వాక్యసందేశముPost Date:2014-02-21//No:39

దేవుని పోలికLikeness of God

నేటి దినములలో లోకం ఎంతో భిన్నమైన కోణంలో ప్రయాణించుచున్నది. అన్యులు కొన్ని చక్కటి నియమాలను నిర్ణయించుకొని వాటిననుసరించి ఎంతో భయభక్తులతో బ్రతుకుతున్నారు. వారికి సరియైన గమ్యం లేక పోయినను వారు జీవించుచున్న క్రమమైన జీవితమును చూస్తూ ఉంటే ముచ్చటగా ఉంటుంది. కాని అన్ని తెలిసిన క్రైస్తవులు జీవించుచున్న జీవితాన్ని చూస్తే దుఃఖం తప్ప సంతోషం కలగటం లేదు. ఎందువలన ఇంత దయనీయమైన స్థితి, అంటే మనలో క్రీస్తు 'పోలిక' లేదు. అవును నేడు ప్రతీవారు గ్రహించవలసిన సత్యం ఏమిటంటే నేను 'దేవుని పోలికలో ఉన్నానా?' అనునది. ఈ పరీక్ష ఎంతో అవసరం. దీనిని గూర్చిన కొన్ని పద్ధతులను ధ్యానం చేద్దాం.

1. పరిమళవాసనగా ఉండుడి దేవుని పోలికలోనికి మనం రావాలంటే మన జీవితం పరిమళవాసనగా ఉండాలి. పరిమళవాసన అంటే చక్కటి సాక్ష్యముగల జీవితం అని అర్ధం. నేటి క్రైస్తవ్యం దుర్గంధముతో నిండి ఉంది. సువాసన లేదుగాని దుర్వాసన అధికమైనది. ఈ దుర్వాసన మనలను ఇతరులు అసహ్యించుకునేలా చేస్తూ ఉంది. క్రైస్తవ్యానికి విలువ లేకుండా పోవుటకు కారణం సాక్ష్యము లేని జీవితములు. మంచిని గూర్చి చెప్పేవారు అధికమయ్యారు కాని చెప్పినట్లు జీవించేవారు లేరు. దుర్వాసనను పోగొట్టుకోవడమే సాక్ష్యము. అలాగే కడగబడిన మనకు దేవుని ఆత్మశక్తితో సువాసనను పొందిన వారమైన మనము దానిని కోల్పోకుండా కాపాడుకోవాలి. బంధువుల యెదుట స్నేహితుల యెదుట సంఘములోను సమాజములోను పరిమళవాసనగా ఉండి దేవుని మహిమపర్చుడి.

2. ప్రేమగలిగి నడుచుకొనుడి : దేవుని పోలికలో ఉన్న మరో లక్షణం ప్రేమ. ఎదుటివారికి ప్రేమను గూర్చి హెచ్చరిస్తున్నాం గాని మన వరకు వచ్చేసరికి ఆ ప్రేమను అనుసరించే వారముగా ఉండలేకపోతున్నాము. ప్రేమ గురించి చెప్పడం సులువు, చేసి చూపడం కష్టం. అందుకే అందరూ ఈ విషయములో దోషులే. ప్రేమ అనేసరికి అనేక ఊహలు మన మదిలోనికి వస్తాయి. అబ్బాయిలు - అమ్మాయిలను ప్రేమిస్తారు అలాగే అమ్మాయిలు - అబ్బాయిలను ప్రేమిస్తుంటారు. తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమిస్తుంటారు. పిల్లలు తల్లిదండ్రులను ప్రేమిస్తారు. భార్య తన భర్తను ప్రేమిస్తుంది అలాగే భర్త తన భార్యను ప్రేమిస్తాడు. క్రైస్తవుడు కలిగి ఉండవలసిన ప్రేమ ఇదికాదు. లోక ప్రేమ కొందరినే ప్రేమించును గాని దైవప్రేమ అందరిని ప్రేమించును.

3. జారత్వము ఉండకూడదు : జారత్వము అనగా వ్యభిచారము, పరాయివారితో సంబంధం కలిగి యుండుటయే వ్యభిచారము ఏ జారత్వము నుండి రక్షింపబడి బయట బడ్డామో అదే జారత్వములోనికి మళ్ళి వెళ్లడం బహుఘోరం. నేటి క్రైస్తవ సమాజములలో వ్యభిచారులు అధికమై పోయారు. ఒకనాడు చుట్ట త్రాగనివాడు నేడు త్రాగుచున్నాడు, సినిమాలు చూడనివారు నేడు సినిమాలు చూస్తున్నారు. వస్తువులు తీసేసినవారు తిరిగి ధరిస్తున్నారు? విగ్రహాలను విడచినవారు తిరిగి విగ్రహారాధన చేస్తున్నారు, లోకము నుండి వేరై ప్రభువును సమీపించిన వారు లోకముతో సాంగత్యము చేయుచున్నారు. వీరందరు వ్యభిచారులు కాదా? ఇజ్రాయేలీయులు చరిత్ర హీనులగుటకు వారి జారత్వమే కారణము. ఎప్పుడైతే వారు అన్యులతో శయనించిరో అప్పుడే దేవుని ప్రసన్నతను కోల్పోయిరి. మన జీవితాలలో కూడా దేవుని తేజస్సును కలిగియుండాలంటే జారత్వమునకు దూరంగా ఉండాలి.

