బైబిల్-చరిత్రPost Date:2014-05-16//No:13

ఆదిమ క్రైస్తవ దస్తావేజులుమొదటి మూడు శతాబ్దములలో యున్న క్రైస్తవులు క్రీస్తును గూర్చి ఎట్టి అభిప్రాయమును కలిగియుండిరో గమనించుదాం.

రోమాలో యున్న క్లెమెంతు : క్రీ||శ 30లో క్లెమెంతు జన్మించాడు. అతడు అపోస్తలుల సమకాలికుడు. అతడు క్రీ||శ 92-100 సంవత్సరములలో రోమా పట్టణ బిషప్పుగా యుండి 95 సం||లో కొరింధీయులకు ఒక పత్రిక వ్రాసెను. అతడు ఫిలిప్పీ 4:3లో చెప్పబడిన క్లెమెంతు అని కొందరు పండితులు భావిస్తారు.

ఈ క్లెమెంతు కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 32వ అధ్యాయములో ఇట్లు వ్రాసాడు 'యాకోబు తన సహోదరుని కారణము వలన నమ్రతతో తన స్వంత దేశమును వీడి లాబాను యొద్దకు చేరి అతనికి పరిచర్య చేసెను. అతనికి ఇశ్రాయేలీయుల 12 గోత్రముల రాజదండము ఇయ్యబడెను.... అతని నుండియే మన ప్రభువైన యేసుక్రీస్తు కూడ శరీర రీతిగా ఉద్భవించెను'.24వ అధ్యాయములో క్లెమెంతు ఇట్లు వ్రాసాడు : 'ప్రియులారా, భవిష్యత్‌ పునరుత్థానముండునని మన ప్రభువు నిరంతరము ఎట్లు నిరూపించుచున్నారో గమనింతుము. మన ప్రభువైన యేసుక్రీస్తును మృతులలో నుండి లేపుట ద్వారా ప్రధమ ఫలముగా ఆయన నర్పించెను'.

బైబిలు ముగింపు జరిగిన తరువాత సంఘనాయ కుడొకడు వ్రాసిన ఆరంభథ వ్రాతయిది. యేసు శారీరకంగా యాకోబు సంతతి నుండి ఉద్భవించారనీ, మనము కూడ మృతుల పునరుత్థానము పొందుదుమని నిరూపించుట కొరకు దేవుడు యేసుక్రీస్తును మృతులలోనుండి లేపారని అది చెప్పుచున్నది.

ఇగ్నేషియస్‌ : సిరియాలో యున్న అంతియొకయులో ఇగ్నేషియస్‌ క్రీ||శ 107-110 సం||లో బిషప్పుగా యుండెను. అతడు వ్రాసిన ఏడు పత్రికలు ఆదిమ క్రైస్తవ వ్రాతలలో చాలా ప్రాముఖ్యమైనవి. క్రీ||శ 117వ సం||లో అతడు ట్రాజన్‌ చక్రవర్తిచే సింహములకు ఆహారముగా రోమీయుల క్రీడా ప్రాంగణములో పడవేయబడెను.

అతడు వ్రాసిన పత్రికలలో యేసుయొక్క దైవత్వాన్ని మానవత్వాన్ని కూడ అతడు వక్కాణించెను. చంపబడుటకు అతడు రోమా కొనిపోబడుచుండగా ఒక ఉత్తరము వ్రాసాడు. అందులో యేసుయొక్క జననం, మరణం సమాధి పునరుత్థానములు వాస్తవములని ప్రకటించాడు.'మన ప్రభువైన యేసుక్రీస్తు దావీదు సంతతి వాడై యుండి దేవుని సంకల్ప ప్రకారము పరిశుద్ధాత్ముని వలన మరియ గర్భములో ఉద్భవించెను. ఆయన జన్మించెను. తన కాంక్ష వలన నీటిని పవిత్ర పరచునట్లు బాప్తిస్మము పొందెను' అని అతడు ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 18వ అధ్యాయములో వ్రాసాడు.

'దావీదు సంతతివాడైన యేసుక్రీస్తు, మరియు కుమారుడై నిశ్చయముగా జన్మించెను. ఆయన అన్నపానములు పుచ్చుకొనెను. పొంతి పిలాతు వలన నిశ్చయముగా హింసింపబడెను. భూమ్యాకాశముల సాక్షిగా సిలువవేయబడి మృతి నొందెను. మరియు ఆయన నిశ్చయముగా తన పరలోక తండ్రిచేత మృతులలో నుండి లేపబడెను. మరియు ఆయన యందు విశ్వాసముంచిన మనలను కూడ ఆయన లేపును' (ట్రాలియన్స్‌)

