వాక్యసందేశముPost Date:2015-08-14//No:123

నిజమైన స్వాతంత్య్రముప్రతి ఆగష్టు 15న మనదేశం స్వాతంత్య్ర దినోత్సవమును జరుపుకుంటుంది. మన దేశానికి స్వాతంత్య్రము వచ్చి చాలా సంవత్సరములు అయ్యింది. రాజకీయ స్వేచ్ఛ వచ్చి మన దేశము స్వయం పరిపాలన చేసుకొనుచున్నను సగటు మనిషికి నిజ జీవితములో స్వేచ్ఛలేదు. అపవాది అదృశ్య శక్తులు, మూఢ నమ్మకాలు, దుర్నీతి, అవినీతి, లంచగొండితనము మొదలగు దుష్ట ప్రభావ ములకు లోనయి మన దేశములో మనుష్యులు స్వేచ్ఛగాను, నిర్భయముగాను జీవించలేక పోతున్నారు. చివరకు క్రైస్తవులు కూడా ఏదో బంధకాల్లో నలిగిపోతున్నారు. ఆత్మలో స్వేచ్ఛ లేక నశించిపోతున్నారు.దేవుని వాక్యము యోహాను 8:31,32 లో ఇలా చెపుతుంది. కాబ్టి యేసు, తనను నమ్మిన యూదులతో- మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా... కొంతమంది యూదులు యేసును నమ్మినప్పికి వారింకా స్వతంత్రులు కాలేదని ప్రభువే చెప్పాడు. కొందరు ఈనాడు ప్రభువును నమ్ముకొన్నామని చెప్పుకొని ఇంకను బంధకాల్లో నుండి స్వతంత్రులు అయ్యామని భ్రమపడుతూ ఉంారు.సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయునని యేసు చెప్పినప్పుడు వారు మేము ఎన్నడు ఎవరికిని దాసులమై యుండలేదే అని ప్రభువు మాటను వ్యతిరేకించారు. (33వ) నిజానికి యూదులు రెండుసార్లు అన్యుల దేశములో దాసులుగా యుండిరి. ఈజిప్టు దేశములో నాలుగువందల ఏండ్లు (నిర్గమ కా.15:13,14) బబులోను దేశములో డెబ్బది యేండ్లు (యిర్మియా 25:11,12) బబులోను నుండి తమ స్వదేశమునకు వచ్చిన తర్వాత కూడా వారు దాస్యములోవున్నట్లు నెహెమ్యా కాలములోని ప్రజలు గ్రహించారు.(9:36) యేసు ఉన్న కాలములో కూడా యూదులు రోమీయుల పరిపాలనలో ఉన్నారు. వాస్తవానికి ఇక్కడ ప్రభువు మ్లాడుచున్న స్వాతంత్య్రము ఆత్మ సంబంధమైనది. వారు అబ్రహాము సంతానమని అతిశయిస్తున్నారే గాని అబ్రహాము ఆశీర్వాదములను అనుభవించ లేకపోతున్నారు. ఈ రోజుల్లో కూడా క్రైస్తవ కుటుంబాల్లో క్రీస్తు రక్షణను అనుభవించని ఎన్నో లక్షల మంది వున్నారు. ప్రతి మనిషి కనీసము మూడింకి దాసునిగా ఉంటున్నాడు.
1.దేవుడు కాని వారికి : నిజదేవుని ఎరుగని వారు దేవుళ్ళుకాని వారికి దాసులై యుండే క్లోాది ప్రజలను మన దేశములో చూస్తున్నాము. (గలతీ 4:8) దీనినే సైతానుకు దాసులు అని కూడా చెప్పవచ్చును.
2.పాపమునకు : పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని ప్రభువే హెచ్చరించాడు. (యోహాను 8:34) ఏ భేదమును లేదు అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారను వాక్యమును బ్టి క్రీస్తును ఎరుగక ముందు ప్రతి మనిషి పాపమునకు దాసుడే (రోమా 3:23, 6:17). 
