బైబిల్-సైన్సుPost Date:2013-09-13//No:17

చరిత్రలో నమోదు కాని ''ఒకరోజు ?'' బైబిల సత్యం అని రుజువు చేసిన నాసాసర్వ సృష్టికర్తయైన దేవుడు లేనే లేడని తలంచే కొందరు శాస్త్రజ్ఞులు బైబిలు సత్యజ్ఞానమని గ్రహింపలేని కొందరు విజ్ఞులకు, ఆయన అద్భుత శక్తి ప్రభావములను, ఆయన సార్వభౌమత్వమునుఋజువు పరిచే సంఘటన ఇటీవల నాసా {అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం}లో జరిగింది.
చరిత్రలో
నాసా స్పేస ప్రోగ్రాం కన్సల్టెంట గా పనిచేస్తున్న హెరాల్డ హిల ఆ విషయాన్ని ఈ విధంగా వెల్లడించారు. కొందరు అంతరిక్ష వ్యోమగాములు మరియు శాస్త్రవేత్తలు మేరీల్యాండ లోని పరిశోధనా కేంద్రంలో కొన్ని కంప్యూటర్లు పరిశోధనలు చేస్తున్నారు. రాబోయే 100 మరియు 1000 సంవత్సరాలలో సూర్య చంద్ర నక్షత్రాల మరియు గ్రహాల కదలికలు, వాటి వాటి స్థానచలనాలు, కంప్యూటర ద్వారా అంచనాలు వేయడమే వాళ్ళ పరిశోధన. రాబోయే శతాబ్దాలలో ఆకాశ నక్షత్ర స్థానాలను అంచనా వేయడం చాలా కీలకమైన అంశం. ఎందుకంటే ఈ కీలక అంచనాల ఆధారంగానే కొన్ని వందల మానవ నిర్మిత శాటిలైట వాటి నిర్దిష్టమైన కక్ష్యలలో అంతరిక్షంలో పనిచేస్తుంటాయి. ఈ అంచనాలు సెకండ్లు, మిల్లీ సెకండ్లుతో సహా చాలా ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే శాటిలైట్లు అంతరిక్షంలో గ్రహాలను డీకొనే భయంకర విపత్తు కలిగే ప్రమాదం ఉంది!! భవిష్యత్తులో గ్రహాల కదలికలు, వాటి స్థానాలను లెక్కించే ప్రక్రియలో జరిగిపోయిన కాల పరిస్థితులపై కూడా శాస్త్రవేత్తలు ఆధారపడతారు. గడచిన కొన్నివేల సంవత్సరాలలో గ్రహాలు ఏ దినాన ఏ స్థానంలో ఉండినవో ఖచ్చితంగా లెక్కకట్టగలిగే శక్తివంతమైన కంప్యూటర్లు నాసా కేంద్రంలో ఉన్నాయి. తమ వద్ద గల డేటా ఆధారంగా ఈ లెక్కలు కడుతున్న సమయంలో ఒక దినాన ఒక రెడ సిగ్నల కనిపించింది. ఒకటికి రెండుసార్లు అనేకసార్లు తిరగవేసినా ఈ మిస్టరీ ఏమిటో అంతుపట్టలేదు సైంటిస్టులకు. అంటే కాల గమనంలో ఒక దినం నమోదు కాకుండా పోయింది. ఇది అసాధ్యం అని శాస్త్రవేత్తలు తర్జనభర్జన పడ్డారు. ఆ శాస్త్రవేత్తల బృందంలో వున్న ఒక క్రిస్టియన సైంటిస్టుకు అకస్మాత్తుగా ఒక విషయం జ్ఞాపకానికి వచ్చింది. 'సండేస్కూలులో ఒక కధ చెప్పేవారు..... సూర్యుడు ఒక రోజు అస్తమించకుండా ఆగిపోయాడని... ' అదే సంగతి తోటి శాస్త్రవేత్తలకు చెప్పాడు. అసంభవం అని తలలు అడ్డంగా ఊపుతున్న వారికి బైబిల తెరిచి యెహోషువ గ్రంధంలోని వాక్యం చదివి వినిపించాడు. 'యెహోవా ఇశ్రాయేలీయుల యెదుట అమోరీయులను అప్పగించిన దినమున, ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్ధన చేసెను. - సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగతీర్చుకొను వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను' అను మాట యాషారు గ్రంధంలో వ్రాయబడియున్నది గదా! సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి యించుమించు ఒక నాడెల్ల అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందుగాని దానికి తరువాత గాని యుండలేదు. {యెహోషువ 10:12-14} వాక్యం స్పష్టంగా ఉంది. కాలం తన పరుగులో ఒక దినం ఆగిందని, సూర్యుడు దేవుని మాటకు లోబడి ఒక రోజంతా అస్తమించలేదని, సత్య వాక్యమునే కంప్యూటర్లు సమర్ధిస్తున్నాయి. ఆశ్చర్యచకితులైన నాసా శాస్త్రవేత్తలు మరింత పరిశోధనలు చేయగా 'ఆగిపోయిన సమయం' 23 గంటల 20 నిమిషాలు అని మాత్రమే తేలింది. ఇదేమిటి? 24 గంటలు కదా ఇవ్వాలి? వారు మళ్ళీ బైబిల రెఫర చేయగా ఒక చిన్నమాట వారిని మరింత అబ్బుర పరచింది. 13వ వచనం 'ఇంచుమించు ఒక నాడెల్ల' అంటే ఖచ్చితంగా 24 గంటలు కాదు గాని యించుమించు.... అనగా 23 గంటల 20 నిమిషాలు మాత్రమే సూర్యుడు ఆగిపోయాడు. మరి ఇంకా 40 నిమిషాలు ఏమైనట్లు? ఈ 40 నిమిషాలు తేడా సరి చేయబడనట్లయితే ఆకాశంలో యాక్సిడెంట్స తప్పవు ! శాస్త్రవేత్తలు మరల బైబిల వెతికారు - మతిపోయే మరియొక సత్యం 2వ రాజుల గ్రంధంలో కనుగొన్నారు. 'ఆ దినములో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా... ప్రవక్తయగు యెషయా యెహోవాను ప్రార్ధింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద పదిమెట్లు ముందరికి నడిచిన నీడ పది మెట్లు వెనుకకు తిరిగి పోవునట్లు చేసెను {2 రాజులు 20:1,11}' గడియారపు పలక మీద 10 మెట్లు {డిగ్రీలు} లెక్కగడితే ఖచ్చితంగా 40 నిముషాల సమయం ! యెహోషువ కాలంలో 23 గంటల 20 నిమిషాలు, హిజ్కియా కాలంలో 40 నిమిషాలు వెరసి 24 గంటలు, ఇది విశ్వాసాన్ని శాసించే దేవదేవుని అద్భుత శక్తికి సాక్షిగా నాసా రికార్డులలోను మరియు ప్రతి విశ్వాసి హృదయంలోనూ నిక్షిప్తమై యున్న సత్యము.