బైబిల్-చరిత్రPost Date:2013-09-20//No:9

బైబిలు అనువాద చరిత్రదైవావేశంతో ప్రత్యక్ష పరచబడి , దైవ జనులచే రాయబడ్డ పరిశుద్ధ లేఖనాలే బైబిలు.
ఇది 66 గ్రంథాల సంకలనం. 40 మంది గ్రంథకర్తలచే 1600 ల సంవత్సరాల కాల వ్యవధిలో రాయబడింది.
లిపి ఏర్పడ్డ ప్రారంభంలో పాపిరస్, పశుచర్మం, వెల్లం పై రాయబడ్డ అనువాదం క్రమేనా లిపి ఉన్న భాషలకే పరిమితం కాక లిపి లేని భాషలలోను , అంధుల కొరకు బ్రెయిలీ లిపిలోను చేయబడి ప్రస్తుతం యంత్రానువాదం (machine/computer translation) వరకు విస్తరించింది.

బైబిలు అనువాదాల గురించి తెలుసుకునే ముందు అనువాదం అంటే ఏమిటో తెలుసుకోవడం అవసరం. 'అనువాదం' అంటే ఒక భాషలోని విషయాన్ని మరో భాషలో ప్రకటించడం. తెలుగులో దీన్ని తర్జమా లేదా భాషాంతరీకరణ అంటారు.

ఇప్పడి వరకు వచ్చిన బైబిలు అనువాదాల్ని మూడు భాగాలుగా విభజించడం జరిగింది.
1) ప్రాచీన బైబిలు అనువాదాలు
2) ఆంగ్ల బైబిలు అనువాదాలు
3) తెలుగు బైబిలు అనువాదాలు
ప్రాచీన బైబిలు అనువాదాలు క్రీ.పూ.400 లో క్రీ.పూ. 2-3 శతాబ్దాలలో ఎక్కువగా చేయబడ్డాయి. వీటిలో చెప్పుకోదగినవి సిరియక్, లాటిన్, ఇథియోపియా, గోథిక్, ఆర్మేనియన్, అరబిక్, పర్షియన్, స్లావానిక్, ఆంగ్లోశాగ్జన్, జర్మన్ ఇత్యాది అనువాదాలు. 
వీటిలో ప్రాచుర్యం వహించినవి సెప్తాజింట్, పెషిట్టా, వల్గేటు, జర్మన్ అనువాదాలు.
బైబిలు
తెలుగు బైబిలు అనువాద చరిత్ర:
క్రీస్తు శిష్యుడైన తోమా తర్వాత భారత దేశానికి వచ్చిన వారు 'రోమన్ క్యాథలిక్కులు'.
వీరు మొదట భారతీయ భాషల్లోకి బైబిలు అనువదించలేదు. వీరి తర్వాత వచ్చిన 'ప్రొటెస్టెంటు' మిషనరీలు ఈ అనువాద కార్యక్రమాన్ని చేపట్టారు. భారత దేశ భాషల్లోకి బైబిలును మొదటిగా అనువాదం చేసినవాడు 'జీగెన్ బాల్గ్'. ఇతడు తమిళం లోకి బైబిలును అనువదించాడు. ఈ విధంగా ప్రారంభమైన బైబిలు అనువాదం లిపి ఉన్న అన్ని భారతీయ భాషల్లోకి అనువదించబడటమే కాక లిపి లేని లంబాడి, కోయ, గొండి, కుపి, కొండదొర, గదబ ఇతర ఎన్నో భాషల్లోకి అనువదించబడటం నిజంగా విశేషం.
ఈ క్రింది అనువాదాల్ని పరిశీలిస్తే , తెలుగులో ఎన్ని అనువాదాలు వచ్చాయో తెలుస్తుంది.

