పుస్తక పరిచయంPost Date:2013-10-13//No:14
Feature image


  • Post date2013-10-13
  • పుస్తక వేల     ₹:75/-   
  • పేజీలు 286
  • ప్రతులు none
  • డాక్టర్‌ పి.బి.మనోహర్‌ డోర్‌.నెం.8-17-11, బాలాజీరావు పేట, తెనాలి - 522201

144 కధలు

డాక్టర్‌ పి.బి.మనోహర్‌ డిప్యూటీ స్టేషన్‌ సూపరింటెండెంట్‌గా వి.ఆర్‌ తీసుకొని సంపూర్ణ దేవుని సేవ, పరిచర్య చేస్తూ చిన్నపిల్లలను దృష్టిలో పెట్టుకుని వారికి సువార్త ఆత్మీయ సత్యాలను తెలియజేస్తూ చిన్న చిన్న కథల ద్వారా సరళమైన భాషలో హృదయాన్ని కదిలింపచేయు విధంగా ఇప్పటి వరకు 95 రకముల కధల పుస్తకములు 5000 కధలు వ్రాసారు. వాటిలో కొన్ని బాగా మెచ్చినవని అందరూ ప్రశంసించిన కొన్ని కధలను ఏరి 144 మరియు 116 కధలుగా పుస్తకములను విడుదల చేశారు. ఈ పుస్తకములు విశాలాంధ్ర బుక్‌ షాప్‌ ప్రముఖ క్రైస్తవ బుక్‌ సెంటర్స్‌లో లభిస్తున్నవి. ఈ కధల పుస్తకములను చదివి అనేకమంది ఎంతో మేలులు పొందుచున్నారు. ఈ పుస్తకములు హిందీ, కన్నడ, మళయాళం, తమిళం మరియు ఇంగ్లీషు భాషలలోకి అనువదించారు. మనోహర్‌ చిన్నపిల్లల కొరకు కధలనే కాక ప్రత్యేకంగా మ్యాజిక్‌ నేర్చుకుని పిల్లలకు సైన్స్‌ ద్వారా మ్యాజిక్‌ చేస్తూ అర్ధమైన విధంగా సువార్త పరిచర్య కొనసాగిస్తున్నారు. మహిహ శబ్దం వార పత్రికకు ప్రతీ వారము ఆయన రచించిన కధలను ఉపమానములుగా పాఠకులకు అందిస్తున్నాము. ఈ కధల ద్వారా అనేకమంది ఆశీర్వదించబడుచున్నారు. కధలు పంపిస్తున్న డాక్టర్‌ మనోహర్‌ గారికి పత్రిక తరపున ప్రత్యేక వందనములు తెలియజేస్తూ ఆయన చేస్తున్న ఈ పరిచర్య దేవుడు బహుగా ఆశీర్వదించాలని ప్రార్దిద్దాం.