వాక్యసందేశముPost Date:2014-02-15//No:38

దేవుడు మానవునికి ఇచ్చిన మహిమ ఎట్టిది?   1. మహిమ శరీరము GLORIOUS BODY : దేవుడు మానవునికి ఇవ్వబోతున్న మహిమలో మొదటిది మహిమ శరీరము. శరీరములో ఉన్నంత కాలము బాధలు తప్పవు అనేమాట పలువురు పలుకుట వింటూ వుంటాము. అవును ఈ శరీరము బాధలకు, వేదనలకు నిలయము, ఈ శరీరమందు మంచిది ఏదీ లేదని వ్రాయబడినది రోమా 7:18.

మట్టికి మట్టి, ధూళికి ధూళి కావలసిందే ఈ శరీరం అయితే ఇట్టి దీన శరీరాన్ని క్రీస్తు ప్రభువు వారు లేక దేవుడు తన మహిమగల శరీరమునకు సమరూపముగల దానిగా మార్చునని వ్రాయబడియున్నది ఫిలిప్పి 3:20-21. ఇదే క్రీస్తునందు విశ్వాసులు పొందబోవుచున్న మహిమలోని మొదటి భాగము. ఈ మహిమ శరీరాలకు ఏ-జబ్బులు, జాఢ్యాలు అంటవు. ఈ మహిమ శరీరం ఇక ఎన్నటి చావదు. అది అమరత్వాన్ని సంతరించుకున్న శరీరము వీరికి జరామరణాలు లేవు. అంటే మళ్ళీ పుట్టవలసిన పనిగాని, మళ్ళీ చావలసిన పనిగాని ఈ మహిమ దేహాలు పొందినవారికి లేదు.

2. మహిమగల పట్టణము GLORIOUS CITY  : క్రీస్తునందు మానవుడు పొందబోవు మహిమ యొక్క రెండవ భాగమేదనగా పరలోకపట్టణము లేక నవలోక నగరము 'నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదుగాని ఉండబోవుచున్నదాని కోసము ఎదురు చూచుచున్నామని' ఈ పట్టణాన్ని గూర్చే పౌలు భక్తుడు వ్రాశాడు - హెబ్రీ 13:14. ఆ పరలోక పట్టణము మానవ నిర్మితమైనది కాదని దేవుడే దానికి శిల్పి. నిర్మాణకుడని వ్రాయబడినది. హెబ్రీ 11:10. ఆ పట్టణపు పునాదులు నానావిధరత్నములతో అలంకరింపబడి యుండెనని భక్తుడైన యోహాను దర్శనంలో చూచి వ్రాశాడు. 'ఆ పట్టణము దేవుని మహిమగలదై పరలోకం నుండి దిగివస్తున్నట్లు' కూడా యోహాను దర్శనంలో చూశాడు. ప్రక 21:10-11. అయితే ఈ మహిమలోకం లేక ఈ మహిమగల పట్టణం దేవదూతల కోసమో, ఇరువది నలుగురు పెద్దలకోసమో, నాలుగు జీవులకోసమో, మహాదూతలనబడిన సెరాపుల కోసమో కాదట. 'ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదని' వ్రాయబడినది హెబ్రి 2:5, మరి-ఆ-లోకం ఎవరికోసం? ఇదిగో దేవుడు చెబుతున్న మాట జాగ్రత్తగా వినండి. ఆయన వారికోసం అనగా అబ్రహాము కొరకు లేక క్రీస్తు ద్వారా అబ్రహాము సంతానమని ఎంచబడిన విశ్వాసుల కొరకు ఆ పట్టణాన్ని సిద్ధపరచాడని అర్ధం. ఇప్పుడు చదవండి. ఆయన వారికొరకు ఒక పట్టణము సిద్ధపరచియున్నాడు. ఇది ఆ మహిమగల పరలోక పట్టణమే.

3. మహిమ గల సింహాసనము GLORIOUS THRONE : ఈ లోక సింహాసనములేవీ దేవుడిచ్చే సింహాసనానికి సాటికావు. ఈ లోక సింహాసనాలు పడద్రోయబడునని లేఖనము తెలుపుచున్నది - యెహె 21:26-27. అయితే దేవుని సింహాసనం నిరంతరం నిలుచునని వ్రాయబడినది లూకా 1:32. 1దిన 17:12 పూర్వం సొలోమోను సింహాసనం చాలా గొప్పదిగా నుండెనని, ఏ రాజ్యమందైనా అటువంటి పనితనముగల సింహాసనము లేదని వ్రాయబడినది 2 దిన 9:17-19. అయితే యేసు సొలోమోనుకంటే గొప్పవాడని వ్రాయబడినది. మత్త 12:42 మరి సొలోమోనుకంటే గొప్పవాడైన యేసు ప్రభువు యొక్క సింహాసనం సొలోమోను సింహాసనం కంటే గొప్పదే సుమా!