బెన్జ్ మెన్ షూల్జ్ అనువాదం: 
బైబిలును మొట్ట మొదట అనువదించిన వాడు జర్మన్ లూథరన్ మిషనరీ అయిన డా : బెన్జ్ మెన్ షూల్జ్ . ఇతడు తెలుగు భాష నేర్చుకోవడానికి 20 సవత్సరాలు కృషి చేసి 1727 లో కొత్త నిభందన, 1732 లో పాత నిభందనను అనువదించాడు. కాని అది ముద్రించబడలేదు. ఇప్పటికి ఆ ప్రతులు జర్మనీలో ఉన్నాయి. ఇతడు తెలుగు అనువాదానికి ముందు తమిళంలో కూడా బైబిల్ ని అనువదించాడు.

ఫిలిప్ ఫెబ్రియస్ అనువాదం:
ఇతడు 1742 లో జర్మని నుండి వచ్చిన లూథరన్ మిషనరీ. ఇతడు కూడా బైబిల్ ని తెలుగులోకి అనువదించాడు కాని అది ప్రచురింపబడలేదు.

కెప్టెన్ డాడ్స్ :
ఇతడు ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసిన స్కాట్లండు దేశస్థుడు. తాను మిషనరీ కానప్పటికీ బైబిల్ ని తెలుగు భాషలోకి అనువదించాలన్న అభిలాషతో 1795 లో ఆరంభించాడు. కాని ఆ అనువాదం ముగించకుండానే జ్వర పీడితుడై మరణించాడు. ఆయన సహోద్యోగులకి అతని అనువాదం గురించి తెలియనందు వల్ల ఆ కాగితాల్ని కాల్చి వేశారని పందితాభిప్రయాం.

విలియం కేరి: 
ఆధునిక ప్రేషిత పితామహుడు (father of modern day missions) గా పేరు గాంచిన విలియం కేరి తెలుగులోకి బైబిల్ ని అనువదించాడు. ఇతడు ఇంగ్లాండు దేశస్థుడైన 'బాప్టిస్టు మిషనరీ' ఇతడు 1793 నుండి 1834 వరకు 40 సంవత్సరములు భారత దేశం లో మిషనరీగా పనిచేసి , 15 స్థానిక భాషల్లోకి బైబిల్ ను అనువదించాడు. వాటిలో తెలుగు కూడా ఒకటి. విలియం కేరి 1805 లో బైబిల్ ని తెలుగులోకి అనువదింప మొదలిడి క్రొత్త నిభందనను , పాత నిభంధనలోని కొన్ని భాగాల్ని 1809 లో ముగించాడు. 1818 లో మొట్ట మొదటిగా క్రొత్త నిభందన తెలుగు భాషలో మద్రాసులో ప్రచురింప బడింది. తర్వాత మూడు సంవత్సరాలకు 1821 లో పాతనిభందనలో మొదటి 5 గ్రంథాలు తెలుగులో ప్రచురించబడ్డాయి.

జార్జి క్రాస్ , ఆగస్టస్, డిగ్రాంజెస్, అనువాదం:
వీరు లండన్ మిషనరీ సొసైటి ద్వారా క్రైస్తవ్య ప్రచారార్ధం పంపబడ్డారు. క్రాస్ 1808 లో మరణించగా ఈ అనువాద కార్యభారమంత డిగ్రాంజెస్ పై పడింది. బ్రాహ్మణులలో నుండి క్రైస్తవ మతాన్ని స్వీకరించిన 'ఆనంద రాయరు' అనే తెలుగు పండితుని సహాయంతో ఇతడు బైబిల్ ని అనువదించాడు. వీరి అనువాదానికి ముందే వెలువడ్డ తమిళ బైబిల్ కూడా వీరికి సహాయపడింది. డిగ్రాంజెస్ 1810 సంవత్సరంలో జూలై 12 న వ్యాధిగ్రస్తుడై మరణించాడు. ఇతని మరణానంతరం 1812 లో నాలుగు సువార్తలు కలకత్తా కరస్పాండింగ్ కమిటి వారి ఆర్ధిక సహాయంతో ముద్రించబడి ప్రచురించబడ్డాయి.