మిషనరీ చరిత్రPost Date:2013-09-21//No:4

అలెన గార్డెనర (1794 - 1851)

అలెన

  అలెన్ గార్డెనర్ 1794వ సంవత్సరములో ఇంగ్లాండులో జన్మించెను. ఇతడు చిన్నప్పటి నుండి సాహస కృత్యాలు చేయాలి, క్రొత్త పనులు చేయాలి అనే ఆతృత కలిగియుండెడివాడు. 16 యేండ్ల ప్రాయంలో నావికా శిక్షణ ముగించుకొని నావికా దళములో చేరాడు. తన 20వ యేట ఒక నౌకకు కెప్టెన్ గా పనిచేసాడు. అంతేగాక, తన 20వ యేటనే చిన్నప్పుడు తన తల్లి నేర్పిన దేవుని వాక్యము, ప్రార్ధన, రక్షణ అనుభవాలను జ్ఞప్తికి తెచ్చుకొని; బైబిల్ కొని, చదవడం మొదలు పెట్టాడు.

            యేసుక్రీస్తు రక్షకుడని గ్రహించి ఆయనకు తన జీవితమును అప్పగించాడు. ఆ తరువాత ఆ ప్రేమ సువార్తను అడవి జాతుల వారికి కూడా ప్రకటించాలని ఆశపడి, దక్షిణాఫ్రికాలోని కీకారణ్యములలో ఉన్న 'జులు' అను జాతి వారికి సువార్త ప్రకటించడం మొదలు పెట్టాడు.

            అక్కడ యుద్ద పరిస్థితుల వలన ఆటంకము కలుగగా, అచ్చట నుండి దక్షిణ అమెరికాలోని 'అరౌకనియన్' ప్రజల మధ్య సేవ చేసెను. అక్కడ ఆటంకములు కలుగగా, మరొక చోటకు వెళ్ళెను.

            తన కెప్టెన్ పదవికి రాజీనామా ఇచ్చి మిషనెరీగా వచ్చిన అలెన్ కు అడుగడుగునా ఆటంకములే ఎదురాయెను. అయినను నిరుత్సాహము చెందక, తన సేవలో ముందుకు సాగుచు; అనేక స్థలములలో సేవ ప్రారంభించుటకు కారకుడాయెను. మరియు SAMS (South American Mission Society)ని స్థాపించెను.

             చివరికి 1851వ సంవత్సరములో అలెన్ మరణించి, ప్రభువు సన్నిధి కేగెను. ఈయన చెప్పుకోదగినంత పరిచర్య చేయనప్పటికి పునాదిలోని రాళ్ళు కనబడనట్లే, తాను ప్రారంభించిన సేవను అనేకులు కొనసాగించునట్లు పునాదిగా ఉండెను.