అసలు ఏ రాజు కూడా తన సింహాసనం మీద ఎవరినీ కూర్చోబెట్టడు సుమా! కూర్చోబెడితే తన ప్రక్కన ఏదో ఒక ఆసనం వేసి దానిమీద కూర్చోబెడతాడు. ఒకప్పుడు ఫరో అనే రాజు యోసేపు అనే వ్యక్తిని ఎంతో ప్రేమించాడు. యోసేపును ఎంతో హెచ్చించి, సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై యుందును అని యోసేపుతో చెప్పాడు. ఆది. 41:40, తన సింహాసనాన్ని మాత్రం యోసేపుకు ఇవ్వలేదు. అసలు ఆ సింహాసనం మీద ఎన్నడూ కూర్చోబెట్టలేదు. అయితే యేసురాజు అంటున్న మాట ఎప్పుడైనా విన్నావా సోదరా! ఇదిగో విను! 'జయించు వానిని నాతో కూడా నా సింహాసనము మీద కూర్చుండనిత్తును' అన్నాడు - యేసు ప్రక 3:21, ఇక ప్రేమకు ఇంతకంటే పరాకాష్ట వుంటుందా? ఇక పోతే యేసుక్రీస్తు నందున్నవారు పొందబోయేది మామూలు సింహాసనం కాదు. అది మహిమ గల సింహాసనం అంచేతనే హన్నా అనే భక్తురాలు ఆత్మతో నిండుకొని ఇలా పాడింది 1 సమూ 2:8 మట్టిలో దొర్లాడుచున్న మానవుడా నీకు మహిమను సిద్ధపరచినవాడు దేవుడు కాదా? తన సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టడానికి సంకల్పించినవాడు నీ తండ్రి కాడా? ఆలోచించుము! నీ తండ్రి ప్రేమను తెలుసుకో! ఆ తండ్రి సిద్ధపరచిన మహిమ సింహాసనాన్ని స్వతంత్రించుకో! ఇది క్రీస్తు నందు మానవునికి నియమించబడిన మహిమ యొక్క మూడవ భాగము.

4. మహిమ కిరీటము CROWN OF GLORY  : రెండవ ఎలిజబెత్‌ మహారాణి ధరించిన కిరీటంలో 2,783 వజ్రాలు, 277 ముత్యాలు, 12 ఇంద్రనీలాలు, 11 మరకతములు, 5 మాణాక్యాలు ఉండేవట. పూర్వం దావీదు మహారాజు ధరించిన కిరీటము రెండు మణుగుల బంగారముతో చేయబడినదని ఆ కిరీటంలో రత్నాలు చెక్కబడి ఉండేవని లేఖనం తెలుపుతోంది దిన 20:2 ఈ కిరీటాల కోసం ఎన్నో యుద్ధాలు జరిగాయి. ప్రస్తుతం ఈ కిరీటాలు మ్యూజియంలలో భద్రపర్చబడివున్నవి. గొప్పగా చెప్పుకోవడానికే గాని ఇప్పుడు వాటిని ఎవ్వరూ తలమీద ధరించటానికి వీలులేదు. చెప్పుకుని మురవ చూసుకొని ఏడ్వ అన్నట్టు ఉంది. ఈ కిరీటాల సంగతి కొందరి సేరు కిరీటి అని ఉంటుంది. కాని బ్రతుకంతా దరిద్రమే ఉంటుంది.

ఇట్లుండగా యేసు సిలువలో మృత్యువుతో పోరాడి, సమాధిని సాతానును-గెలచి ఒక కిరీటం సంపాదించాడు. అది ఎలిజబెత్‌ మహారాణి తలపైన ధరించిన కిరీటం కంటే గొప్పది. కారణమేమంటే అది మహిమా ప్రభావములు గల కిరీటమని లేఖనము తెలుపుచున్నది హెబ్రీ 2:9 ఆయన రెండవ రాకడలో ఈ మహిమ కిరీటం మనిషికి లేక తనయందు విశ్వాసముంచిన వారికి ఆ ప్రభువు ఇస్తాడని తెలియుచున్నది 1 పేతురు 5:4. మహిమ కిరీటము అనేది మానవునికి దేవుడిచ్చే మహిమలో నాల్గవదియైయున్నది.

5. మహిమ నుండి అధిక మహిమ : ఆ యేసు క్రీస్తు ప్రభువు ద్వారా సంక్రమించే మహిమ ఇంతేనా ఇంకా ఏమయినా ఉందా అంటే-ఇంకా ఎంతో ఉందని చెప్పక తప్పదు. దేవుడిచ్చే మహిమ ఇంకా ఎంతో ఉందని తెలుసుగాని అదంతా వ్రాయటానికి మానవజ్ఞానము సరిపోదు. అది వివరించటానికి జ్ఞానము సరిపోదు. అది మానవ భాషకు, భావానికి అందనంత అనంతమైనది. ఇప్పుడు అద్దంలో నుండి చూచినట్లు వాక్యమనే అద్దంలో నుంచి ఈ మహిమను నేను చూచి మీకు కొంతవరకు వ్రాతమూలమున తెలుపగలిగాను. కానీ నేను తెలిపింది చా
దేవుడు