బైబిల్-సైన్సుPost Date:2013-11-24//No:20

భూమి ఆకారము గురించి బైబిల్-సైన్సు లో వైరుద్ద్యం ఉన్నదా""భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను"" ఆదికాండము 1:2
""నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింపలేదు"" యెషయా 45:18
పై రెండు లేఖనాలను పరిశీలించినట్లయితే భూమి యొక్క ఆకారము గురించి రెండు వేర్వేరు విషయాలను వెల్లడించుచున్నట్లు తెలియును. ఆదికాండములో భూమి ఆకారము లేనిదని చెప్పుచుండగా యెషయా గ్రంథమేమో భూమిని ఆకారముతోనే సృజించెననే అర్థమును తెలియజేయుచున్నది. వాస్తవానికి ఈ రెండు లేఖనములు సరియైనవే. అది ఎలాగో తెలుసుకోవాలంటే, అంతకు ముందుగా ఈ భూమి ఎలా ఏర్పడిందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి.
మహా విస్పోటనం ద్వారా భూమి తదితర గ్రహాలు,నక్షత్రాలు, గ్రహ శకలాలు ఏర్పడ్డాయి. మహా విస్పోటనం ద్వారా శూన్యంలోకి విరజిమ్మబడిన విశ్వ పదార్థం యొక్క శకలాలు ఒకదానికి ఒకటి ఢీకొంటూ,ముద్దగా అతుక్కుపోతూ సమీకృతమయ్యాయి. సోదాహరణగా చెప్పాలంటే,చిన్న అయస్కాంతపు ముక్కను ఇనుప ముక్కలకు దగ్గరగా తీసుకువెళ్తే ఆ ఇనుప ముక్కలన్నీ అయస్కాంతమునకు దగ్గరగా లాగబడి దాని చుట్టూ అతుక్కుపోయినట్టు. భూమి కూడా అదే విధముగా ఏర్పడింది.  

భూమి
ఇలా ఏర్పడిన భూమి తొలినాళ్లలో ఒక చిన్న శకలంగా ఉండి తనను ఢీకొనే ఇతర శకలాలను తనలో కలుపుకుంటూపోయింది. అలా తొలినాళ్లలో అస్తవ్యస్తముగా నిరాకారముతో ఉన్న భూమి కాలక్రమంలో పూర్తి స్వరూపాన్ని సంతరించుకుంది.
లేఖనాల్లో వైరుద్ధ్యం లేదుభూమి నిరాకారముగా ఉన్నదని చెప్పబడిన వాక్యము 'ఆది'యందు(ఆదికాండము 1:1) విషయము.అనగా ఆవిర్భవ కాలములో ఉన్న భూమి గురించి చెప్పబడినది.యెషయా 45:18 లో చెప్పబడిన వాక్యమును పరిశీలించినట్లయితే "నివాస స్థలమగునట్లు దాని (భూమిని) సృజించెను" అని చెప్పబడినది.అనగా మానవుడు సృజింపబడిన కాలములోని భూమి గురించి ఆ లేఖనము చెప్పబడినదని అర్థమగుచున్నది. ఆ లేఖనమునందు భూమిని కలుగజేసి,'సిద్ధపరచి', 'స్థిరపరచెను', అని ప్రత్యేకించి చెప్పబడిన పదాల అమరికను పరిశీలిస్తే మానవుని కొరకు భూమిని పలు దశల వారీగా రూపుదిద్దినట్లు అర్థమగును.