వాక్యసందేశముPost Date:2013-10-13//No:32

సజీవుని బావి''నీ హృదయములో నుండి జీవ ధారలు బయలు దేరును కాబటి అన్నిటి కంటె ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము''. సామెతలు 4:23. 
మారు మనస్సు పొందిన హృదయం నుండి లేక క్రీస్తు రక్తంలో కడుగబడిన హృదయం నుండి జీవధారలు బయలు దేరును. అటువంటి హృదయం విషయమై శ్రద్ధ తీసుకొనకపోతే జీవధారలు ఆగి పోయే ప్రమాదం ఉంది. కాబటి నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకొనాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది.
 బైబిల నందు నాలుగు రకాల బావులను చూస్తున్నాము. బావులు హృదయానికి సాదృశ్యంగా ఉంటున్నాయి. నీ హృదయ పరిస్థితిని గురించి తెలియ చేస్తున్నాయి.

 మొదటి బావి : నీళ్ళు లేని బావులు : ''వీరు నీళ్ళు లేని బావులను పెనుగాలికి కొటుకొను పోవు మేఘములునై యున్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది'' 11 పేతురు 2:17
నీళ్ళుని బావులు. నామకార్ధ క్రైస్తవులకి సాదృశ్యముగా ఉంటున్నాయి బావులే కాని నీళ్ళులేవు. క్రైస్తవులే కాని క్రీస్తు లేని వారు - నామకార్ధ క్రైస్తవులు. నీళ్ళు లేని బావుల వలన ప్రజలకు ఉపయోగము ఉండదు. అలాగే నామకార్ధ క్రైస్తవుల వలన సమాజమునకు ఉపయోగము ఉండదు. క్రైస్తవులమని చెప్పుకుంటారు. అటువంటి వారికి గాఢాంద కారం అంటే రెండవ మరణం లేక నరకం భద్రం చేయబడి ఉంది. బిలాము ప్రవక్త దేవుని మాట వినకుండా, ఇశ్రాయేలీయులకు శత్రువైన బాలాకు మాట వింటున్నాడు. ఇశ్రాయేలీయులను, అంటే యెహోవా దేవుడు ఏర్పరచుకున్న జనాంగంను శపించబడుటకు వెళ్తున్నాడు. బిలాము ఒక ప్రవక్త, అంటే దేవుని స్వరం వినె మెటు కలవాడు. అయితే దేవుని మాటలకు తన హృదయంలో స్థానం లేదు. బాలాకు చూపించే లోకసంబంధమైన బహుమతిని ఆశించి తనకున్న తలాంతులను, కృపావరాలను శత్రువుల కొరకు ఉపయోగిస్తున్నాడు. నీళ్ళులేని బావి వలె ఉన్నాడు.

 రెండవ బావి : పూడ్చివేయబడిన బావులు : ''అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటిని పిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి''. ఆది కాం 26:15.
 
పూడ్చివేయబడిన బావులు - రక్షించబడి పడిపోయిన విశ్వాసులకు సాదృశ్యంగా ఉంటున్నాయి. అబ్రహాము తండ్రి దాసులు త్రవ్వించిన బావులు కొంతకాలం అనేక మందికి దప్పికను తీర్చినవి. ఆ బావులలోని నీరు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి. కొంతకాలం తర్వాత ఫిలిష్తీయులు అంటే ఇశ్రాయేలీయులకు శత్రువులు మన్ను పోసి పూడ్చి వేశారు. నీవు రక్షించబడిన తర్వాత నీ సాక్ష్యం, నీ ప్రార్ధన జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి. నీవు ప్రకటించిన సువార్తను విని క్రీస్తును అనేకులు రక్షకునిగా అంగీకరించారు. నీవు ప్రార్ధించినప్పుడు అనేక స్వస్థతలు జరిగినవి అపవిత్రాత్మలు వదలి పోయాయి. అయితే కొంతకాలం మాత్రమే. తర్వాత నీవు విశ్వాసంలో జారి పోయావు. శత్రువైన అపవాది నీ హృదయాన్ని అవిధేయత, అవిశ్వాసం అనె మన్ను పోసి పూడ్చి వేశాడు.
 ''అప్పుడు తన తండ్రియైన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ళ బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను''. ఆ.కా 26:18.
 శత్రువులు పూడ్చి వేసిన బావులను ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. దేవుని నామమునకు మహిమ కల్గును గాక ! నీ విశ్వాస జీవితంలో పడిపోయిన స్థితిలో లేక పూడ్చివేయబడిన స్థితిలో ఉంటె మరొక అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. మరల నీ హృదయాన్ని త్రవ్వుకొనె అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబటి నీవు నశించి పోవుట ఆయనకు ఇషం లేదు.

