చర్చి చరిత్రPost Date:2013-10-01//No:7

సెయింట జార్జ ఆర్తోడాక్స చర్చి, అదూర్

సెయింట
సెయింట్ జార్జ్ ఆర్తోడాక్స్ చర్చి, అదూర్ పట్టణానికి 13 కి.మీ.ల దూరంలో ఉన్న చందనపల్లి గ్రామంలో కలదు. ఈ చర్చిని 1810 సంవత్సరంలో నిర్మించారు. దక్షిణ భారత దేశంలో అతి పెద్ద చర్చిగా చెపుతారు. ఈ చర్చికి ఇంగ్లాండ్ దేశ ప్రధాన మతగురువు పేరు సెయింట్ జార్జి గా నామకరణం చేశారు. చిర్చి గతంలోని మొదటి నిర్మాణం తర్వాత అనేక మార్లు పునరుద్ధరించారు. పునరుద్ధరణలో ఇండో సార్సెనిక్ శిల్పాలు ఉపయోగించారు. ఈ చర్చి దాని శిల్ఫ శైలి అద్భుతాలకు పేరు గాంచింది. క్రైస్తవ, ముస్లిం, హిందూ కట్టడాల తీరు కలిగి ఉంటుంది. దీని గోపురాలు గోధిక్ శైలి, సీలింగ్ పర్షియన్ పద్ధతిలో ఉంటుంది. దీనిని కొంతమేరకు ఇటీవలి కాలంలో రోమ్ లోని సెయింట్ పీటర్స్ బేసిలికా వలే నిర్మాణం చేశారు. చర్చిలో ఒక రాతిపై మతప్రవక్తల, దేవ దూతల శిల్పాలు చెక్కడం ఒక ప్రధాన ఆకర్షణ. చెంబుడుప్పు అనే ఒక పండుగ వేడుకలు మే నెలలో ప్రతి ఏటా జరుగుతాయి.