వాక్యసందేశముPost Date:2015-02-13//No:113

భస్మ బుధవారముప్రధాన వాక్యము : యోవేలు 2:12, 13:1, 1 తిమోతి 2:5.

భస్మ బుధవారము (Ash Wednesday) : లెంటులోని మొదటి దినము. 'లెంటు' అనగా, ఈష్టరుకు ముందు 40 దినముల ఉపవాస కాలము, యిది భస్మ బుధవారముతో ప్రారంభమగును. ఇది మన ప్రభుని పవిత్ర సంఘటనయైన 40 దినముల అరణ్యములోని ఉపవాసమునకు జ్ఞాపకార్ధముగా (పరి. మత్తయి 4:2) యీ దినముల కాల పరిమితి తొలుదొలుత ఏర్పడెను.

'లెంటు' అను పదము Anglo-Saxon పదమైన "lencten" అనుపదము నుండి ఉత్పత్తి యగుచున్నది. "lencenten" యను పదము యొక్క ధాతువుకు 'చీల్చు' పగులగొట్టు చిగుర్చుటకు ఆరంభము, 'వసంతకాలము' (Spring) అని వివిధ అర్ధములున్నవి. ఈ లెంటు కాలములో 'ఉపవాసము' ఉండుటయు కద్దు ఉపవాసము యొక్క పూర్వపరములు చూచుట కంటె ముందుగా 'ఉపవాసము' అను పదమును కూడా పరిశీలించి చూతము. ఉపవాసము అనునది ఒక సంస్కృత పదము. యిది రెండు ధాతువుల కలయిక - ఉప+వాసము; ఉప = తగ్గి: వాసము = నివాస స్థలము, అనగా తగ్గి నివసించుట; లేక పస్తు ఉండుట అని అర్ధము.

భస్మ లేక బూడిదె బుధవారమనియు దీనికి పేరు. భస్మము లేక బూడిదె అనునది ఒక అగ్ని నుండి గాని, లేక యజ్ఞములో దహింపబడిన ఒక జంతువు నుండి కాని మిగిలిన అవశేషమును బూడిదె అందురు. విచారము, సంతాపము వ్యక్తపరచు వ్రత దీక్షితుల తలలపై ఆచారయుతముగా యీ బూడిదె లేక భస్మరేణువులు జల్లబడును. (2 సమూ 13:19). బైబిలులో 'గొనెపట్ట కట్టుకొని బూడిదె రాసుకొని' అనునది పశ్చాత్తాప సూచకమై, సాధుత్వమును, అనుతాపమును సూచించును. (యోబు 42:6; యెషయ 58:5). అతి తీవ్రమైన సందర్భములలో యిట్టి పరితప్తుడు బూడిదె పైననే కూర్చొనును. లేక బూడిదెలో పొర్లాడును (యోబు 2:8 యిర్మియా 6:26; దాని 9:3).

బూడిదె అనుపదము 'నిరర్ధకమైన' లేక 'నిరుపయోగమైన' అను భావములు వ్యక్తము చేయుటకును బైబిలులో ప్రయోగించబడెను. ఉదా : 'బూడిద సామెతలు' (యోబు 13:12) బైబిలులో (యిర్మియా 31:40) అనగా ప్రతిదినము దేవాలయములో అర్పింపబడు బలుల అవశేషము ప్రతి సాయంత్రము పట్టణము నుండి బయట పారవేయు బూడిదె గుట్ట.

దీని యాచరణ చరిత్ర : గ్రీకు క్రైస్తవ సంగ క్యాలెండర్‌లోనిది 'ఉపవాసము' (GK : nesteia) అను పేరులోనే ఉదహరించబడినది. 'నెసైయ అను గ్రీకు పదము 'ఉపవాసము' అని అర్ధమిచ్చును. గ్రీకులో యీ పదమునకు యీ దిగువ వివిధార్ధములున్నవి. అనగా, ఉపవాసముండుట, ఆహారమును వర్ణించుట; ఒక మత ఆచారముగా ఉపవాసముండుట; ఆహారమును సకల విధములైన చెడుగును విసర్జించుట, దుఃఖమునకు గుర్తుగా ఉపవాసముండుట (1 సమూ 1:12, 12:22) మొ.వి.

పరి. మత్తయి 6:16-18లో సరియైన ఉపవాసము, సరియైనది కాని ఉపవాసములను గురించి యేసు ప్రభువుచే వివరించబడెను. పరి. లూకా 18:21లో భక్తిగల యూదులు వారమునకు రెండు పర్యాయములు ఉపవాసము లుందురని చెప్పబడినది. (సోమవారము, గురువారము). దిదాఖే 8:1లో క్రైస్తవులు సోమవారము, శుక్రవారములు ఉపవాసముందురని చెప్పబడెను. మరియు యీ పదమునకు లోకమును విసర్జించుట యను అర్ధము కూడా చెప్పబడెను.

