సంఘానికిPost Date:2013-10-04//No:12

సత్యమైన క్రైస్తవ సహవాసమునకు విలువనిచ్చుటఅనేక విషయములలో మానవుడు అభివృద్ది చెందినప్పటికీ, ప్రపంచమంతటా మానవ సంబంధములు అనేక సమస్యలు కలిగియున్నవి. వ్యాపారసంస్థలు మరియు వర్తకులు వారి పనివారిమద్య ఐక్యతకొరకు చాలా ఎక్కువ డబ్బు ఖర్చుచేయుచున్నారు మంచిది. మారుమనస్సు పొందని స్వార్థపరులైన అన్యజనులు ఒకరితో ఒకరు ఐక్యత లేనియెడల మనము అర్థము చేసుకొనవచ్చును. కాని నూతనజన్మ పొంది మరియు క్రీస్తునందు నూతన సృష్టిగా ఉన్న వారిలో అటువంటి సమస్యలు ఉండుట నిశ్చయముగా అసాధ్యము. ఒక వ్యక్తి జీవితమునకు మరియు పరిచర్యకు దేవుడే సర్వము అయినప్పుడు ఇతరులను ఆటంకపరచే చిన్న సమస్యలకు అవకాశము ఉండదు.
కాని ప్రపంచమంతటా, క్రైస్తవులు ఒకరితోఒకరు పోట్లాడుచూ మరియు తగువులాడుదురనుటకు సాక్ష్యము అవసరములేదు. ఇది ఎంతో బాధాకరము . చాలామంది తమ తోటి క్రైస్తవులతో కనీసము మాట్లాడరు. కొంతమంది వేరే క్రైస్తవుల ఎదుట నిలబడలేరు. విశ్వాసులుగా నటించే వారినిబట్టి లోకములో దేవుని నామమునకు అవమానము కలుగుచున్నది. ఒకరియెడల ఒకరికి ఉన్న మిక్కుటమైన ప్రేమనుబట్టియే వారు తన శిష్యులని లోకము గుర్తించునని యేసు చెప్పెను. క్రీస్తుశకము మొదటి రెండు శతాబ్దములలో ఇది పూర్తిగా నెరవేరినదని సామాన్యముగా చెప్పవచ్చును. లోకము క్రైస్తవులను చూచి ఆశ్చర్యపడి ఈలాగు అనుకొనిరి, “చూడుడి క్రైస్తవులు ఒకరినొకరు ఎంతగా ప్రేమించుచున్నారో”. ఈరోజు కథ వేరుగా ఉన్నది. లోకము ఈలాగు చెప్పుచున్నది, “చూడుడి క్రైస్తవులు ఒకరినొకరు ఎంతగా ద్వేషించుచున్నారో”.
సంబంధాలు నిజముగా చాలా ముఖ్యమైనవి. బహుమానములు, వరములు, పద్ధతులు, విధానములు మరియు ఆర్థిక పరిస్థితులు మొదలగునవన్నియు ఒకరియెడల ఒకరికి ఉన్న సంబంధము తర్వాత వచ్చును. సంఘసభ్యులమధ్య నిజమైన క్రైస్తవసహవాసము ఉన్నప్పుడే దేవుడు ఉద్దేశ్యప్రకారము అది లోకమునకు వెలుగుగా ఉండగలదు. అదేవిధముగా ఒక విశ్వాసి కూడా తన తోటి క్రైస్తవులతో ఇట్టి ప్రేమనియమముతో జీవించినప్పుడు అతడు ఇతరులకు జీవమిచ్చే పరిచర్య చేయగలడు.

సత్యమైన
ఇతర విశ్వాసులతో సహవాసము చేయలేని ఏ క్రైస్తవుడు కూడా దేవునితో సహవాసము చేయలేడని బైబిలులో చాలా వివరముగాను మరియు అనేకసార్లు చెప్పబడినది. నీ సహ విస్వాసితో నీవు ప్రేమతో నడవనియెడల, నీవు దేవునితో నడవలేవు. ప్రభువైనయేసు చనిపోయిన సిలువకు రెండు కమ్మీలు ఉన్నవి- ఒకటి నిలువుకమ్మి మరియు ఒకటి అడ్డకమ్మి. ప్రభువైనయేసు మానవునికి మరియు దేవునికి మధ్య సమాధానము తెచ్చుటకు (నిలువుకమ్మి) మాత్రమేగాక, మానవునికి మరియు మానవునికి మధ్య సమాధానము తెచ్చుటకు (అడ్డకమ్మి) కూడా వచ్చెను. నిలువుగాను మరియు అడ్డముగాను ఉన్న సంబంధములు రెండు కలసివెళ్ళును. ఒక దానిని విడచినట్లయితే ఇంకొకటి ఉండదు.