4. అపవిత్రత కలిగి యుండరాదు : దేవుని పోలికలో మనం ఉండవలెనంటే మనలో పవిత్రత ఉండాలి. మన ప్రభువు పరిశుద్ధుడు. ఆయన జీవితములో అపవిత్రతకు అసలు స్థానమే లేదు. మనలో ఉన్న ఆశలు - కోరికలు మన అపవిత్రతకు కారణమగుచున్నవి గ్రహించాలి. పూర్వము అనగా ప్రభువును తెలుసుకొనక ముందు మనము అపవిత్రులమే. అలాంటి మనలను పిలిచిన మన ప్రభువు తన రక్తము ద్వారా మనలను కడిగి ఉచితమైన తన కృప ద్వారా మనలను పవిత్రులనుగా చేసెను. మన పవిత్ర ప్రవర్తన అనేకుల రక్షణకు కారణమగును (1పేతురు 3-1) పవిత్రులు దేవుని ముఖ దర్శనము చేయుదురు (హెబ్రీ:12-14) పవిత్రత, పరిశుద్ధత కలిగియున్నప్పుడే మనం దేవుని బిడ్డలం. అప్పుడే దేవుని రూపం మనలో కనిపించును.

5. లోభత్వము ఉండరాదు : లోభత్వము అనగా ధనాపేక్ష. పది ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా 'నీ పొరుగువాని దేనినైనను ఆశింపకూడదు' (నిర్గమ:20-17) అని ప్రభువు స్పష్టంగా తెలిపాడు. అయినను ఈ లోభత్వము మనలో నివసించుచు మనలో ఉండవలసిన క్రీస్తు రూపమును తొలగించుచున్నది. లోభత్వమునకు లోనైన కయీను శపింపబడుటను మనం చదివాము (ఆది :4-8,14) ధనాపేక్షతో నిండిన యోధుడైన ఆకాను రాళ్లతో కొట్టబడి చనిపోవుట మనము ఎరుగుదుము (యెహో:7-20,21,26) అలాగే ధనమును కోరి నయమానుతో మోసపూరితమైన మాటలు చెప్పి ధనమును కూర్చుకొని ఏలీషాను నమ్మింపజూచిన గేహజీ కుష్టును పొందిన సంగతిని గూర్చివిన్నాం (|| రాజులు:6-21,27). ఇలా మనం ధ్యానిస్తూ పోతే అనేకులు మనకు ఎదురౌతారు. ఈ ధనాపేక్షను గూర్చి వర్ణిస్తూ పౌలు 'సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి' (1తిమోతి :6-10) అని తెలిపాడు. ఇది నిజమని ఒప్పుకోవాలి. లోభత్వము చాలా కుటుంబములను సంఘములను పాడుచేస్తూ ఆధ్యాత్మికమైన ఎదుగుదలకు అవరోధంగా మారుచున్నది. ధనాపేక్ష గలవాడు ఇతరులకు సహాయము చేయలేడు. దేవునికి ఇచ్చు విషయములోను వీరు వెనుకబడి ఉంటారు. మన జీవితాలలో ఎప్పుడు లోభత్వమును విడుస్తామో అప్పుడే దేవుని స్వరూపం కలిగినవారముగా ఉండగలము.

6. కృతజ్ఞతావచనమే ఉచ్ఛరింపవలెను : దేవుని ప్రజల నోటిలో కృతజ్ఞతావచనము ఉండాలి. దీర్ఘ ప్రార్ధనలు చేసేవారు ఉన్నారు గాని దేవుడు చేయు కార్యములకై కృతజ్ఞతలు చెల్లించేవారు బహు అరుదుగా కనిపిస్తుంటారు. 'యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయనకేమి చెల్లించుదును?' (కీర్తనలు :116-12) అని దావీదు ప్రశ్నించుకొన్నట్లు మనలను మనం ప్రశ్నించుకొంటే ఎంతబాగుండేది. దేవుని మేలులను, ఉపకారములను అనుభవించుచున్నాము గాని ఆ ప్రభువు
దేవుని