ఇగ్నేషియస్‌ ఇంకా ఇట్లు వ్రాసాడు : 'ఆయన శరీరమును బట్టియు శక్తిని బట్టియు దేవుని కుమారుడు. నిశ్చయముగా కన్యకు జన్మించెను. నీతియావత్తు నెరవేర్చబడునట్లు యోహానుచే బాప్తిస్మము పొందెను. చతుర్ధాతిధిపతియైన హేరోదు వలనను పొంతి పిలాతు వలనను మన కొరకు శరీరములో నిశ్చయముగా మేకులతో సిలువకు కొట్టబడెను. ఆయన పునరుత్థానమును బట్టి అన్ని తరముల వారికి గురుతునిచ్చెను. ఆయన పునరుత్థానము తరువాత శరీరముతో యుండెను. దీనిని నేనెరుగుదును, నమ్ముదును. ఆయన పేతురుకు అతనితోయున్న వారికి కనబడినప్పుడు, 'మీరు నన్ను ముట్టుకొని చూడుడి; శరీరములేని భూతమును కాదు' అని వారికి చెప్పెను. వెంటనే వారాయనను ముట్టుకొనిరి. ఆయన రక్తమాంసములను బట్టి వారాయనను హత్తుకొనియుండిరి, విశ్వసించిరి. అందువలననే వారు మరణమును సయితము లెక్కచేయలేదు గాని మరణానికి అతీతులైరి. తిరిగిలేచిన తరువాత ఆయన వారితో కలిసి భోజనం చేసారు, పానము చేసారు' (స్మర్నియన్స్‌).ఇగ్నేషియస్‌ (క్రీ||శ 110-115) లో మెగ్నీషియనులకు అతడు పంపిన ఉత్తరంలో ఇట్లు వ్రాసాడు : 'మన నిరీక్షణయైన యేసు యొక్క జననము, శ్రమలు, పునరుత్థానములు యదార్ధములు. అవి గవర్నయిన పొంతి పిలాతు కాలములో సంభవించెను.

యేసు రక్తమాంసములు గల వ్యక్తికాదని ఒక గుంపువారు చేసే దుష్ట్ర ప్రచారమును త్రిప్పికొట్టుటకు ఇగ్నేషియస్‌ చాలా వ్రాసాడు. ఇగ్నేషియస్‌ వ్రాసిన సంగతులు ఆధునిక విమర్షకులకు కూడ జవాబుగా యున్నది. ఇగ్నేషియస్‌ యొక్క పత్రికలను బట్టి రెండవ శతాబ్దపు ఆరంభములో యున్న క్రైస్తవులు యేసుక్రీస్తు పరిపూర్ణమానవుడు, పరిపూర్ణ దేవుడని విశ్వసించినట్లు తెలియనగును.

ఏరిస్టయిడ్స్‌ : ఏరిస్టయిడ్స్‌ గ్రీకు వేదాంతి, క్రైస్తవుడు. క్రీ||శ 125లో హాడ్రియన్‌ చక్రవర్తి ఏధెన్సును సందర్శించినప్పుడు యేసునందలి భయభక్తులను సమర్ధించుచు ఒక వాదన నతడు ఆయనకు సమర్పించాడు. అతడిట్లు చెప్పాడు'క్రైస్తవుల మతమునకు యేసుక్రీస్తు మూలము. ఆయనే మెస్సీయ. ఆయన సర్వోన్నతుని దేవుని కుమారుడని పిలువబడ్డారు. దేవుడు పరలోకము నుండి దిగి వచ్చాడని, ఒక హెబ్రీ కన్యక ద్వారా ఆయన శరీరమును ధరించారనీ చెప్పబడింది. దేవుని కుమారుడు మానవ కుమార్తెలో జీవించారు. యిది సువార్తలలో బోధింపబడినది. అది మానవుల మధ్య ప్రకటింపబడినది. మీరు కూడ దానిని చదివితే దీనిలో యున్న శక్తిని గ్రహించగలరు. ఈ యేసు హెబ్రీయుల జాతిలో పుట్టెను. ఆయన అవతారము యొక్క ప్రయోజనమును నెరవేర్చుటకు ఆయనకు 12 మంది శిష్యులుండిరి. గాని ఆయన యూదులచే పొడవబడెను, చనిపోయెను, సమాధి చేయబడెను. మూడవ దినమున మృతులలో నుండి తిరిగి లేచెనని చెప్పబడెను. తదుపరి ఆయన పరలోకమున కారోహణుడాయెను. అటు తరువాత ఈ 12 మంది శిష్యులు నాటి లోకమంతా ప్రకటించి ఆయన ఘనత, మహిమలను గూర్చి సాక్ష్యమిచ్చుచుండిరి. గనుక వారి వర్తమానాన్ని నేడు విశ్వసించి యున్న వారందరు క్రైస్తవులనబడుచున్నారు. వారు ప్రఖ్యాతిగాంచినవారు'.

ఖ్వాడ్రేటస్‌ : హేడ్రియన్‌ చక్రవర్తి ఏధెన్సు పురమును సందర్శించిన సందర్భములో, ఏధెన్సు
ఆదిమ