (నిర్గ1:9).

శ్రమల ద్వారా సౌందర్యం :

యోబు గ్రంధం చివరి అధ్యాయం 15వ వచనంలో 'యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు ఆ దేశంలో ఎక్కడా కనబడలేదు'. అని పరిశుద్ధాత్ముడు తెలియ పరుస్తున్నాడు. ఇదేదో బ్యూటిక్వీన్స్‌ ఎంపిక లాంటిదని భావించకండి. ఇది పరిశుద్ధుని ఎంపిక. ఈ ఎంపికలో యోబు కుమార్తెలే గెలిచారు. అది దేవుని ఉచితమైన కృప. ఎందుకంటే యోబు మహాశ్రమలు అనే కొలిమి నుండి వచ్చిన వ్యక్తి. పాత నిబంధన కాలపు భక్తులలో యోబు పొందినన్ని శ్రమలు మరెవరూ పొందలేదు. అలాంటి శ్రమానుభవం ద్వారా వచ్చిన వ్యక్తికి జన్మించిన కుమార్తెలే ఈ సౌందర్యరాశులు. యోబు పొందిన శ్రమలే ఇందుకు తార్కాణం.

నాటి నవాబులను నేటి దొరబాబులను ఆకర్షించి వారి వస్త్రాలపై అలంకారంగా నిలిచే గులాబి పువ్వు కూడా ఒక ముళ్ళ చెట్టు నుండి వస్తుందని తెలుసుకదా ! గులాబికి ఎంత సౌందర్యాన్ని దేవుడు ప్రసాదించాడో శ్రమలు పొందిన విశ్వాసికి కూడా అంతే. గులాబి పువ్వుకు గడ్డి పువ్వుకు ఎంత తేడా ఉందో, శ్రమలు స్వీకరించిన వారికి, శ్రమలు తృణీకరించిన వారికి అంతే తేడా ఉంది. యెమిమ, కెజియ, కెరెంహప్పకు అను ఈ యోబు ముగ్గురు కుమార్తెలు పరలోక తండ్రి సౌందర్యమునే కాక, తమ తండ్రి స్వాస్థ్యమును కూడా పొందారు. (సామె 30:31)

శ్రమల ద్వారా మేలు

119వ కీర్తన 71వ వచనంలో 'నేను నీ కట్టడలను నేర్చుకొనునట్లు శ్రమనొంది యుండుట నాకు మేలాయేను' అని కీర్తనాకారుడు గానం చేశాడు. శ్రమ కలగక మునుపు, కలిగిన తర్వాత అనే రెండు అనుభవాలను ఈ కీర్తనలో మనం గమనించగలం. శ్రమలకు పూర్వం నేను త్రోవ విడచితిని అన్నాడు (కీర్తన119:67). ప్రస్తుతం అనగా శ్రమ కలిగిన తరువాత నాకు మేలు జరిగింది, కట్టడలు నేర్చుకొన్నాను అంటున్నాడు. నేటి క్రైస్తవ విశ్వాసులు శ్రమలలో మేలు వున్నదని గ్రహించాలి. శ్రమలలో దాగిన మేలులేమిటో మరియ, మార్తలకు బాగా తెలుసు. లాజరు ద్వారా వచ్చిన శ్రమలో వారికి మేలే జరిగింది. యోబు భక్తుడు చెప్పినట్లు దేవుడు మన శ్రమలు తూచి ఇస్తాడు (యోబు 6:2); దేవుడు మన శ్రమలను నియమిస్తాడు (యోబు 7:51). ఆయన ప్రమేయం లేకుండా ఏదీ సంభవించదు. శ్రమలే మన పరిశ్రమలు అన్నారెవరో ! యోహోవా చేత శిక్షపొందినవాడు ధన్యుడు (కీర్తన 94). వీటినే మనం 'తండ్రిచేసే గాయాలు' అని పిలుస్తూంటాము. తండ్రి తన కుమారునికి మంచి జరగాలనే శిక్ష విధిస్తాడు గాని మరణించాలని కాదు.

శ్రమల ద్వారా ఓర్పు

అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన లేఖ 5 అధ్యాయము, 3,4 వచనాల్లో శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగ జేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము (లేక శ్రమల యందు ఆనందింతుము) అని ఉద్భోధించాడు. కొంతమంది విశ్వాసులకు ఓర్పు ఉండదు. ఎవరి మీదంటే వారి మీద నిష్కారణంగా విరుచుకుపడుతుంటారు. బిపి ఎక్కువ చేసుకొంటారు. అలాంటి వారికి ఓర్పు శ్రమల ద్వారా కలుగుతుంది. ఓర్పు కలగడానికి శ్రమ అనే మాత్రను మింగాలి. అది జబ్బును నయం చేస్తుంది.

శ్రమల ద్వారా విధేయత

హెబ్రి పత్రిక రచయిత తన గ్రంధం 5వ అధ్యాయం 8వ వచనంలో 'ఆయన (ఏసు) కుమారుడై యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను' అని వ్రాశాడు. యేసు క్రీస్తు శ్రమల ద్వారా విధేయత నేర్చుకొంటే మరి మన మాటేమిటి? ఎంతవరకు విధేయత చూపాడో పౌలు భక్తుడు తెలిపాడు. సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేత పరలోకమందున్న వారిలోను, భూమి మీద ఉన్న వారిలోను, భూమి క్రింద ఉన్న వారిలోను ప్రతినాలుక మోకాలు యేసు నామమున వంగునట్లుగా దేవుడు ఆయనను అధికముగా హెచ్చించెను. ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించాలి. అదేమిటంటే శ్రమ ద్వారా విధేయత, విధేయత ద్వారా ఉన్నత స్థితి లభిస్తుంది.

విధేయత ద్వారా యేసు మూడు లోకాలలో హెచ్చింపబడ్డాడు. యేసుకన్నా గొప్ప వాడు మరొకరు లేరు. ఎందుకంటే యేసే శ్రమను సంపూర్ణంగా భరించినవాడు. మనం కూడా క్రీస్తు వలే శ్రమల ద్వారా విధేయత నేర్చుకోవాలి.

శ్రమల ద్వారా కుమారత్వం

'కుమారులయిన వారంతా శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు దుర్బీజులే గాని కుమారులు కారు' అంటూ హెచ్చరించాడు హెబ్రి గ్రంథకర్త (12:8). కుమారులు - దుర్బీజులు అనే రెండు పదాలను మనం ఈ వచనంలో గమనిస్తున్నాము. దేవుని కుమారులుగా మనం ఎప్పుడు చేయబడ్డామో గుర్తుందా? యోహాను 1:12లో రాయబడినట్లు ఆయనను మనం అంగీకరించినపుడు కుమారత్వం మనకు లభించింది. దేవునికి స్తోత్రములు. 'అంగీకారంలో ఆశీర్వాదం' లభించింది. ఆయన కుమారులముగా శ్రమలో పాలు పొందాలి. పొందని వారు కుమారులు కారు, దుర్బీజులు (అనగా అక
శ్రమలు