లెంటు కాలములో ఉపవాసముండు ఆచారము సనాతన కాలము నుండి ఉన్నట్లు చారిత్య్ర ప్రస్తావన. ఈస్టరు పండుగకు సిద్ధపాటుగా ఉపవాసముండు ఆచారము చాలా సనాతనముగా నున్నట్లు కాననగును. ఎందుకనగా, దీనిని గురించిన ప్రస్తావన (97ADÐ202) మరియు Tertullian (166AD-220 Ad) అనువారలు వ్రాసిన గ్రంధములలోనిది కాననగును. 'ఐరెన్‌యన్‌ రోమా బిషప్పైన విక్టరుకు (189AD-198AD) వ్రాయుచు, యీష్టరు పండుగ ఎప్పుడు ఆచరించవలెను. అను సమస్యకు సంబంధించిన వాదోపవాదములను గురించి వ్రాయుచు అందులోని ఈష్టరుకు ముందు సిద్ధబాటుగా ఆచరించు ఉపవాస కాల పరిమితి యొక్క వాగ్వాదమును గురించి కూడా ప్రస్తావించెను. 'ఎందుకనగా, కొందరు ఒక్క దినము మాత్రమే ఉపవాసముండిన చాలునని యనుచుండిరి. యితరులు రెండు దినములను చుండిరి. తదితరుల యింక అనేక దినములని యనుచుండిరి. మరికొందరు రేయింబవలులు లెక్కించుచు 40 గంటలను చుండిరి. ఈ వ్యత్యాసము తన కాలములో నున్నది మాత్రమే గాక, అది వాస్తవముగ అపోస్తలుల కాలముల నుండియు వచ్చుచున్న భిన్నత్వము' అని వ్రాసెను. (Irenaeus : Ep.ad Vict.apud euseb.Hist.Eccfles.V.24).

ఈ ఉపవాస కాల పరిమితిలో మరెక్కువ బహుముఖత్వము యింకను సాగుచునే యుండును - 'ఈస్టరుకు ముందు మూడు వారముల ఉపవాసము ఆచరించిరి' అని సోజ్‌మన్‌ వ్రాయుచున్నాడు. (Sozomen : Hist Eccl VII. 19).

అంతేగాక, ఆరువారములు ఉపవాసము కూడ ఈస్టరుకు ముందు ఆచరించబడెను. యితరులు దానిని ఏడు వారముల వరకును పొడిగించిరి. కాని వాస్తవముగా మధ్య మధ్య విరామములతో మొత్తము మీద పదిహేను రోజులు మాత్రమే ఉపవాసముండిరి అని సోక్రటీస్‌ వ్రాయుచున్నాడు. (Socragtes : Hist Eccl. V.22).

  Gregory the Great (540 AD-604 AD) - సన్యాసి వ్రతాలంబికులలో నుండి పోపు అయిన వారిలో యితడే మొదటివాడు - యితడు ఈస్టరుకు ముందు ఆచరించబడు 36 దినముల ఉపవాస కాలమును గురించి చెప్పుచున్నాడు. (Hour.in Evang 1:16.5:Vol. 1. 1494, ed Bened). అనగా యిందు వచ్చు ఆదివారములను లెక్కించకుండగనే, ఎట్లయినను యీ 36 దినములు ఉపవాసదినముల గరిష్ట సంఖ్యా పరిమితిగా ఎంచబడెను.

అయితే ఈ మిగిలిన నాలుగు దినములు (అది 40 చేయుటకు) మరి ఎవరి వలన చేర్చబడినవి. అనగా భస్మబుధవారము, దాని తరువాత వచ్చు మూడు దినములు, గ్రెగొరి ది గ్రేట్‌ వీనిని చేర్చెనని తరచుగా చెప్పుదురు. గాని దీనికి తగినంత ఆధారములు లేవు. ఎట్లయినను, ఈ నాలుగు దినములు Charlemagne (Charles the Great 771-814 AD) కు ముందటి కాలములో చేర్చబడి యుండవలెనని ఆరాధనా చరిత్ర పండితాభిప్రాయము ఈ ఉపవాసకాల పరిమితిలో యింత వ్యత్యాసముంటున్నప్పటికిని, ఈ లెంటు కాలము ఎప్పుడును tessara Konta=40=మండలము=40 దినములనియే (మండల కాలముthe period of 40 days) (బ్రౌణ్యము: తెలుగు - ఇంగ్లీషు నిఘంటు p.762) పిలువబడుచుండెను.

 - రెవ.డా||కర్లపూడి దేవ సహాయము
భస్మ