3.ధర్మశాస్త్రమునకు : ఆనాి యూదులు క్రీస్తు ప్రభువును అంగీకరించక ధర్మశాస్త్రానికి లోనయినట్లు ఈనాడు క్రైస్తవులు కొన్ని ఆచారములకు, మూఢ నమ్మకాలకు, కర్మకాండలకు, స్వనీతికి లోనయి దాస్యములో నున్నారు. ఇటువిం దాస్యము నుండి మనుష్యుని విడిపించుటకు మూడు విధానములు కలవని దేవుని వాక్యము సెలవిస్తుంది.
1.సత్యము : మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును.(యోహాను 8:31,32) సత్యమును గ్రహించాలంటే ఆయన వాక్యమును విని, గ్రహించి, ఆ వాక్యమందు నిలిచి యుండాలి (లోబడాలి). మనము ఎంత ఎక్కువగా వాక్యమును గ్రహిస్తామో అంత ఎక్కువగా సత్యమును గ్రహించి అంతగా స్వతంత్రులమౌతాము. వాక్యమన్నా, సత్యమన్నా యేసు ప్రభువే అని ఎరుగుదుము. (యోహాను:1:1, 14:6, 17:17) కాబ్టి ప్రభువే మనలను స్వతంత్రులుగా చేయువాడు.
2.కుమారుడు : కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులైయుందురు.(యోహాను 8:36) దేవుని కుమారుడు చెరలో నున్నవారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని కలుగజేయుటకు వచ్చెనని వ్రాయబడిన వాక్యము నెరవేర్పు మూడున్నర ఏండ్ల యేసు సేవ, ఈ రెండువేల సంవత్సరకాలములో క్లోాది మంది జీవితాలే సాక్ష్యం (లూకా 4:18) ప్రభువే కుమారుడు.
3.ఆత్మ : ప్రభువే ఆత్మ. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్య్రము ఉండును (2 కొరింధీ 3:17) పరిశుద్ధాత్మ భూమి మీదికి పంపబడిన దినము మొదలుకొని ఎంతోమంది పాపమును గురించి ఒప్పింపబడి, క్రీస్తు రక్తము చేత కడుగబడి, నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ఇది ఆత్మ పనియే. ప్రభువే ఆత్మ.
సత్యము (వాక్యము), కుమారుడు, ఆత్మ అనగా యేసుక్రీస్తు ప్రభువే అని వాక్య సారాంశమును బ్టి గ్రహించుచున్నాము. కాబ్టి ప్రభువు ఒక్కడే మనలను అన్ని విధములైన బంధకాల నుండి దాస్యము నుండి విడిపించి స్వతంత్రులుగా చేయ సమర్ధుడు. దేవునికి స్తోత్రము (రోమా 6:18).
హెచ్చరిక : మనము స్వతంత్రులుగా ఉండుటకే పిలువబడితిమి అని తెలియజేస్తూ ఆ స్వాతంత్య్రమును తిరిగి క్రియలకు వాడుకొనక ఈ స్వాతంత్య్రమందు స్థిరముగా నిలిచియుండి మరల దుష్టత్వమను కాడిక్రింద చుట్టుకోవద్దని పౌలు, పేతురు కూడా హెచ్చరిస్తున్నారు. (గలతీ 5:1,13, పేతురు 2:16). మనము తిరిగి సైతానుకు, పాపానికి, స్వనీతికి దాసులము కాకుండా ఉండాలంటే ఏం చేయాలని వాక్యము హెచ్చరిస్తుంది.
1. ఒకప్పుడు దేవుళ్ళు కానివారికి దాసులైనవారు ఇప్పుడు నిజదేవునికి అనగా మన ప్రభువైన యేసుక్రీస్తుకు దాసులుగా జీవించాలి.(రోమా 6:22, 1పేతురు 2:16).
2. ఒకప్పుడు పాపానికి దాసులై తమ అవయవ ములను దుర్నీతికి అప్పగించుకున్నవారు ఇప్పుడు నీతికి దాసులై వాిని నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోవాలి (రోమా 6:13, 18:19).
3. ఒకప్పుడు ధర్మశాస్త్రమునకు, స్వనీతికి, మూఢ నమ్మకములకు లోనైనవారు ఇప్పుడు దేవుని నీతిలో నడుచుకొనుచున్న వారిగా ప్రేమ కలిగిన వారై ఒకనికి ఒకడు దాసుడుగా ఉండాలి (గలతీ 5:13).- పాస్టర్‌ యం.రాబర్ట్‌ జేమ్స్‌
నిజమైన