ప్రేమయొక్క అపోస్తలుడైన యోహాను ఈ విషయములో కొన్ని కఠినమైన మాటలు కలిగియున్నాడు. నిజముగా మార్పుచెందిన వ్యక్తి తన తోటి క్రైస్తవుడను ప్రేమించుటకు ఆరంభించును. ఒక వ్యక్తిలో ఇటువంటి ప్రేమ లేనియెడల, అప్పుడది నిజమైన మార్పు కాదనియు మరియు నిత్య మరణమునకు వెళ్ళుచున్నాడనియు చూపుచున్నది (1 యోహాను 3:14 ). ఒక వ్యక్తి దేవుని విషయములో ఎక్కడ ఉన్నాడని తెలుసుకొనుటకు సరియైన సిద్ధాంతము కలిగియుండుట మాత్రమే అపోస్తలులు చూడలేదు. అదే పత్రికలో యోహాను ఈలాగు చెప్పుచున్నాడు. ఒకడు దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినయెడల అతడు అబద్దికుడగును. గమనించండి. అతనికి తగినటువంటి పేరు విశ్వాసికాదు. కాని “అబద్దికుడు” మరియు దీనికి తిరుగులేదు. సహోదరుని చూచెదము కాని దేవుని చూడలేము అని చెప్పుచున్నాడు. నీవు చూచిన వానిని ప్రేమించలేనప్పుడు చూడనివానిని ప్రేమించుట అసాధ్యము (1 యోహాను 4:20).
ఇప్పుడు దీనిని అనేకమంది విశ్వాసుల అనుభవముతో పోల్చండి. క్రైస్తవ పరిచర్యలో చురుకుగా పాల్గొనుట మరియు కూటములలో మంచి అనుభూతి పొందుటయే దేవుని ప్రేమించుట అని అనుకొనుచున్నారు. ఇది చాలా మోసకరమైనదికావచ్చును. ఇతర విశ్వాసులతో సహవాసము లేకుండానే “ అద్భుతమైన ప్రార్థనా సమయము” మరియు “వారి సేవలో అద్భుతమైన ఫలములు” పొందినట్లు కొంతమంది నాకు చెప్పియున్నారు. దేవునికుటుంబ సభ్యులమీద పగ(అసూయ) పెట్టుకొని వారితో సమాధానపడకుండా వారు దేవునితో ఏ విధముగా నడువగలరు. నిశ్చయముగా లేఖనములను గ్రహించకుండునట్లు సాతాను వారి మనస్సునకు గ్రుడ్డితనము కలుగచేసెను.
ఇతర విశ్వాసులతో మన సహవాసము చెడిపోయినప్పుడు మనము ఎంత నష్టపోయెదమో గుర్తించలేనివారముగా ఉన్నాము. మనము “పరిశుద్ధులందరితో” కలసి క్రీస్తు ప్రేమయొక్క వెడల్పు, పొడుగు, లోతు మరియు ఎత్తును కనుగొని మరియు దేవుని సంపూర్ణతతో నింపబడెదమని బైబిలు చెప్పుచున్నది ( ఎఫెసీ 3:17-19). దేవుడు మనలను ఏ విశ్వాసుల మధ్య ఉంచియున్నడో వారితో మనము సహవాసము కలిగియుంటేనే క్రీస్తుప్రేమను మరియు దేవుని సంపూర్ణతను అనుభవపూర్వకముగా ఎరిగెదము.
తన తోటి క్రైస్తవుడినుండి ఎవరైనా వేరైనయెడల, ఆ వ్యక్తిద్వార తనకు కలిగే క్రీస్తుప్రేమను మరియు కృపను పోగొట్టుకొనుచున్నాడు. ప్రేమనియమముతో మనము జీవించలేనట్లయితే, క్రీస్తుయొక్క సర్వసంపదలు మరియు దేవుని పరిపూర్ణతను పొందకుండా మనకు మనమే హాని చేసుకొనుచున్నాము.