సజీవుని
మూడవ బావి : మూతవేయబడిన బావులు :
''అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు మూడు పండుకొని యుండెను. కాపరులు మందలకు ఆ బావి నీళ్ళు పెటుదురు. ఒక పెద్దరాయి ఆ బావి మీది మూత వేసి ఉండెను''.
 ఆ.కా.29:2. 

 మూత వేయబడిన బావులు - రక్షించబడి సాక్ష్యము చెప్పలేని వారికి సాదృశ్యముగా ఉన్నాయి. ఈ బావిలో నీరు ఉన్నది. అయితే ఆ బావి పై పెద్ద బండ మూత వేయబడి ఉన్నది. ఆ బావి చుటూ మూడు మందల గొర్రెలు ఆ బావిలోని నీరు త్రాగాలని క్బర్చుండి ఉన్నాము. నీ హృదయంలో దేవుని ప్రేమ ఉన్నది. యేసుక్రీస్తు అందరికి ప్రభువని నీకు తెల్సు, క్రీస్తు రక్తం ద్వారానే పాపికి విమోచన అని, ఒకడు క్రొత్తగ జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడనే సువార్త నీకు తెల్సు. నీ చుటు అనేక మంది ప్రజలు నీ హృదయములోని జీవము కలిగిన మాటలు వినాలని ఆశతో ఎదురు చూచుచున్నారు. అయితే నీవు మాత్రము నోరు తేరచి ఒక్కరికికుడా సువార్తచెప్పవు. నశించుచున్న వారికి కొరకు ప్రార్ధించవు. నీవు రక్షించబడి, రక్షణ లేని ఇతరుల కొరకు భారం లేకపోవుట. మూతవేయబడిన హృదయ స్థితిని తెలియ చేస్తుంది. అయితే ఆ బావి మీదనుండి రాతిని పొర్లించి గొఱ్ఱెలకు నీరు పెటుదురు. (ఆది 29:3) రాయి తొలగించినపుడు ఆ బావిలోని నీరు ఆశీర్వాదకరముగా ఉన్నాయి. రక్షణ పొందిన నీవు సాక్ష్యమును చెప్పాలి, సువార్తను ప్రకటించాలి. అప్పుడే నీవు ఆశీర్వదించబడతావు. దేవుని నామమునకు మహిమ కల్గును గాక!

 నాల్గవ బావి : సజీవుని బావి : ''అనీటి బుగ్గకు బెయెర్‌ లహోయిరోయి అను పేరు పెటబడెను''. ఆ.కా.16:14
బెయెర్‌ లహయిరోయి అను మాటకు నన్ను చూచుచున్న సజీవుని బావి అని అర్ధము. సజీవుని బావి - రక్షించబడి నశించుచున్న ఆత్మల కొరకు ప్రయాస పడువారికి సాదృశ్యముగా ఉంటున్నాయి. హాగరుతో యెహోవా దేవుడు మాట్లాడి ఆశీర్వదించిన స్థలం. దేవుడు హాగరును ఆమె కుమారుని దర్శించిన స్థలం. ఆ నీటి బుగ్గ వారి దప్పికను తీర్చింది. మరణం నుండి రక్షించినది. సజీవుని బావి వలె నీవు ఉండాలని దేవుడు కోరుచున్నాడు. నిన్ను చూచుచున్న దేవునికి భయపడాలి, అంటే నీవు పొందుకున్న ఆ జీవజలమైన రక్షణ సువార్తను ఇతరులకు అందించాలి. క్రీస్తు యొద్దకు నడిపించాలి. సమరయి స్త్రీ రక్షించబడిన తర్వాత యేసును గురించిన సువార్తను సుఖారియా గ్రామములో నున్న వారందరికి ప్రకటించినది. క్రీస్తు యొద్దకు నడిపించినది. తాను పొందుకున్న జీవ జలాన్ని ఇతరులకు ప్రవహింప చేసింది. సజీవుని బావి. నీవు సజీవుని బావి వలె ఉండాలని దేవుడు కోరుచున్నాడు. దేవుని నామమునకు మహిమ కల్లును గాక  !

 - బ్రదర్‌ వర్ధనపు ప్రేమ్‌ కుమార్‌